హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

PRC Fight: ఫిబ్రవరిలో ఉద్యోగులకు జీతాల్లేవా..? ప్రాసెస్ ప్రారంభించని ట్రెజరీ ఉద్యోగులు.. సహాయ నిరాకరణ ఎఫెక్ట్ ఎంత..?

PRC Fight: ఫిబ్రవరిలో ఉద్యోగులకు జీతాల్లేవా..? ప్రాసెస్ ప్రారంభించని ట్రెజరీ ఉద్యోగులు.. సహాయ నిరాకరణ ఎఫెక్ట్ ఎంత..?

ట్రెజరీ ఉద్యోగుల సహాయ నిరాకరణ

ట్రెజరీ ఉద్యోగుల సహాయ నిరాకరణ

AP Treasury Employees Protest: పీఆర్సీ వివాదం తీవ్ర స్థాయికి చేరింది. ఏపీ ఉద్యోగ సంఘాలు అన్నీ ఏకతాటిపైకి వచ్చి ఉద్యమ కార్యచరణ ప్రకటించేందుకు సిద్ధమవుతున్నాయి. ఇదే సమయంలో ఏపీ ప్రభుత్వానికి ట్రెజరీ ఉద్యోగులు షాక్ ఇచ్చారు.. కొత్త పీఆర్సీ ప్రకారం జీతాలు ప్రాసెస్ చేసేందుకు ట్రెజరీ, డ్రాయింగ్ అధికారులు నిరాకరించారు.. దీంతో ఫిబ్రవరి నెల జీతాలు అకౌంట్లో పడడం అనుమానంగా మారింది.

ఇంకా చదవండి ...

AP Treasury employees refusing: ఆంధ్రప్రదేశ్  (Andhra Pradesh)లో పీఆర్సీ నిరసనలు అంతకంతకూ తీవ్ర రూపం దాలుస్తున్నాయి.. ఉద్యోగ సంఘాలు సమ్మె బాట పట్టే యోచనలో ఉన్నాయి. విపక్షాలు, ఇతర సంఘాల నుంచి ఉద్యోగులకు మద్దతు పెరుగుతోంది. ఇదే సమయంలో ఏపీ ట్రెజరీ ఉద్యోగులు (AP Treasury Employees ) ఏపీ ప్రభుత్వాని (AP Government)కి షాక్ ఇచ్చారు. కొత్త పీఆర్సీ (New PRC)తో జీతాలు ప్రాసెస్ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే ఉద్యమంలో పాల్గొంటున్న ట్రెజరీ ఉద్యోగులు.. సహాయ నిరాకరణకు దిగారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు ప్రాసెస్ చేసేందుకు ట్రెజరీ ఉద్యోగులు నిరాకరించారు. కొత్త పీఆర్సీ ప్రకారం జీతాలు  (Salaries) ఇవ్వాలని నిర్ణయించిన ప్రభుత్వం.. ఆ మేరకు జీవో జారీ చేసింది. తాజా జీవోల ప్రకారం ఈనెల 25వ తేదీలోగా వేతనాలను ప్రభుత్వ వెబ్ సైట్ లో అప్ లోడ్ చేయాలి.. ప్రాసెస్ పూర్తి అయితే ఫిబ్రవరి జీతాలు ఉద్యోగుల అకౌంట్ లోకి పడతాయి.. కానీ కొత్త పీఆర్సీ ప్రకారం జీతాలు ప్రాసెస్ చేసేందుకు ట్రెజరీ, డ్రాయింగ్ అధికారులు నో అంటున్నారు. తాము కూడా ఉద్యోగుల్లో భాగమేనని, తమకు అన్యాయం జరుగుతుంటే.. జీతాలు ప్రాసెస్ చేయలేమని తేల్చి చెబుతున్నారు.

పీఆర్సీ జీవోలను రద్దు చేసేవరకు పోరాటం ఆపేది లేదని అమరావతి జేఏసీ నాయుకులు ఇప్పటికే స్పష్టం చేశారు. సమ్మెకు వెళ్లటానికి సంబంధించి సీఎస్ కు నోటీసులు ఈ రోజు లేదా రేపు ఇచ్చే అవకాశం ఉంది. ఓ వైపు అన్ని రకాల ఉద్యోగులు ఆందోళనలు చేస్తుంటే.. ప్రభుత్వం కొత్త పీఆర్సీ ప్రకారమే ఉద్యోగాలు జీతాలు ప్రాసెస్ చేయాలని నిర్ణయించింది. అయితే పీఆర్సీని రద్దు చేసే వరకు దీంట్లో భాగస్వాములం కాలేమని ట్రెజరీ ఉద్యోగులు తేల్చి చెప్పేశారు. ట్రెజరీ ఉద్యోగుల సంఘం దీనికి సంబంధించి పత్రికా ప్రకటన కూడా రిలీజ్ చేసింది. మొత్తం ఏపీ ట్రెజరీ ఉద్యోగులు సహాయ నిరాకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఏపీ ఎన్ జీవోలు, అదే విధంగా 16 సంఘాలు చేస్తున్న పోరాటానికి పూర్తి సంఘీభావం ప్రకటించారు.కొత్త పీఆర్సీ ప్రకారం జీతాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం చేసిన నిర్ణయాన్ని తాము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోలేమని తెల్చే చెప్పారు. ఉద్యోగుల వేతనాలు ప్రాసెస్ చేయలేమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఉన్న అన్నిశాఖలకు చెందిన ఉద్యోగులు పోరుబాటుకు సంఘీభావంగా నిలుస్తామని ట్రెజరీ ఉద్యోగుల సంఘం ప్రకటించింది. ప్రతి నెల 25వ తేదీ లోగా ఉద్యోగుల జీతాలకు సంబంధించిన బిల్లులను ప్రాసెస్ చేయాల్సిన బాధ్యత ట్రెజరీ ఉద్యోగులపైనే ఉంది. దీనికి సంబంధించి ప్రభుత్వం ట్రెజరీ శాఖను ఆదేశించిన నేపథ్యంలో ఉద్యోగుల జీతాలు ప్రాసెస్ చేయడానికి నిరాకరించారు.

ఇదీ చదవండి: నేడు ఏపీ కేబినెట్ భేటీ.. పీఆర్సీ వివాదం.. కరోనా ఆంక్షలపై కీలక నిర్ణయాలు..!

ట్రెజరీ ఉద్యోగుల సహాయ నిరాకరణతో పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. ఈ నెల 25 తేదీలోపు ప్రాసెస్ పూర్తి చేస్తేనా.. ఫిబ్రవరి మొదటి వారంలో ఉద్యోగుల అకౌంట్లు జీతాలు పడతాయి.. అంటే కేవలం నాలుగు రోజుల సమయం మాత్రమే ఉంది. ఇదే సమయంలో పీఆర్సీ జీవోలను వెనక్కు తీసుకునే దాక ఉద్యమం ఆపేది లేదని ఉద్యోగులు ప్రకటించారు.. ప్రభుత్వం మాత్రం వెనక్కు తగ్గేదే లే అంటోంది. దీనిపై ప్రభుత్వం ఏదో ఒక నిర్ణయం తీసుకుని.. ఒకటి రెండు రోజుల్లో ఉద్యోగులను ఒప్పించి మళ్లీ విధుల్లో చేరాలో చేయకపోతే.. వచ్చే నెల జీతాలు అకౌంట్ల పడడం ఇబ్బందిగా మారుతుంది.. జీతాలు రాకపోతే అధికారుల నుంచి కూడా వ్యతిరేకత మొదలయ్యే ప్రమాదం ఉంది.

(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)

First published:

Tags: Andhra Pradesh, AP News, Employees

ఉత్తమ కథలు