హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Good News: ఏపీలో పేదలకు గుడ్ న్యూస్.. మార్చి నాటికి 5 లక్షల ఇళ్లు పూర్తి.. పేదలందరికీ ఇళ్లు ఇవ్వాలని సీఎం నిర్ణయం

Good News: ఏపీలో పేదలకు గుడ్ న్యూస్.. మార్చి నాటికి 5 లక్షల ఇళ్లు పూర్తి.. పేదలందరికీ ఇళ్లు ఇవ్వాలని సీఎం నిర్ణయం

సీఎం జగన్ (ఫైల్ ఫోటో)

సీఎం జగన్ (ఫైల్ ఫోటో)

Good News: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సీఎం జగన్ మోహన్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. మార్చి నాటికి 5 లక్షల ఇళ్లు పూర్తి చేస్తామన్నారు.. రాష్ట్రంలో ఇళ్లు లేని పేదలు అందరికి వాటిని ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Guntur, India

Good News: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో పేదలకు గుడ్ న్యూస్.. సొంత ఇల్లు అనేది ప్రతి పేదవాడి కల అన్నారు సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) .. పేదల ఇళ్ల నిర్మాణంలో ఎలాంటి లోపం ఉండకూడదని స్పష్టం చేశారు. ల్యాబులను వినియోగించుకుని ఎప్పటికప్పుడు పరీక్షలను నిర్వహించి, పేదవాడికి అత్యంత నాణ్యమైన ఇంటిని అందించాలని ఆదేశించారు. పూర్తయిన ఇళ్లకు 15 రోజుల్లోగా విద్యుత్‌ కనెక్షన్ ఇవ్వాల‌ని సూచించారు. పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంపై సీఎం వైయస్‌. జగన్‌ సమీక్ష చేశారు. ఈ స‌మావేశంలో అధికారులు ఇళ్ల నిర్మాణాల పురోగ‌తిపై సీఎంకు వివ‌రించారు. వర్షాలు తగ్గిన తర్వాత డిసెంబరు నుంచి ఇళ్ల నిర్మాణం శరవేగంగా జరుగుతోందని వివరించిన అధికారులు. ఇళ్ల నిర్మాణంలో ఎలాంటి నాణ్యతా లోపంలేకుండా చూడాలంటూ ఇప్పటికే ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో తీసుకున్న చర్యలను అధికారులు వివరించారు. ఈ సందర్భంగా స్టేజ్‌ కన్వెర్షన్‌ కూడా బాగా జరిగిందని వివరించారు.

ఇళ్లనిర్మాణాల్లో నాణ్యతను పరీక్షించేందుకు మొత్తంగా 36 ల్యాబులు ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఇళ్ల నిర్మాణంలో ఉపయోగించే మెటల్ నాణ్యతపై 285 పరీక్షలు, సిమెంటుపైన 34 పరీక్షలు, స్టీలుపై 84 పరీక్షలు, ఇటుకలపైన 95 టెస్టులు.. ఇలా పలురకాల పరీక్షలు నిర్వహించామన్నారు అధికారులు. అధికారులు. ఎక్కడ లోపం వచ్చినా.. వెంటనే గుర్తించి.. నాణ్యతను పెంచుకునేందుకు ల్యాబులు వినియోగపడుతున్నాయన్నారు అధికారులు.

అధికారులు చెప్పిన వివారాలు విన్న సీఎం జగన్ .. సొంత ఇల్లు అనేది పేదవాడి కల అని, ఇళ్ల నిర్మాణంలో ఎలాంటి లోపం ఉండకూడదని స్పష్టం చేశారు. ఈ ల్యాబులను వినియోగించుకుని ఎప్పటికప్పుడు పరీక్షలను నిర్వహించి, పేదవాడికి అత్యంత నాణ్యమైన ఇంటిని అందించాలన్నారు సీఎం జగన్. మరోవైపు సీఎం ఆదేశాల మేరకు పూర్తయిన ఇళ్లకు 15 రోజుల్లోగా విద్యుత్‌ కనెక్షన్‌ ఇస్తోంది ట్రాన్స్ కో.

ఇదీ చదవండి : బ్రహ్మ ప్రతిష్టించిన శివాలయం గురించి తెలుసా..? శివరాత్రి రోజు దర్శించుకుంటే ఏ కోరికైనా తీరినట్టే

లే అవుట్లలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసిన తర్వాత, వాటి నిర్వహణ విషయంలో గ్రామ, వార్డు సచివాలయాలు కీలక పాత్ర పోషించాలి అన్నారు. లే అవుట్లు పూర్తవుతున్న కొద్దీ మౌలిక సదుపాయాలను ప్రాధాన్యతా క్రమంలో ఏర్పాటు చేసుకుంటూ ముందుకుసాగాలన్నారు సీఎం. కోర్టు కేసుల కారణంగా ప్రకాశం , అనంతపురం జిల్లాల్లోని 2 లే అవుట్లకు బదులుగా ప్రత్యామ్నాయ భూములను ఎంపిక చేశామని అధికారులు వెల్లడించారు.

ఇదీ చదవండి : కన్నా వ్యాఖ్యలపై స్పందించిన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు.. తాజా ఆరోపణలపై ఏమన్నారంటే..?

సుమారు 30 వేలమందికి ఇళ్లనిర్మాణం కోర్టుకేసుల కారణంగా జాప్యం జరిగిందని, వీరికి త్వరలోనే పట్టాల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. దీనికోసం అసవరమైన భూ సేకరణ కోసం అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ఆదేశించారు సీఎం. ఇళ్ల నిర్మాణ కోసం ఈ ఆర్థిక సంవత్సరంలో జనవరి నెలాఖరు వరకూ చేసిన ఖర్చు 7630 కోట్ల రూపాయలు అని వెల్లడించారు. ఈ ప్రభత్వం ఇప్పటివరకూ మొత్తంగా 13,780 కోట్లు కేవలం ఇళ్ల నిర్మాణం కోసమే ఖర్చు చేసిందిన్నారు. ఇప్పటి వరకూ సుమారుగా 2.75 లక్షల ఇళ్లను పూర్తిచేశామని, మరో మరో 74వేల ఇళ్లలో శ్లాబు వేసే పనులు జరుగుతున్నాయని, మరో 79 వేల ఇళ్లు రూఫ్‌ లెవల్లో ఉన్నాయని తెలిపిన అధికారులు.

ఇదీ చదవండి : ఏపీ బీజేపీలో మరో వివాదం.. ఎంపీ జీవీఎల్ కు పురందేశ్వరి కౌంటర్

ఈ మూడున్నర సంవత్సరాలలో ఇళ్ల నిర్మాణం, మౌలిక సదుపాయాలు, ఉచితంగా 300 అడుగులు ఇళ్లు, మిగిలిన కేటగిరీల లబ్ధిదారులకు తమవంతుగా చెల్లించిన వాటిపై సబ్సిడీ ఇవ్వడంతో పాటు, ఉచితంగా రిజిస్ట్రేషన్లు చేసిన ప్రభుత్వం. అధికారులు అందించిన వివరాలు ప్రకారం.. టిడ్కో ఇళ్ల కోసం గత ప్రభుత్వం ఐదేళ్లలో చేసిన ఖర్చు 8015 కోట్లు అయితే ఈ ప్రభుత్వం చేసిన ఖర్చు, పేదలకు కల్పించిన ప్రయోజనాలు విలువ చూస్తే మొత్తంగా 20,745 కోట్లని సీఎం వెల్లడించారు.

First published:

Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, Ap welfare schemes