హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

AP News: ఏపీలో క్యాన్సర్ ట్రీట్ మెంట్ ఇక ఈజీ.. ప్రభుత్వం కొత్త ఆలోచన.. త్వరలోనే అందుబాటులోకి

AP News: ఏపీలో క్యాన్సర్ ట్రీట్ మెంట్ ఇక ఈజీ.. ప్రభుత్వం కొత్త ఆలోచన.. త్వరలోనే అందుబాటులోకి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఇటీవల దేశంలో క్యాన్సర్ (Cancer) కేసులు ఎక్కువవుతున్నాయి. మారిన లైఫ్ స్టైల్ తో తెలియకుండానే క్యాన్సర్ మహమ్మారి కబళిస్తోంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం సరికొత్త ఆలోచన చేసింది.

  ఇటీవల దేశంలో క్యాన్సర్ (Cancer) కేసులు ఎక్కువవుతున్నాయి. మారిన లైఫ్ స్టైల్ తో తెలియకుండానే క్యాన్సర్ మహమ్మారి కబళిస్తోంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం సరికొత్త ఆలోచన చేసింది. గ్రామ స్థాయి నుంచే విలేజ్, వార్డ్ క్లినిక్స్ ద్వారా తొలిదశలోనే క్యాన్సర్ కేసులను గుర్తించి ప్రజలకు అవగాహన కల్పించనున్నారు. అంతేకాదు క్యాన్సర్ స్క్రినింగ్ పై గ్రామస్థాయి సిబ్బందికి ట్రైనింగ్ ఇవ్వనున్నారు. త్వరలోనే ఏపీ ప్రభుత్వం గ్రామ, వార్డు క్లినిక్స్ తో పాటు పీహెచ్ సీ పరిదిలో ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్టును అమలు చేయబోతోంది. దీని ద్వారా గ్రామస్థాయిలోనే విస్తృత స్క్రీనింగ్ ఏర్పాటు చేసి టెస్టులు నిర్వహించనుంది. క్యాన్సర్ ను 60-70 శాతం వరకు చివరి దశలో ఉన్నప్పుడే గుర్తిస్తున్నారు.

  దీంతో డబ్బు ఖర్చవడమే కాకుండా.. ఎక్కువ శాతం ఫలితం ఉండటం లేదు. దీంతో తొలిదశలోనే గుర్తిస్తే సులభంగా నయం చేయవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. క్యాన్సర్ గుర్తింపుతో పాటు చికిత్సకు అత్యంత సమర్ధవంతమైన వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావలని ఇటీవల సీఎం జగన్ వైద్య శాఖను ఆదేశించారు. ఏపీలో ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేయబోయే మెడికల్ కాలేజీలతో పాటు మొత్తం 27 కాలేజీల్లో క్యాన్సర్ చికిత్స కోసం లైనాక్ మెషిన్లు ఏర్పాటు చేయలని సీఎం ఇప్పటికే సూచించారు. అలాగే విశాఖపట్నం, తిరుపతి, గుంటూరు నగరాల్లో క్యాన్సర్ నివారణకు సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ ఏర్పాటుకు త్వరలోనే ప్రతిపాదనలు ప్రభుత్వానికి చేరనున్నాయి.

  ఇది చదవండి: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. నేటి నుంచి కొత్త జీతాలు


  క్యాన్సర్ లో 33 శాతం వరకు ముందుగా గుర్తించి చికిత్స అందిస్తే వెంటనే నయం అవుతుంది. ఐతే మహిళల్లో వచ్చే నోటి, రొమ్ము, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్లలో 49శాతం ప్రైమరీ స్టేజ్ లోనే గుర్తిస్తే చికిత్సకు పెద్దగా ఖర్చవదు. పైగా పూర్తిగా నయమవుతుంది. ముఖ్యంగా రొమ్ము క్యాన్సర్ ను ప్రాథమికంగా గుర్తిస్తే రూ.లక్షలోపు ఖర్చుతో 99శాతం నయమయ్యే అవకాశముంది. ఐతే మూడోదశకు చేరితే దాదాపు రెండు లక్షలు ఖర్చు చేసినా 29 శాతమే సక్సెస్ రేట్ ఉంటుంది.

  ఇది చదవండి: ఏపీలో కోట్లు పలికిన బార్ లు.. ప్రభుత్వానికి భారీ ఆదాయం.. వివరాలివే..!


  ప్రస్తుతం రాష్ట్రంలో కొత్త క్యాన్సర్‌ కేసులు 70 వేల వరకు ఉండే అవకాశముంది. పురుషుల్లో నోటి క్యాన్సర్ బాధితులు ఎక్కువగా ఉండగా.. మహిళల్లో బ్రెస్ క్యాన్సర్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం ఆరోగ్య శ్రీ ద్వారా పేదలకు ఉచితంగా క్యాన్సర్ ట్రీట్ మెంట్ అందిస్తోంది. ఈ పథకం ద్వారా 2019-21 మధ్య చికిత్స వ్యవయం 37శాతానిక పైగా పెరిగింది. గత ఆర్ధిక సంవత్సరంలో 1.20 లక్షల క్యాన్సర్ కేసులకు ట్రీట్ మెంట్ ఇచ్చారు.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Cancer

  ఉత్తమ కథలు