హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

APSRTC: పండుగ కోసం ప్రారంభమైన ప్రత్యేక బస్సులు.. బంపర్ ఆఫర్ ప్రకటించిన ఆర్టీసీ

APSRTC: పండుగ కోసం ప్రారంభమైన ప్రత్యేక బస్సులు.. బంపర్ ఆఫర్ ప్రకటించిన ఆర్టీసీ

పండక్కి ఊరెళ్లాలి అన్నవారికి శుభవార్త

పండక్కి ఊరెళ్లాలి అన్నవారికి శుభవార్త

APSRTC: ఏపీ ప్రజలకు అతి పెద్ద పండుగ సంక్రాంతి.. అందుకే ఎక్కడ ఉన్నావరైనా.. పండుగ రోజుల్లో సొంతూరుకు వెళ్లాలని ఆరాటపడతారు.. కానీ ప్రయాణం చేద్దామంటే.. ట్రైన్లు.. ప్రైవేటు బస్సులు అన్నీ ఫుల్ అయిపోయాయి.. భారీ ధర చెల్లించిన టికెట్లు దొరికే పరిస్థితి లేదు. అయినా నో టెన్షన్ ఆర్టీసీ ఓ గుడ్ న్యూస్ చెప్పింది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Vijayawada, India

Anna Raghu, Sr.Correspondent, News18, Amaravati

APSRTC: మకర సంక్రాంతి (Makara Sankranthi) అంటే తెలుగు వారి పెద్ద పండుగ. నగరాల్లో ఉండే ఉద్యోగులు (Emloyees) , వ్యాపారులు (Businessmen) తమ తమ గ్రామాలకు వెళ్లి సంక్రాంతి వేడుకలు జరుపుకోవడం ఆనవాయితీ. అందుకే లక్షలాది మంది సంక్రాంతికి రెండు రోజుల ముందే వారి గ్రామాలు చేరుకుంటారు. సొంత కారు ఉన్న వారికి పెద్దగా ఇబ్బంది లేకపోయినా ఎక్కువ మంది రైళ్లు, బస్సు (Train and Bus Journey) ల ద్వారా గ్రామాలను చేరుకుంటారు. అందుకే ఏపీఎస్ ఆర్టీసీ (APSRTC) సంక్రాంతి పండుగ రద్దీని తట్టుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.

ఇప్పటికే ప్రత్యేక బస్సు సర్వీసులు ప్రారంభమయ్యాయి.  నేటి నుంచి పండుగ ముగిసే వరకు ఈ సర్వీసులు నడవనున్నాయి. గతేడాది ఆర్టీసీ ప్రత్యేక బస్సుల్లో టికెట్ ధరను 50 శాతం పెంచి ఆర్టీసీ విమర్శల పాలైంది. అందుకే ఈ ఏడాది ప్రత్యేక బస్సుల్లో ఛార్జీలు పెంచకపోగా ప్రయాణీలను ఆకర్షించేందుకు రాయితీలు ప్రకటించింది.

సంక్రాంతి పండుగ ప్రత్యేక బస్సుల్లో 5 నుంచి 25 శాతం వరకు రాయితీలు ప్రకటించింది. జనం ప్రైవేటు బస్సుల వైపు చూసే పనిలేకుండా ఆర్టీసీ బస్సుల్లో ఛార్జీలపై రాయితీలు ప్రకటించారు. ముందే రిజర్వేషన్ చేయించుకుంటే రాయితీలు సంక్రాంతికి ఇంటికి చేరుకునే వారు తిరుగు ప్రయాణానికి కూడా ముందే ఆన్ లైన్ ద్వారా టికెట్లు బుక్ చేసుకుంటే టికెట్లో 10 శాతం రాయితీ లభిస్తుంది.

ఇదీ చదవండి : మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ కు లైన్ క్లియర్.. ఎక్కడంటే?

ఇక నలుగురు ఫ్యామిలీ ఉంటే సభ్యులందరూ కలసి ఒకేసారి ప్రయాణిస్తే వారికి టికెట్లో 5 శాతం రాయితీ లభిస్తుంది. వాలెట్ ద్వారా టికెట్లు తీసుకుంటే 5 శాతం, వృద్ధులకు ఛార్జీల్లో 25 శాతం రాయితీ ప్రకటించారు. ఇలా ప్రయాణీలను ఆకర్షిస్తోంది ఏపీఎస్ఆర్టీసీ ఆకర్షించే ప్రయత్నం చేసింది.  ప్రైవేటు బస్సుల దోపిడీకి చెక్ పెట్టేందుకే ఆర్టీసీ టికెట్ ధరల్లో రాయితీలు ప్రకటించినట్టు తెలిపారు.

ఇదీ చదవండి : న్యూడ్ కాల్స్ మాడుతారా అంటూ ఎస్ఐ నుంచి వార్నింగ్.. చివరికి అసలు విషయం తెలిసి షాక్

నేటి నుంచి జనవరి 18 వరకు ఈ బస్సులు నడుస్తూనే ఉంటాయి. ఈ ఏడాది  సంక్రాంతి జనవరి 14న జరుపుకుంటున్నారు. అందుకు అనుగుణంగా ఆర్టీసీ ఏర్పాట్లు చేసింది. పండుగ రోజు వరకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు పడుపుతోంది. తిరిగి మళ్లీ నగరాలకు చేరుకునే వారి కోసం జనవరి 18 వరకు ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయి.

సంక్రాంతికి ఇంటికి వెళ్లే వారి కోసం ఏపీఎస్ ఆర్టీసీ 3120 బస్సులు సిద్దం చేసింది. ఈ బస్సులు జనవరి 14 వరకు తిప్పుతారు. తిరుగు ప్రయాణీకుల కోసం మరో 3280 బస్సులను సిద్దం చేశారు. ఆర్టీసీ ప్రత్యేకంగా రూపొందించిన యాప్, వెబ్ సైట్, అధికారిక ఏజంట్ల ద్వారా రిజర్వేషన్ చేయించుకోవచ్చని ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు.

First published:

Tags: Andhra Pradesh, AP News, Apsrtc, Makar Sankranti, Sankranti 2023

ఉత్తమ కథలు