హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

AP New Districts: ఏపీలో కొత్త జిల్లాలకు ఉద్యోగుల కేటాయింపులు ఇలా.. సర్వీస్, సీనియారిటీ పరిస్థితేంటి..?

AP New Districts: ఏపీలో కొత్త జిల్లాలకు ఉద్యోగుల కేటాయింపులు ఇలా.. సర్వీస్, సీనియారిటీ పరిస్థితేంటి..?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం కొత్త జిల్లాల (AP New Districts) పై కసరత్తు ముమ్మరం చేసింది. మరో వారం రోజుల్లో కొత్త జిల్లాల నుంచే పాలన సాగాలనే ఉద్దేశంతో ఉన్న ప్రభుత్వం ఆ మేరకు ప్రక్రియను ముమ్మరం చేసింది.

  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం కొత్త జిల్లాల (AP New Districts) పై కసరత్తు ముమ్మరం చేసింది. మరో వారం రోజుల్లో కొత్త జిల్లాల నుంచే పాలన సాగాలనే ఉద్దేశంతో ఉన్న ప్రభుత్వం ఆ మేరకు ప్రక్రియను ముమ్మరం చేసింది. ఇందుకోసం కొత్త జిల్లాలు, డివిజన్ స్థాయి కార్యాలయాల్లో పోస్టుల విభజన, ఉద్యోగుల ప్రొవిజన్ కేటాయింపును పూర్తి చేసింది. జనాభా ప్రాతిపదికన కొత్త రెవెన్యూ డివిజన్లలోని పోస్టులను విభజించిన ప్రభుత్వం.. ఉగ్యోగుల కేటాయింపులను కూడా పూర్తి చేసింది. ఈ మేరకు కొత్త జిల్లాలు, డివిజన్లకు దాదాపు 10వేల మంది బదిలీ కానున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. కొత్త జిల్లాలకు వెళ్లే ఉద్యోగులు అధికారుల సర్వీసు, సీనియరిటీ వంటి అంశాల్లో ఎలాంటి మార్పులుండవని ప్రభుత్వం స్పష్టం చేసింది. అలాగే స్థానికత విషయంలోనూ మార్పులుండవని తెలిపింది. ఈ మేరకు ఆర్ధిక శాఖ మార్గదర్శకాలను జారీ చేసింది.

  వాటిలో ఎలాంటి మార్పు లేదు..

  కొత్త జిల్లాకు వెళ్లిన ఉద్యోగులకు సీనియారిటీ, ప్రమోషన్ల విషయంలో ఎలాంటి మార్పు ఉండబోదని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. ఒక ఉమ్మడి జిల్లాల్లో అన్ని విభాగాల్లో కలిపి 100 పోస్టులుంటే.. జనభా ప్రాతిపదికన కొత్త జిల్లాలకు వీటిని విభజిస్తారు. ఆ మేరకు ఉద్యోగులను ప్రొవిజనల్ గ కేటాయిస్తారు. ఇందుకోసం ప్రస్తుత జిల్లాలు, డివిజన్లలో పనిచేస్తున్న ఉద్యోగుల నుంచి ఆప్షన్లు తీసుకుంటారు. ఒకే పోస్టుకు ఎక్కువ మంది ఆప్షన్స్ ఇస్తే రివర్స్ విధానంలో జూనియర్లను బిలీ చేస్తారు. కొత్త జిల్లాలు, డివిజన్లకు బదిలీ అయ్యే ఉద్యోగులు, అధికారులకు బదిలీ ట్రావెలింగ్‌ అలవెన్స్‌ ఇవ్వాలని ఆర్థిక శాఖ నిర్ణయించింది. కొత్త జోన్లపై రాష్ట్రపతి ఉత్తర్వులు వచ్చేవరకు ఈ బదిలీలన్నీ తాత్కాలిక ప్రొవిజనల్ గానే పరిగణించనున్నారు.

  ఇది చదవండి: ఆర్ఆర్ఆర్ బెనిఫిట్ షో టికెట్స్ చించిపడేసిన ఫ్యాన్స్.. కారణం ఇదే.. రచ్చ మాములుగా లేదుగా..

  కొత్త జిల్లాలకు సంబంధించి ఈనెల 31న ప్రభుత్వం తుది నోటిఫికేషన్ జారీ చేయనుంది. నోటిఫికేషన్ జారీ అయిన వెంటనే.. కొత్త జిల్లాలు, డివిజన్లకు ఉద్యోగులను బదిలీ చేస్తూ సంబంధింత శాఖలు ఉత్వర్వులు ఇస్తాయి. ఉద్యోగి పేరు, ఐడీ నెంబర్, క్యాడర్, హోదా, ప్రస్తుతం పనిచేస్తున్న జిల్లా తదితర అంశాలను ప్రొవిజనల్‌గా కొత్తగా కేటాయిస్తున్న జిల్లా పేరుతో ఉన్నతాధికారులు జాభితాలు సిద్ధం చేస్తున్నారు.

  ఇది చదవండి: ఆర్ఆర్ఆర్ థియేటర్లో ఫ్యాన్స్ వార్.. ఏపీలో మొదలైన రచ్చ..

  ప్రస్తుతం జిల్లాల్లో ఆసరా-వెల్ ఫేర్ జేసీలుగా పనిచేస్తున్నవారు కొత్త జిల్లాలకు సంబంధించి డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్లుగా నియమించనున్నారు. అలాగే ప్రస్తుత జిల్లా అగ్రికల్చర్ జేడీగా లేదా డీడీగా ఉన్నావారిని కొత్త జిల్లాలకు డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ గా పరిగణించనున్నారు. అలాగే మహిళా శిశుసంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ ను కొత్త జిల్లాలకు జిల్లా మహిళా శిశు సంక్షేమ ఆఫీసర్ గా పరిగణిస్తారు.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Ap government, AP new districts

  ఉత్తమ కథలు