హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

AP Power Holiday: ఏపీలో పరిశ్రమలకు పవర్ హాలిడే.. హోర్డింగులకూ విద్యుత్ బంద్.. మాల్స్ పైనా ఆంక్షలు..

AP Power Holiday: ఏపీలో పరిశ్రమలకు పవర్ హాలిడే.. హోర్డింగులకూ విద్యుత్ బంద్.. మాల్స్ పైనా ఆంక్షలు..

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో విద్యుత్ కోతలు (Power Cuts in AP) తారాస్థాయికి చేరాయి. ఇప్పటికే పలు జిల్లాల్లో గంటల తరబడి పవర్ కట్ చేస్తుండటంతో జనం అల్లాడిపోతున్నారు. ఇప్పుడీ విద్యుత్ కోతల ప్రభావం పరిశ్రమలను కూడా షేక్ చేస్తోంది.

ఇంకా చదవండి ...

  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో విద్యుత్ కోతలు (Power Cuts in AP) తారాస్థాయికి చేరాయి. ఇప్పటికే పలు జిల్లాల్లో గంటల తరబడి పవర్ కట్ చేస్తుండటంతో జనం అల్లాడిపోతున్నారు. ఇప్పుడీ విద్యుత్ కోతల ప్రభావం పరిశ్రమలను కూడా షేక్ చేస్తోంది. ప్రభుత్వం పరిశ్రమలకు పవర్ హాలిడే ప్రకటించింది. వీకెండ్ తో పాటు మరో రోజు అదనంగా సెలవు ప్రకటించాలని 24గంటలూ నడిచే పరిశ్రమలు కూడా 50శాతం విద్యుత్ వినియోగించుకోవాలని ఆదేశించింది. ప్రభుత్వం తాజా ప్రకటనతో రాష్ట్రంలో ఏనిమిదేళ్ల క్రితం పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఆదేశాలు రాష్ట్రంలోని పారిశ్రామిక ఉత్పత్తులపై తీవ్రప్రభావం చూపే అవకాశముంది. అంతేకాదు కార్మికులు కూడా ఉపాధి కోల్పోయే ప్రమాదముందని ఆందోళన చెందుతున్నారు. పవర్ హాలిడే నేపథ్యంలో ప్రొడక్షన్ టార్గెట్లు పూర్తిచేయకపోతే తీవ్రంగా నష్టపోతామన్న టెన్షన్ యజమానుల్లో నెలకొంది.

  రాష్ట్ర వ్యాప్తంగా వందలాది పరిశ్రమలు పవర్ హాలిడే కిందకు వస్తున్నాయి. ముఖ్యంగా విద్యుత్ వినియోగం అధికంగా ఉండే ఫెర్రో ఇండస్ట్రీస్ తీవ్రంగా నష్టపోనున్నాయి. ఎస్పీడీసీఎల్ పరిధిలో నిరంతరం పనిచేసే పరిశ్రమలు 253 ఉన్నాయి. ఇప్పుడివి 50శాతం విద్యుత్ ను మాత్రమే వినియోగించాల్సి ఉంటుంది. అలాగే మరో 1696 పరిశ్రమలు పవర్ హాలిడేని అమలు చేయాలి. చిత్తూరు జిల్లాలో ఇప్పటికే పవర్ హాలిడే మొదలైంది. పుత్తూరు మినహా అన్ని డివిజన్లలో ఇది అమలవుతోంది.

  ఇది చదవండి: ఊపిరి ఉన్నంత వరకు వారిని గుర్తుపెట్టుకుంటా.. మంత్రిగా పేర్ని నాని చివరి ప్రసంగం..

  ప్రస్తుతం రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ అధికంగా ఉంది. ప్రస్తుతం రోజుకు దాదాపు 40-50 మిలియన్ యూనిట్ల విద్యుత్ కొరత ఉంది. దేశవ్యాప్తంగా విద్యుత్ డిమాండ్ పెరిగిపోవడంతో రాష్ట్రానికి సరిపడా కొనలేకపోతున్నట్లు అధికారులు తెలిపారు. మరో రెండు వరాల్లో పరిస్థితులు అనుకూలంగా మారే అకాశముందుంటున్నారు. పరీక్షల సమయం కారణంగా గృహావసరాలతో పాటు వ్యవసాయ అవసరాలకు విద్యుత్ ఇవ్వాల్సి ఉన్నందున పరిశ్రమలకు పవర్ హాలిడే తప్పడం లేదని సీపీడీసీఎల్ ఛైర్మన్ ప్రకటించారు.

  ఇది చదవండి: కేబినెట్లో కులాల లెక్కలు ఇవేనా..! వారికే సీఎం పెద్దపీట.. తగ్గనున్న రెడ్డి, కాపు మంత్రుల సంఖ్య..?

  ఇదిలా ఉంటే గత కొన్నిరోజులుగా పలు జిల్లాల్లో విద్యుత్ కోతలు ఠారెత్తిస్తున్నాయి. ముఖ్యంగా గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల్లో కోతలు అధికంగా ఉన్నాయి. విద్యుత్ లేకపోవడంతో ఆస్పత్రుల్లో టార్చ్ లైట్లలో ఆపరేషన్లు చేయాల్సిన పరిస్థితులు తలెత్తాయి. అనకాపల్లి ఆస్పత్రిలో టార్చ్ లైట్ వెలుతురులో డెలివరీ చేయడం కలకలం రేపింది. ఇక చిన్నపిల్లలున్నవారు, పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు కరెంట్ కోతలతో ఇబ్బందులు పడుతున్నారు. ఓ వైపు వేసవి తాపం, మరోవైపు కరెంట్ లేకపోవడంతో ఉక్కపోతకు గురవుతున్నారు. విద్యుత్ కొరత కారణంగా ప్రజలు విద్యుత్ ను పొదుపుగా వాడాలని, ఎసీల వినియోగం తగ్గించాలని అధికారులు కోరుతున్నారు.

  First published:

  Tags: Andhra Pradesh, Ap government, Power cuts

  ఉత్తమ కథలు