Breaking News: ఏపీలో రేషన్ కార్డు దారులకు శుభవార్త.. ఈ-కేవైసీ గడువు పొడిగింపు..? ఎప్పటి వరకు అంటే?

ప్రతీకాత్మక చిత్రం

Good News: ఈ కేవైసీ గడువు ముగిసింది.. ఇక తమకు ఏపీ ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలు అందవేమో అని భయపడుతున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ కేవైసీపీ గడువు పెంచింది. ఎప్పటి వరకు అంటే..?

 • Share this:
  E KYC: ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లో మొన్నటి వరకు ఆధార్ కార్డు సెంటర్లు (Aadhar Card Centers) ఫుల్ రష్ గా కనిపించాయి. ఇకపై ఏపీలో సంక్షేమ పథకాలు (AP Welfare Schemes) అందాలన్నా.. రేషన్ బియ్య తీసుకోవాలన్నా తప్పకుండా ఈ కేవైసీ (E kyc) పూర్తి చేయాలని అధికారులు చెప్పడం.. అంతా ఆధార్ కార్డు సెంటర్లకు పరుగులు పెట్టారు. అయితే ఆగస్టు నెల ఆఖరు తేదీ (August Month End) వరకే గడువు సమయ సమయం అనడంతో.. అంతా ఆధార్ సెంటర్ల చుట్టూ ప్రదక్షిణలు చేశారు. అయితే ఇప్పుడు గడువు తేదీ ముగియడంలో అందరిలో భయం మొదలైంది.. ఇక నుంచి రేషన్ (Ration) అందదేమో అని పరేషాన్ అవుతున్నారు. అలాంటి వారందరికీ ఏపీ ప్రభుత్వం (Andhra Pradesh) గుడ్ న్యూస్ చెప్పింది. ఈ -కేవైసీ నమోదు కారణంగా తలెత్తున్న ఇబ్బందుల్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నిన్నటితో ఈ-కేవైసీ నమోదు గడువు ముగిసిన నేపథ్యంలో ప్రభుత్వం తాజా నిర్ణయం ప్రకటించింది. దీంతో ఇప్పటివరకూ దీన్ని నమోదు చేయించుకోని వారికి భారీ ఊరట దక్కింది.

  కేంద్ర ప్రభుత్వం వన్ నేషన్-వన్ రేషన్ (One Nation One Ration) పథకంలో భాగంగా లబ్దిదారులైన పేదలు ఏ రాష్ట్రంలో అయినా రేషన్ తీసుకునేందుకు వీలుగా ఈ-కేవైసీని తప్పనిసరిగా నమోదు చేయించాలని రాష్ట్రాలకు సూచించింది. దీంతో ఏపీ ప్రభుత్వం కూడా ఈ-కేవైసీ నమోదును ప్రారంభించింది. కరోనా పరిస్ధితుల నేపథ్యంలో ఆధార్ కేంద్రాలతో పాటు ఈ-కేవైసీ నమోదు కేంద్రాలు పనిచేయకపోవడం, భారీ ఎత్తున పిల్లా పాపలతో లబ్దిదారులు వీటికి పొటెత్తడంతో ఈ ప్రక్రియలో ఇభ్బందులు తలెత్తాయచి. దీంతో ప్రభుత్వం ఈ-కేవైసీ తప్పనిసరి అయినప్పటికీ లబ్దిదారుల్ని దృష్టిలో ఉంచుకుని పలు ఊరటనిచ్చే నిర్ణయాలు తీసుకుంది.

  ఇది కూడా చదవండి: భర్తను సర్ ప్రైజ్ చేసిన డిప్యూటీ సీఎం.. వైరల్ గా మారిన ఫ్యామిలీ ఫోటోలు..

  గతంలో రేషన్ కోసం ఈ-కేవైసీ నమోదుకు ఇచ్చిన గడువు ఆగస్టు 31తో పూర్తయింది. కానీ వివిధ కారణాలతో ఇంకా నమోదు చేయించుకోని లబ్దిదారుల్లో ఆందోళన పెరిగింది. ఈ నెల నుంచి రేషన్ కోతలు మొదలవుతాయనే భయం వెంటాడుతోంది. ఈ నేపథ్యంలో స్పందించిన ప్రభుత్వం ఈ-కేవైసీ నమోదుకు గడువును ఈ నెల 15 వరకూ పెంచింది. అంటే మరో 15 రోజల పాటు ఈ-కేవైసీ నమోదు చేయించుకునేందుకు లబ్దిదారులకు అవకాశం కల్పించింది. ఈ మేరకు పౌరసరఫరాలశాఖ కమిషనర్ కోన శశిధర్ (KOna Shashidhar) ఉత్తర్వులు జారీ చేశారు. లబ్ధిదారులెవరూ ఇబ్బంది పడకూడదనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు శశిధర్ తెలిపారు.

  ఈ కేవైసీ గడువు పెంపునకు చాలా కారణాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా గత నెలలో వరుసగా సెలవులు, పండుగలు వచ్చాయి. వాటికి తోడు రాష్ట్రా వ్యాప్తంగా చాలా చోట్ల సర్వర్లు సరిగా పని చేయ లేదు. దీంతో ఆధార్‌ నమోదు ప్రక్రియ నత్తడనకన సాగింది. సెలవులతో ఈ కేవైసీ నమోదు కేంద్రాలు పని చేయలేదని ప్రజల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఈ-కేవైసీ నమోదుకు గడువు పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఐదేళ్ల లోపు పిల్లలకు ఆధార్‌తో అనుసంధానం అవసరం లేదని ప్రభుత్వం తెలిపింది. మిగతా వారికి మాత్రం ఈ-కేవైసీ నమోదు ప్రక్రియ సెప్టెంబర్ 15 వరకూ కొనసాగనుంది.
  Published by:Nagesh Paina
  First published: