AP Hostels: హాస్టళ్లు అలా ఉండాలి.. అధికారులకు సీఎం జగన్ ఆదేశం

పిల్లలకు ఏం కావాలి? ఏం ఇస్తే బాగుంటుంది? వారికి ఏ విధంగా మంచి పౌష్టికాహారం ఇవ్వాలి? అనే అంశాలపై దృష్టి పెట్టాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు.

news18-telugu
Updated: October 1, 2020, 9:08 PM IST
AP Hostels: హాస్టళ్లు అలా ఉండాలి.. అధికారులకు సీఎం జగన్ ఆదేశం
ఏపీ సీఎం జగన్(ఫైల్ ఫోటో)
  • Share this:
మన కొడుకు లేక కూతురు హాస్టల్‌లో ఉండి చదివితే, అక్కడ ఎలా ఉండాలని కోరుకుంటామో, ఆ విధంగా మన ప్రభుత్వ హాస్టళ్లను మార్చాలని సీఎం జగన్ అన్నారు. మార్చాలి. అన్ని హాస్టళ్లలో నాడు–నేడు అమలు చేసి, వాటి పరిస్థితిని మార్చాలన్నది ప్రభుత్వ సంకల్పమని స్పష్టం చేశారు. హాస్టళ్లలో పూర్తి వసతులను నాడు–నేడులో కల్పిస్తామని ఆయన వెల్లడించారు. అన్ని హాస్టళ్లలో నాణ్యమైన ఆహారం, మంచి పరిశుభ్రత (శానిటేషన్‌), చక్కటి వాతావరణంతో పాటు, విద్యార్థులకు పుస్తకాలు, దుస్తులు ఉండాలని అన్నారు. ఆ పిల్లలకు కూడా బెల్టులు, దుప్పట్లు, అల్మారాలు, మంచాలు, ఇతర కనీస వసతులతో పాటు, తప్పనిసరిగా ఆహారంలో అన్ని రకాల పోషకాలు ఉండాలని సూచించారు.

‘జగనన్న గోరుముద్ద’ మాదిరిగా మెనూ ఉండాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు. జగనన్న విద్యా కానుకను హాస్టల్‌ విద్యార్థులకు కూడా ఇస్తాం కాబట్టి, హాస్టళ్లలో కూడా స్థితిగతులు పూర్తిగా మారాలని అధికారులకు స్పష్టం చేశారు. ముఖ్యంగా పిల్లలకు మంచి పౌష్టికాహారం ఇవ్వాలని తెలిపారు. దీనిపై మనం ఏది చెప్పినా, దాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని తెలిపారు. పిల్లలకు ఏం కావాలి? ఏం ఇస్తే బాగుంటుంది? వారికి ఏ విధంగా మంచి పౌష్టికాహారం ఇవ్వాలి? అనే అంశాలపై దృష్టి పెట్టాలని వెల్లడించారు. వీటన్నింటిపై పక్కాగా ప్లాన్‌ చేయాలని ఆదేశించిన సీఎం శ్రీ వైయస్‌ జగన్, వీలైనంత త్వరగా ఆ ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులకు నిర్దేశించారు.

రాష్ట్రంలో సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ, బీసీ సంక్షేమ, మైనారిటీ సంక్షేమ శాఖలకు సంబంధించి బాలురు, బాలికల కోసం మొత్తం 4772 హాస్టళ్లు ఉండగా, వాటిలో 4,84,862 మంది విద్యార్థిని విద్యార్థులు ఉన్నారని సమావేశంలో అధికారులు వెల్లడించారు. మొత్తం హాస్టళ్లలో దాదాపు 4 వేలు సొంత భవనాల్లో ఉన్నాయని వారు తెలిపారు. నాడు–నేడు రెండో దశ కార్యక్రమంలో ఆ హాస్టళ్లలో మార్పులు చేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అంజాద్‌బాషా, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పి.విశ్వరూప్‌తో పాటు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ శాఖలకు చెందిన పలువురు సీనియర్‌ అధికారులు హాజరయ్యారు.
Published by: Kishore Akkaladevi
First published: October 1, 2020, 9:08 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading