హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

AP Movie Tickets online: సినిమా టిెకెట్లపై ఏపీ ప్రభుత్వ కీలక ఉత్తర్వులు.. జనవరి నుంచి కొత్త విధానం..

AP Movie Tickets online: సినిమా టిెకెట్లపై ఏపీ ప్రభుత్వ కీలక ఉత్తర్వులు.. జనవరి నుంచి కొత్త విధానం..

తాజాగా ఏపీలో పెరుగుతున్న కేసుల నేపథ్యంలో.. రాష్ట్రంలో జనవరి 8 నుంచి.. అంటే శనివారం నుంచి కోవిడ్ నిబంధనలు కఠినంగా అమలు చేయబోతున్నారని… నైట్ కర్ఫ్యూ విధిస్తున్నారని.. 50% ఆక్యుపెన్సీతో ధియేటర్లు రెస్టారెంట్లు, ఆఫీసులు నిర్వహిస్తారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఏపీ ప్రభుత్వం మాత్రం దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.

తాజాగా ఏపీలో పెరుగుతున్న కేసుల నేపథ్యంలో.. రాష్ట్రంలో జనవరి 8 నుంచి.. అంటే శనివారం నుంచి కోవిడ్ నిబంధనలు కఠినంగా అమలు చేయబోతున్నారని… నైట్ కర్ఫ్యూ విధిస్తున్నారని.. 50% ఆక్యుపెన్సీతో ధియేటర్లు రెస్టారెంట్లు, ఆఫీసులు నిర్వహిస్తారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఏపీ ప్రభుత్వం మాత్రం దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.

సినిమా టికెట్ల ఆన్ లైన్ విధానం (Movie tickets online system) అంశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government) మరో అడుగు ముందుకేసింది. ఇకపై ప్రభుత్వం ద్వారానే ఆన్ లైన్ టికెట్లు అమ్మకాలు సాగించేలా జీవో నెం. 142 జారీ చేసింది.

ఇంకా చదవండి ...

  సినిమా టికెట్ల ఆన్ లైన్ విధానం (Movie tickets online system) అంశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government) మరో అడుగు ముందుకేసింది. ఇకపై ప్రభుత్వం ద్వారానే ఆన్ లైన్ టికెట్లు అమ్మకాలు సాగించేలా జీవో నెం. 142 జారీ చేసింది. ఇటీవల అసెంబ్లీలో చేసిన చట్టసవరణ ప్రకారం జీవో జారీ చేసింది. ఆన్ లైన్ టికెట్ల అమ్మకాల బాధ్యతలను ఏపీ ఎఫ్.డీ.సీకి అప్పగిస్తున్నట్లు జీవోలో పేర్కొంది. ఇప్పటివరకు బుక్ మై షో (Book My show), జస్ట్ టికెట్స్ (Just Tickets), పేటీఎం (Paytm) లాంటి ఆన్ లైన్ పోర్టల్స్ ద్వారా టికెట్ల అమ్మకాలు జరుగుతున్నాయి. జనవరి 1 నుంచి ఐఆర్సీటీసీ (IRCTC) తరహాలో టికెట్లను విక్రయించనున్నారు. ఇప్పటికే ఏపీఎఫ్డీసీ ఆధ్వర్యంలో ఆన్ లైన్ టికెటింగ్ వెబ్ సైట్ రూపొందుతోంది

  సినిమా టికెట్ల అమ్మకాల విషయంలో అవకతవకలు జరుగుతున్నాయని.. దీని వల్ల పన్నుల ద్వారా వచ్చే ఆదాయం తగ్గిపోతోందని ప్రభుత్వం ఆరోపిస్తోంది. టికెట్ల అమ్మకాల్లో పారదర్శకత కోసమే ప్రభుత్వమే ఆన్ లైన్లో విక్రయించాలని నిర్ణయించినట్లు అసెంబ్లీలో చట్టసవరణ సందర్భంగా మంత్రి పేర్ని నాని తెలిపిన సంగతి తెలిసిందే. ఈ మేరకు కార్యాచరణ సిద్ధం చేసిన ప్రభుత్వం జనవరి 1 నుంచి నూతన విధానాన్ని అమలు చేయబోతోంది.


  ఇది చదవండి: 'పుష్ప' క్రేజ్ మామూలుగా లేదుగా..! సినిమా కోసం స్టూడెంట్ లీవ్ లెటర్..


  కొత్త వెబ్ సైట్లో విడుదలైన, విడుదల కాబోతున్న సినిమాల వివరాలను అందులో పొందుపర్చనున్నారు. వాటిలోనే సినిమా థియేటర్ల వివరాలు, ధరలను పేర్కొంటారు. వెబ్ సైట్ లేదా యాప్ ద్వారా ప్రేక్షకులు టికెట్లు బుక్ చేసుకునే అవకాశముంది. ఐతే ఆన్ లైన్ లో బుక్ చేసుకునే సౌలభ్యం లేనివారు నేరుగా థియేటర్లోని కౌంటర్ల వద్ద టికటెలు తీసుకునే అవకాశం ఉంటుందని గతంలో ప్రభుత్వం చెప్పినా.. తాజా ఉత్తర్వుల్లో అలాంటి వివరాలను పేర్కొనలేదు. దీన్నిబట్టి చూస్తే థియేటర్లో టికెట్లు తీసుకునే విధానానికి స్వస్తిపలికినట్లు అర్ధమవుతోంది. ఇకపై ఆన్ లైన్లో టికెట్లు తీసుకున్నవారికే సినిమా థియేటర్లలో అనుమతి ఉంటుందని ప్రభుత్వం జీవోలో స్పష్టం చేసింది.

  ఇది చదవండి: సినిమా టికెట్ల వివాదానికి క్లైమాక్స్ అదేనా..? ఏపీలో థియేటర్ల పరిస్థితేంటి..?


  ఇదిలా ఉంటే ప్రభుత్వం సినిమా టికెట్ల ధరలను కూడా తగ్గిస్తూ ఇటీవల జారీ చేసిన జీవోను హైకోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం నిర్ణయించిన ధరలను కొన్ని థియేటర్ల యాజమాన్యాలు హైకోర్టులో సవాల్ చేశాయి. దీనిపై విచారణ జరిగిన సింగిల్ జడ్జితో కూడిన ధర్మాసనం.. ప్రభుత్వ జీవోను సస్పెండ్ చేసి పాతపద్ధతిలోనే టికెట్లు విక్రయించుకోవచ్చని స్పష్టం చేసింది. ఐతే థియేటర్లు ముందుగా సంబంధిత జేసీకి దరఖాస్తు చేసిన తర్వాత అనుమతిస్తే ధరలు పెంచుకోవచ్చని సూచించింది. అలాగే టికెట్ల ధరలు నిర్ణయించేందుకు కమిటీని నియమించాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. మరోవైపు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును ప్రభుత్వం డివిజన్ బెంచ్ లో సవాల్ చేసింది. దీనిపై సోమవారం విచారణ జరగునుంది.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Cinema

  ఉత్తమ కథలు