GOVERNMENT EMPLOYEES TO TAKE THEIR PROTEST IN ANOTHER MANNERS AS THEY MAY CALL FOR STRIKE SOON FULL DETAILS HERE PRN
AP PRC Fight: సీఎంపై ఉద్యోగుల సుఖీభవ సాంగ్.. పీఆర్సీపై సర్కార్ కు షాకిచ్చిన ట్రెజరీ ఎంప్లాయిస్..
పీఆర్సీపై తగ్గేదేలేదంటున్న ఉద్యోగులు
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో పీఆర్సీ (PRC Issue) ఫైట్ తీవ్రరూపం దాల్చుతోంది. గురువారం ఉపాధాయ సంఘాలు రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల ముట్టడికి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఐతే కొత్త పీఆర్సీపై ట్రెజరీ ఉద్యోగులు సీఎంకు షాకిచ్చారు.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో పీఆర్సీ (PRC Issue) ఫైట్ తీవ్రరూపం దాల్చుతోంది. గురువారం ఉపాధాయ సంఘాలు రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల ముట్టడికి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అన్నిజిల్లాల్లో కలెక్టరేట్ల ఎదుట ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పీఆర్సీని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కలెక్టరేట్ల వద్దకు భారీగా చేరుకున్న ఆందోళనకారులను అడ్డుకోవడం పోలీసులకు తలకుమించిన భారంగా మారింది. చిత్తూరు (Chittoor) కలెక్టరేట్ వద్ద పోలీసులు టీచర్లను అడ్డుకోలేకపోవడంతో లోపలికి దూసుకెళ్లారు. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద ధర్నా చేసిన ఉద్యోగులను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పలుచోట్ల తోపులాటలో ఉద్యోగులు సొమ్మసిల్లిపడిపోయారు.
మరోవైపు కొత్త పీఆర్సీ ప్రకారం జీతాలు విడుదల చేయాలని ప్రభుత్వం ట్రెజరీ ఉద్యోగులను ఆదేశించిన సంగతి తెలిసింది. ఈ విషయంలో ట్రెజరీ ఉద్యోగులు ప్రభుత్వానికి షాకిచ్చారు. సవరించిన జీతాల బిల్లులు ప్రాసెస్ చేసేది లేదని డీడీవోలు, ట్రెజరీ ఉద్యోగులు తేల్చిచెప్పారు. ఈ విషయంలో ఉన్నతాధికారుల విజ్ఞప్తిని పట్టించుకోని ఉద్యోగులు.. తమను ఇబ్బంది పెట్టొద్దని స్పష్టం చేశారు. అంతేకాదు కొత్త పీఆర్సీ జీవోలను రద్దు చేయాలని ప్రకటన విడుదల చేసింది.
మరోవైపు ప్రభుత్వంపై ఉమ్మడిగా పోరాడాలని ఉద్యోగ సంఘాలు తీర్మానించాయి. శుక్రవారం విజయవాడలో జరిగిన భేటీలో ఏపీ జేఏసీ ఛైర్మన్ బండి శ్రీనివాసులు, ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఏఫీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ, సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి హాజరయ్యారు.
ఈనెల 21న సీఎస్ కు సమ్మె నోటీస్ ఇవ్వాలని.., ఈ మేరకు అన్ని సంఘాలు కలిసి ఉమ్మడి పోరాటం చేయాలని తీర్మానించారు. శుక్రవారం సచివాలయంలో మరోసారి సమావేశమై ప్రభుత్వం ముందు ఉంచాల్సిన డిమాండ్లపై చర్చిస్తామని ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికేనా మొండివైఖరి వీడి బేజషాలకు పోకుండా నిర్ణయాన్ని మార్చుకోవాలని డిమాండ్ చేశారు. కొత్త పీఆర్సీ వల్ల ప్రతి ఉద్యోగికి నష్టం జరుగుతోందని.. ఆ విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ఉద్యోగ సంఘాల నాయకులు స్పష్టం చేశారు. సమ్మె విషయంలో మరో మాటకు తావులేదని.. శుక్రవారం జరిగే సమావేశంలో మరోసారి ఈ అంశంపై చర్చిస్తామన్నారు.
ఇదిలా ఉంటే ఆందోళనలో భాగంగా ఉపాధ్యాయ సంఘాలు ఇటీవల ట్రెండ్ అయిన సుఖీభవ పాటను పాడి నిరసన తెలిపారు. జీతాలు, పీఆర్సీ విషయంలో సీఎం మోసం చేశారని పాడుతూనే అయ్యొయ్యో వద్దయ్య.. సుఖీ భవ అంటూ పాటలు పాడి నిరసన వ్యక్తం చేశారు.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
Published by:Purna Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.