హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Nara Lokesh: పేరు మార్పు పిచ్చి పరాకాష్టకు చేరిందా..? సీఎం జగన్ పై నారా లోకేష్ సెటైర్.. తాజాగా మరో పేరు మార్పు

Nara Lokesh: పేరు మార్పు పిచ్చి పరాకాష్టకు చేరిందా..? సీఎం జగన్ పై నారా లోకేష్ సెటైర్.. తాజాగా మరో పేరు మార్పు

విజయనగరం ఆస్పత్రి పేరు మార్పుపై లోకేష్ ఫైర్

విజయనగరం ఆస్పత్రి పేరు మార్పుపై లోకేష్ ఫైర్

Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ లో ఒకప్పుడు రంగుల వివాదం తారా స్థాయికి చేరింది. అన్నింటికీ వైసీపీ రంగులు మారుస్తున్నారు అంటూ.. కోర్టు మెట్లెక్కే పరిస్థితి కూడా కనిపించింది. ఇప్పుడు పేరు మార్పు వివాదం అదే స్థాయిలో కనిపిస్తోంది. మొన్న ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ.. ఇప్పుడు మహారాజా ప్రభుత్వ ఆస్పత్రి.. దీంతో సీఎం జగన్ తీరుపై నారా లోకేష్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎమన్నారంటే..

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Vizianagaram, India

  Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. రోజుకో వివాదం తెరపైకి వస్తోంది. దీంతో అధికార, విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఒకప్పుడు ఏపీలో రంగుల వివాదం రచ్చ రచ్చ అయ్యింది. ప్రభుత్వ కార్యాలయాలకు.. గోపురాలకు సైతం వైసీపీ రంగులు (YCP Colors) వేస్తున్నారంటూ.. కొందరు కోర్టులను కూడా ఆశ్రయించారు. తరువాత కోర్టు సూచనలతో ఆ రంగుల వివాదం సద్దుమణిగింది.. ఇప్పుడు పేరు మార్పు వివాదంపై వైసీపీ (YCP), టీడీపీ (TDP) మధ్య వివాదం మొదలైంది. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ (NTR Health University) పేరు మార్పు రేపిన రాజకీయ దుమారం చల్లారకముందే.. మరో కొత్త వివాదం తెరపైకి వచ్చింది. ఇటీవల విజయవాడ (Vijayawada)లోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును మార్చి ప్రభుత్వం.. తాజాగా విజయనగరం (Vizianagaram) లో ఎంతో ఘన చరిత్ర ఉన్న మహారాజా ఆస్పత్రి పేరును కూడా ఒక్కరోజులో మార్చేసింది. మహారాజా ఆస్పత్రి పేరు మార్పు మహారాజా జిల్లా కేంద్రం ఆస్పత్రి పేరును ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిగా పేరు మార్చారు. అయితే, తాజాగా తీసుకున్న ప్రభుత్వ నిర్ణయంపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తెలుగుదేశం పార్టీ నేతలతోపాటు స్థానికులు పేరు మార్పును వ్యతిరేకిస్తూ ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు.

  విజయనగరం ఘటనపై స్పందించిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ .. సీఎం జగన్ తీరుపై ఫైర్ అయ్యారు. ప్రభుత్వ కార్యాలయాలు, భవనాల పేర్ల మార్పు కొనసాగుతుందన్నారు. జగన్ పిచ్చి పరాకాష్టకు చేరిందన్నారు లోకేష్. మహనీయులను అవమానించడమే సీఎం పనిగా పెట్టుకున్నారని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

  అంతే కాదు తమ విలువైన భూమి ఆస్పత్రికి ఇస్తే మహారాజా పేరు తొలగిస్తారా అని మండిపడ్డారు. మహారాజా కుటుంబం అప్పుడు ప్రజల సంక్షేమం కోసం నిర్మించతలపెట్టిన ఆసుపత్రికి విలువైన భూమిని ఇచ్చేసిందని లోకేష్ తన ట్వీట్ లో గుర్తు చేశారు. మరి దీనికి ప్రభుత్వం నుంచి ఎలాంటి కౌంటర్ వస్తుందో చూడాలి.

  ప్రస్తుతం వరుసగా రెండు ఆస్పత్రుల పేర్లు మార్చడంపై ప్రతిపక్ష పార్టీల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా టిడిపి శ్రేణులు ఆందోళన చేశారు. ఇది ఎంత మాత్రం సమంజసం కాదన్నారు. ముఖ్యంగా విజయనగరంలో ఆస్పత్రి పేరు మార్పుపైనా ఆగ్రహ జ్వాలలు మిన్నంటుతున్నాయి. గొప్ప ఔదార్యం ఉన్న మహారాజా పేరు ఉంటే తప్పేంటని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. కేంద్ర మంత్రిగా నిధులు కేటాయించి అశోక్ గజపతిరాజు ఆసుపత్రిని అభివృద్ధి చేశారని, అటువంటి ఆసుపత్రికి, రాత్రికి రాత్రి మహారాజా పేరును తొలగించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, Nara Lokesh, Vizianagaram

  ఉత్తమ కథలు