Home /News /andhra-pradesh /

GOVERNMENT EMPLOYEES WILL MEET CM JAGAN MOHAN REDDY SHORTLY THESE ARE THEIR DEMANDS NGS

PRC Fight: పీఆర్సీపై ఉత్కంఠ.. సీఎంతో భేటీకి ముందే జేఏసీ నేతల సమావేశం.. ఫిట్ మెంట్ పైనే పేచీ

సీఎం జగన్ (ఫైల్)

సీఎం జగన్ (ఫైల్)

PRC Fight: ఆంధ్రప్రదేశ్ లో పీఆర్సీ వ్యవహరాం ఉత్కంఠ పెరుగుతోంది. సీఎం జగన్ ఎలాంటి హామీ ఇస్తారన్న దానిపై ఉద్యోగులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆయన్ను కలవడం కంటే ముందే ఏఏ అంశాలపై చర్చించాలి అన్నదానిపై ఉద్యోగ సంఘాల నేతలు సమావేశమయ్యారు.

ఇంకా చదవండి ...
    PRC Fighting : ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో పీఆర్సీ (PRC) అంశం మరింత ఉత్కంఠ పెంచుతోంది. గత కొన్ని రోజులుగా ఇదే అంశం రాష్ట్రంలో హాట్ టాపిక్ అయ్యింది.  ఏపీ ప్రభుత్వం (AP Government)తో తాడే పేడో తేల్చుకునేందుకు కూడా ఉద్యోగ సంఘాలు సిద్ధమయ్యేదాక వెళ్లింది. దీనిపై ఉద్యోగ సంఘాల నేతలతో.. రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ (CS Shameer Sharma).. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల (Sajjala Ramakrishna Reddy).. ఆర్థిక మంత్రి బుగ్దన రాజేంద్రనాథ్ రెడ్డి (Finance Minster Buggana Rajendranath Reddy).. ఇలా అంతా విడతవారిగా చర్చలు జరిపారు. కానీ వారి హామీలపై ప్రభుత్వం ఉద్యోగులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఇలా అయితే ఎన్ని చర్చలు జరిపినా లాభం లేదని.. తమ కోరుకుతున్నదానికి.. ప్రభుత్వం చెబుతున్నదానికి చాలా తేడా ఉందని ఉద్యోగ సంఘాల నేతలు ఆరోపణలు చేశారు.. ఇలాంటి చర్చలు జరపాల్సిన అవసరం లేదని.. మీతో కుదరదు అంటే.. నేరుగా సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy)  తో కల్పించండి తమ సమస్యలు చెప్పుకుంటామంటూ పదే పదే చెబుతూ వచ్చారు..  వారు కోరుకున్నట్టు ఎట్టేకేలకు ఉద్యోగ సంఘాల నేతలతో సీఎం జగన్ భేటీ అవుతున్నారు. అంతకుముందే సీఎస్ సమీర్ శర్మ, సజ్జలతో సీఎం జగన్ సమావేశం అయ్యారు. మరోవైపు ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు సైతం సీఎంతో ఏఏ అంశాలు చర్చించాలి.. ఆయన పీర్సీపీ తమ వివరణ కోరితే ఏం చెప్పాలి అన్న అంశాలపై సమావేశం నిర్వహించారు..

    ఏది ఏమైనా సీఎం జగన్ తో సమావేశం తరువాత పీఆర్సీపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉందని ఉద్యోగులు భావిస్తున్నారు. జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌లో సభ్యత్వం ఉన్న ఉద్యోగ సంఘాల నాయకులు అందుబాటులో ఉండాలని ప్రభుత్వ సలహాదారు చంద్రశేఖర్‌రెడ్డి ఆయా సంఘాలకు సమాచారం ఇవ్వడంతో సీఎంను కలిసేందుకు సిద్ధమయ్యారు. కాసేపట్లో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ తో సమావేశం కాబోతున్నారు సీఎం జగన్..

    ఇదీ చదవండి : అతడికి 50.. ఆమెకు 19.. ఉద్యోగం ఆశచూపించాడు.. విషయం బయపడ్డాక ఏం చేశాడంటే..?

    జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌లో ఉన్న 15 సంఘాల నాయకులకు అందుబాటులో ఉండాల్సిందిగా సమాచారం ఇప్పటికే వెళ్లగా.. ఉద్యోగ సంఘాలతో సమావేశం కంటే ముందు ఆర్ధిక శాఖ అధికారులతో మరోసారి సమావేశం కాబోతున్నారు సీఎం వైఎస్ జగన్. ప్రభుత్వం నుంచి అధికారిక పిలుపు కోసం ఉద్యోగ సంఘాల నాయకులు నిరీక్షిస్తున్నారు.. ఒక్కో సంఘం నుంచి ఇద్దరు ప్రతినిధులకు సీఎం భేటీకి అవకాశం కల్పించనున్నట్టుగా తెలుస్తోంది.

    ఇదీ చదవండి : ఏపీలో మళ్లీ ఆంక్షలు..! భారీగా పెరుగుతున్న కేసులు.. ఆ జిల్లాల్లో భయం భయం

    ఓ వైపు ప్రభుత్వం 14 నుంచి 29 శాతం కంటే ఎక్కువ ఫిట్‌మెంట్ ఇచ్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.అయితే తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన 30శాతం కంటే తమకు ఎక్కువ ఫిట్‌మెంట్‌ వస్తుందని ఉద్యోగ సంఘాల నేతలు ఆశిస్తున్నారు. అదే సమయంలో 40శాతానికి పైగా డిమాండ్‌ చేస్తున్నా, 30 శాతానికి అటుఇటుగా ఫిట్‌మెంట్‌ ప్రకటించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అయితే డీఏల బకాయిలు ఉండటంతో, వీటిని పరిగణలోకి తీసుకొని సీఎం జగన్‌ వద్ద ఫిట్‌మెంట్‌పై ఉద్యోగ సంఘాలు ప్రతిపాదన చేసే అవకాశం ఉంది. ఇంకా 1,600 కోట్ల మేర బకాయిలు ఉన్నాయి. ఈ అంశంపైనా ఉద్యోగ సంఘాలు ముఖ్యమంత్రి వద్ద ప్రస్తావించే అవకాశం ఉంది.

    (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, Employees

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు