హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Good News: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఆరోగ్య శ్రీ పరిధిలోకి మరిన్ని చికిత్సలు.. వివరాలివే..!

Good News: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఆరోగ్య శ్రీ పరిధిలోకి మరిన్ని చికిత్సలు.. వివరాలివే..!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో పేద, మధ్య తరగతి ప్రజలకు ఆరోగ్య శ్రీ పథకం (Arogya Sri Scheme) ద్వారా ప్రభుత్వం ఉచిత చికిత్సలు అందిస్తోంది. ప్రస్తుతం ఈ పథకం కింద దాదాపు 2500 చికిత్సలను ఉచితంగా అందిస్తోంది. ఐతే ఈ పథకాన్ని మరింత విస్తృతం చేసేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

ఇంకా చదవండి ...

  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో పేద, మధ్య తరగతి ప్రజలకు ఆరోగ్య శ్రీ పథకం (Arogya Sri Scheme) ద్వారా ప్రభుత్వం ఉచిత చికిత్సలు అందిస్తోంది. ప్రస్తుతం ఈ పథకం కింద దాదాపు 2500 చికిత్సలను ఉచితంగా అందిస్తోంది. ఐతే ఈ పథకాన్ని మరింత విస్తృతం చేసేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఈ పథకంపై పలుసార్లు సమీక్షలు జరిపిన సీఎం జగన్.. ఇందులో మరిన్ని చికిత్సలు చేయించాలని ఆదేశించారు. దీంతో అధికారులు మార్పులు చేర్పులపై దృష్టిపెట్టారు. 2019 వరకు కేవలం తెల్లరేషన్ కార్డుల వారికి మాత్రమే ఆరోగ్య శ్రీ వర్తించేది. ఐతే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.5లక్షల లోపు వార్షిక ఆదాయం ఉన్న కుటుంబాలన్నింటికీ ఆరోగ్యశ్రీ వర్తింపజేసింది.

  ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్రంలోని మెజారిటీ ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందుతున్నాయి. అంతేకాదు గతంలో ఏపీ పరిధిలో 919, ఇతర రాష్ట్రాల్లో 79 ఆస్పత్రుల్లో మాత్రమే చికిత్సలు అందేవి. కానీ ఇప్పుడు 1700కు పైగా ఆస్పత్రుల్లో ట్రీట్ మెంట్ ఫ్రీగా అందుతోంది. ఇందులో ఇతర రాష్ట్రాల్లో 137 కార్పొరేట్, 17 సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో ఉచిత సేవలందుతున్నాయి. గతంలో ఆరోగ్య శ్రీ కింద కేవలం 1.059 రకాల చికిత్సలు అందేవి.

  ఇది చదవండి: శాటిలైట్ ప్రయోగం లైవ్ లో చూస్తారా..? అయితే ఇలా రిజిస్టర్ చేసుకోండి..


  ఐతే ఇప్పుడు మాత్రం వెయ్యి రూపాయలు దాటిన ప్రతి చికిత్సకు ఆరోగ్య శ్రీ వర్తిస్తోంది. వీటితో పాటు కరోనా, బ్లాక్ ఫంగస్, మిస్-సి వంటి జబ్బులూ ఇందులో చేరాయి. అలాగే ప్రస్తుతం 2,446 చికిత్సలు ఈ పథకంలో ఉండగా.. తాజాగా.. మరో 700 చికిత్సలను పథకంలో చేర్చడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ ప్రక్రియ పూర్తైతే మొత్తం చికిత్సల సంఖ్య 3వేలు దాటనుంది. ఐతే ఏయే చికిత్సలను ఇందులో చేర్చుతున్నారనేది ఇంకా తెలియాల్సి ఉంది.

  ఇది చదవండి: చంద్రబాబు వ్యూహం మారిందా..? ఢిల్లీ టూర్ పై ఆసక్తికర చర్చ


  రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీకి అనుబంధంగా ఆరోగ్యశ్రీ ఆసరా కార్యక్రమాన్ని కూడా అమలు చేస్తోంది. ప్రభుత్వం అందిస్తున్న చికిత్సల్లో 1.519 రకాల చికిత్సల్లో ఏ చికిత్స తీసుకొని వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని సూచిస్తే.. వారికి రోజుకు రూ.225 లేదా నెలకు రూ.5వేలు చొప్పున ఆరధిక సాయం అందిస్తోంది. ఇప్పటివరకు దాదాపు 10లక్షల మందికి ప్రభుత్వం సాయం చేసింది. ఆరోగ్యశ్రీ కింద చికిత్సలను పెంచడం ద్వారా మరింత మందికి మెరుగైన వైద్యం అందే అవకాశాలున్నాయి. ఈమేరకు త్వరలోనే ప్రకటన రానుంది.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Aarogyasri, Andhra Pradesh

  ఉత్తమ కథలు