Home /News /andhra-pradesh /

GORUKALLU PEOPLE LEFT VILLAGE WITH EFFECT OF DRINKING WATER PROBLEM AND DIARRHEA IN KURNOOL DISTRICT HSN

Andhra Pradesh: ఆ గ్రామ ప్రజలను వెంటాడుతున్న రెండు భయాలు.. ఇళ్లకు తాళాలు వేసి ఊరొదిలి వెళ్లిపోతున్న కుటుంబాలు..!

ఇళ్లకు తాళాలు వేసి ఉన్న దృశ్యం

ఇళ్లకు తాళాలు వేసి ఉన్న దృశ్యం

శ్రీమంతుడు సినిమాలోలాగా ఒక్కో కుటుంబం ఆ ఊరిని విడిచి సుదూర ప్రాంతాలకు వెళ్తోంది. దెయ్యాల భయంతోనో, మూఢనమ్మకాల ప్రభావంతోనూ ఇళ్లను వదిలి వెళ్తున్నారనుకుంటే పొరపడినట్టే..

    ఆ ఊరిలో అందరికీ భయం పట్టుకుంది. ఒక్కొక్కరిలోనూ ఎలా బతకాలా అని భయం. ఈ ఊళ్లో ఉంటే ప్రాణాలతో ఉంటామా? అన్న గుబులు. అందుకే శ్రీమంతుడు సినిమాలోలాగా ఒక్కో కుటుంబం ఊరిని విడిచి సుదూర ప్రాంతాలకు వెళ్తోంది. బ్రతకొచ్చు అని భరోసా దొరికే ప్రాంతాల్లో తలదాచుకునేందుకు పయనం అవుతోంది. అలా అని అదేదో కరువు ప్రాంతమనీ, వర్షాలే కురవని నేల అని అనుకుంటే పొరపాటు. దెయ్యాల భయంతోనో, మూఢనమ్మకాల ప్రభావంతోనూ ఇళ్లను వదిలి వెళ్తున్నారనుకుంటే పొరపడినట్టే. అక్కడ ప్రభలుతున్న వ్యాధి ఓ కారణమయితే, మంచి నీళ్లు దొరక్కపోవడం మరో ప్రధాన కారణం. ఒక్కో కుటుంబం తమ సామాన్లను ట్రాక్టర్లపై వేసుకుని ఇళ్లకు తాళం వేసి వెళ్తోంది. కర్నూలు జిల్లాలోని పాణ్యం మండలంలో గోరుకల్లు గ్రామంలో వారం రోజులుగా కనిపిస్తున్న సీన్ ఇది.

    గోరుకల్లులో కొద్ది కాలంగా అతిసార వ్యాధి ప్రబలుతోంది. ప్రస్తుతం ఆ వ్యాధి తగ్గుముఖం పడుతున్నా ప్రజల్లో మాత్రం భయాందోళనలు తగ్గడం లేదు. వైద్య శిబిరాలు నిర్వహించి మరీ వ్యాధిని అదుపులోకి తెచ్చారు. అతిసార భయానికి తోడు ఆ గ్రామంలో తాగునీటికి ప్రజలు బాగా ఇబ్బందులు పడుతున్నారు. తాగునీరు దొరక్క అల్లాడిపోతున్నారు. అందుకే వారం రోజులుగా ఆ గ్రామంలో ప్రజలు వేరే ప్రాంతాలకు వలస వెళ్లడం మొదలు పెట్టారు. దాదాపు 30 కుటుంబాలు ఈ వారం రోజులుగా ఇళ్లను వదిలి వేరు వేరు ప్రాంతాలకు వలస వెళ్లాయి. ఇళ్లకు తాళం వేసి, బంధువులను, తోటి వాళ్లను విడిచి బాధతో ఆ ఊరిని వదలి వెళ్తున్నారు.
    ఇది కూడా చదవండి: నాలుగు నెలల క్రితం పెళ్లి.. భార్య గర్భవతి.. ఆమె గురించి చివరిసారి వాట్సప్ స్టేటస్ పెట్టి మరీ టిక్ టాక్ టోనీ దారుణం..!

    పరిస్థితి చక్కబడిన తర్వాత తిరిగి వస్తామని చెబుతూ ఆవేదన చెందుతూ దిగాలుగా వెళ్తున్నారు. నంద్యాల, రుద్రవరం, కర్నూలు ప్రాంతాలకు ఆ 30 కుటుంబాలు వలస వెళ్లాయని గ్రామస్తులు చెబుతున్నారు. మరికొన్ని కుటుంబాలు కూడా ఇదే ఆలోచనలో ఉన్నట్టు చెబుతున్నారు. గోరుకల్లు గ్రామంలో 2779 మంది ప్రజలు ఉన్నారు. తాగునీటికి ఇబ్బందులు రావడంతో అధికారులు రెండు ట్యాంకర్ల ద్వారా నీటిని తెప్పించి గ్రామస్తులకు సరఫరా చేస్తున్నారు. ఓ ట్యాంకర్ ద్వారా మంచినీటిని, మరో ట్యాంకర్ ద్వారా వాడుకోవడానికి నీటిని అందిస్తున్నారు. అయినప్పటికీ నీరు సరిపోకపోవడంతో ప్రజలు గ్రామాన్ని వీడి వేరే ప్రాంతానికి వలస వెళ్లడానికి సిద్ధపడుతున్నారు. మంచినీటిని సుదూర ప్రాంతాల నుంచి తెచ్చుకుంటున్నామనీ, కిలోమీటర్ల కొద్దీ దూరం వెళ్లి పశువులకు నీళ్లను తెచ్చుకోవాల్సి వస్తోందని వాపోతున్నారు.
    ఇది కూడా చదవండి: అమెరికాలో ఘోరం.. నట్టింట్లో రక్తపు మడుగులో భారతీయ భార్యాభర్తలు.. నాలుగేళ్ల కూతురు బాల్కనీలోకి వెళ్లి..
    Published by:Hasaan Kandula
    First published:

    Tags: Andhra Pradesh, Crime news, Hyderabad, Kurnool, Telangana, Vijayawada

    తదుపరి వార్తలు