Notices Govt Employees Union: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ప్రస్తుం ప్రభుత్వం (Government) వరెస్ ఉద్యోగుల సంఘాని (Employees Union)కి మధ్య వార్ తీవ్ర స్థాయికి చేరాయి. ఈ ఎపిసోడ్ విషయంలో ఏపీ సర్కార్ నోటీసులు జారీ చేసింది. ఉద్యోగులగా మీకు ఇచ్చిన గుర్తింపును ఎందుకు రద్దు చేయకూడదో 7 రోజుల్లో చెప్పాలని నోటీసుల్లో పేర్కొంది. మీడియా, పత్రికల్లో వచ్చిన వార్తల ఆధారంగా నోటీసులు జారీ చేస్తున్నట్లు తెలిపింది. సమస్యలపై ఇటీవల ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు (AP Government Employees) గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేశారు. వేతనాలు, ఆర్థిక ప్రయోజనాలపై తమను సంప్రదించే ఇతర మార్గాలున్నా.. గవర్నర్ ను ఎందుకు కలిశారని ప్రభుత్వం ప్రశ్నించింది. రోసా రూల్స్ ఉల్లంఘించినందుకు గుర్తింపును ఎందుకు రద్దు చేయకూగడదో చెప్పాలని నోటీసుల్లో స్పష్టంగా పేర్కొంది. ఉద్యోగులు రోసా రూల్స్ ఉల్లంఘించారని ప్రభుత్వం చెబుతోంది. ఈ నిబంధపల ఏలకలంఘనతోనే నోటీసులు జారీ చేసినట్టు సమాచారం.
మరోవైపు ప్రభుత్వం సకాలంలో జీతాలు చెల్లించడం లేదని, తమకు రావాల్సిన బకాయిలు ఇవ్వడం లేదని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నాయుకులు సూర్యనారాయణతోపాటు మరికొందరు ఇటీవల గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేశారు.
అంతేకాకుండా తాము దాచుకున్న డబ్బులను కూడా ప్రభుత్వం వాడుకుందని పేర్కొన్నారు. సకాలంలో జీతాలు చెల్లించాలని.. అందుకుగానూ తగిన చర్యలు తీసుకోవాలని ఆ దిశగా ప్రభుత్వాన్ని డైరెక్షన్ చేయాలని గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేశారు. అక్కడితోనే ఆగలేదు. తారువాత మీడియోతో మాట్లాడిన ఉద్యోగ సంఘాల నేతలు తీవ్ర విమర్శలు చేశారు.
అయితే ఏపీ ప్రభుత్వ ఉద్యోగులపై రాష్ట్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనికి సంబంధించి మంత్రులు కూడా ప్రభుత్వ ఉద్యోగుల సంఘంపై ఫైర్ అయ్యారు. ఏపీఎన్ జీవో అధ్యక్షులు బండి శ్రీనివాస్ కూడా సూర్యనారాయణపై చీఫ్ సెక్రటరీకి ఫిర్యాదు చేశారు. వీటన్నింటిని బేస్ చేసుకుని ఏపీ సర్కార్ నోటీసులు జారీ చేసింది. గుర్తింపును ఎందుకు రద్దు చేయకూడదో ఏడు రోజుల్లో చెప్పాలని పేర్కొంది.
ఇదీ చదవండి: రెబల్ ఎంపీ.. ఈ సారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా? ప్లేస్ ఫిక్స్ అయ్యిందా?
మరోవైపు ఏపీ ప్రభుత్వం ఉద్యోగుల సంఘం నేత సూర్యనారాయణపై ఆరోపణలు ఉన్నాయి. ఆయన వెనుక రాజకీయ పార్టీ ఉందని.. అందుకే ఆయన గవర్నర్ ను కలిశారని ఆరోపిస్తున్నారు. అలాగే వచ్చే ఎన్నికల్లో ఆయన ఆ పార్టీ నుంచి పోటీ చేసే అవకాశం ఉందని కూడా ప్రచారం జరుగుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, AP Politics, Employees