లాయర్లకు గుడ్‌ న్యూస్.. వైఎస్సార్ లా నేస్తం నిధుల విడుదల

వైఎస్సార్ లా నేస్తం పథకం కింద జూనియర్‌ న్యాయవాదులకు ప్రతినెలా రూ.5,000 చొప్పున ఆర్థిక సాయాన్ని ప్రాక్టీస్‌ సమయంలో మూడేళ్ల పాటు అందిస్తారు. వృత్తిలో నిలదొక్కుకునే వరకు జూనియర్‌ న్యాయవాదులకు ఆర్థికంగా అండదండగా ఉండేందుకు సీఎం జగన్ ఈ పథకం తీసుకొచ్చిన విషయం తెలిసిందే

news18-telugu
Updated: July 7, 2020, 8:42 PM IST
లాయర్లకు గుడ్‌ న్యూస్.. వైఎస్సార్ లా నేస్తం నిధుల విడుదల
ఏపీ సీఎం వైఎస్ జగన్
  • Share this:
జూనియర్ లాయర్లకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ‘వైఎస్సార్‌ లా నేస్తం’ పథకం చెల్లింపుల కోసం మంగళవారం నిధులు విడుదల చేసింది. ఈ మేరకు మార్చి నుంచి జూన్‌ వరకు లా నేస్తం నిధులను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వైఎస్సార్ లా నేస్తం పథకం కింద జూనియర్‌ న్యాయవాదులకు ప్రతినెలా రూ.5,000 చొప్పున ఆర్థిక సాయాన్ని ప్రాక్టీస్‌ సమయంలో మూడేళ్ల పాటు అందిస్తారు. వృత్తిలో నిలదొక్కుకునే వరకు జూనియర్‌ న్యాయవాదులకు ఆర్థికంగా అండదండగా ఉండేందుకు సీఎం జగన్ ఈ పథకం తీసుకొచ్చిన విషయం తెలిసిందే.

కాగా, జాతీయ న్యాయవాదుల దినోత్సవం సందర్భంగా గత ఏడాది డిసెంబర్‌ 3న సీఎం వైఎస్ జగన్ ‘వైఎస్సార్‌ లా నేస్తం’ పథకానికి శ్రీకారం చుట్టారు. ఐతే కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో గత 3 నెలలుగా లా నేస్తం నిధులు నిలిచిపోయాయి. దీనిపై విపక్షాలు తీవ్ర విమర్శలు చేశాయి. జనసేన అధినేత పవన్ కల్యాణ్ సైతం లా నేస్తం నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. న్యాయవాదుల ఆర్థిక కష్టాలపై ప్రభుత్వం సానుభూతితో స్పందించాలని జులై 5న ఆయన ప్రెస్ నోట్ విడుదల చేశారు. ఆ తర్వాత రెండు రోజులకే ఏపీ ప్రభుత్వ లా నేస్తం నిధులను విడుదల చేసింది.
Published by: Shiva Kumar Addula
First published: July 7, 2020, 8:37 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading