GOOD NEWS TO DEVOTEES TIRUMALA TIRUPATI DEVASTHANAM RELEASED JANUARY SEVA VIRTUAL TICKETS NGS TPT
Tirumala: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. జనవరి కోటా విడుదల.. వర్చువల్ సేవా దర్శన టికెట్లు ఇవే.. ఇలా బుక్ చేసుకోండి
శ్రీవారి ఆలయం (ఫైల్)
TTD Seva Tickets: తిరులమ శ్రీవారి భక్తులకు శుభవార్త.. జనవరి నెలకు సంబంధించి శ్రీవారి వర్చువల్ సేవా దర్శన టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేసింది. ఫిబ్రవరి నాటికి ఒమిక్రాన్ లేదా థర్డ్ వేవ్ వేగంగా విస్తరిస్తుందనే హెచ్చరికలు నేపథ్యంలో చాలామంది జనవరిలోనే శ్రీవారిని దర్శించుకుని రావడం మేలని భావిస్తున్నారు.
TTD Srivari Virtual Seva Tickets: కలియుగ వైకుంఠ నాధుడైన శ్రీ వేంకటేశ్వరుడుని క్షణకాల దర్శనం కోసం కోట్లాది మంది భక్తులు పరితపిస్తూ ఉంటారు. జీవిత కాలంలో ఒక్కసారైనా స్వామి వారి దర్శనం చేసుకుంటే చాలా జీవితం ధన్యమైపోతుందని భావిస్తారు. కేవలం తెలుగు రాష్ట్రాల నుంచే కాదు.. దేశ విదేశాల నుండి నిత్యం లక్షలాదిగా భక్తులు తిరుమలకు వస్తూ ఉంటారు. గంటల తరబడి వేచి ఉండి స్వామి వారిని దర్శించుకోనిదే తిరిగి వెళ్ళరు భక్తులు.. అయితే గతేడాది నుంచి కరోనా కారణంగా స్వామి వారిని దర్శించుకునే వారి సంఖ్య తగ్గింది. ఇప్పుడిప్పుడే పరిస్థితి సద్దుమణుగుతోంది అనుకుంటే.. మళ్లీ ఒమిక్రాన్ భూతం భయ పెడుతోంది. అయితే ఫిబ్రవరి నాటిక భారీగా కేసులు పెరుగుతాయని.. థర్డ్ వేవ్ విరుచుకుపడుతుందనే హెచ్చరికల నేపథ్యంలో చాలామంది జనవరిలోనే స్వామి వారిని దర్శించుకోవడం మంచిదని భావిస్తున్నారు. అలాంటి వారికి టీటీడీ శుభవార్త చెప్పింది.. తిరుమల శ్రీవారి వర్చువల్ సేవా దర్శన టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేసింది.
వెంకన్న స్వామి భక్తుల సౌకర్యం కోసం జనవరి నెలకు సంబంధించి 1, 2 తేదీలు అలాగే, జనవరి 13 నుంచి 22 వరకు తిరిగి జనవరి 26వ తేదీల్లో 5,500 మంది భక్తులకు అవకాశం కల్పిస్తున్నట్లు టీటీడీ పేర్కొంది. ఇందుకు సంబంధించిన వర్చువల్ సేవా దర్శన టికెట్లను టీటీడీ విడుదల చేసింది. శుక్రవారం ఉదయం 9 గంటలకు 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను జనవరి 1, 13 నుంచి 22వ తేదీ వరకు.. రోజుకు 20 వేలు చొప్పున, జనవరి 2 నుంచి 12, 23 నుంచి 31 వరకు.. రోజుకు 12 వేల చొప్పున ఆన్లైన్లో విడుదల చేయనున్నట్టు టీటీడీ పేర్కొంది.
తిరుమలలో వసతి గదుల సమాచారాన్ని ఈ నెల 27న ఉదయం 9 గంటలకు ఆన్లైన్లో ప్రకటించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. జనవరి 11 నుంచి 14 వరకు వసతిని తిరుమలలోనే నేరుగా బుకింగ్ చేసుకోనే అవకాశం కల్పించింది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఆన్లైన్లో ముందుగానే దర్శన, వసతిని టికెట్లను బుక్ చేసుకోవాలని భక్తులు టీటీడీ పేర్కొంది. దేవస్థానం అఫిషయల్ వెబ్ సైట్ లో అన్ని వివరాలు అందుబాటులో ఉంటాయి.. ఆ వెబ్ సైట్ ద్వారానే అన్ని సేవల టికెట్లు బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం..
మరోవైపు ఇటీవలే టీటీడీ ఉదయాస్తమాన సేవ టిక్కెట్ల రేట్లను నిర్ణయించింది. గతంలో భక్తులకు జారీ చేసిన టికెట్లు కాలపరిమితి ముగిసిపోవడంతో ఖాళీగా ఉన్న టిక్కెట్లను తిరిగి భక్తులకు కేటాయించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ప్రస్తుతం ఉదయాస్తమాన సేవా టికెట్లను ఓ మంచి ఉద్దేశంతో భక్తులకు కేటాయించాలని నిర్ణయించుకుంది. వీటి కేటాయింపు ద్వారా వచ్చే ఆదాయాన్ని తిరుపతిలోని చిన్నపిల్లల ఆసుపత్రి నిర్మాణానికి వినియోగించాలని భావిస్తోంది.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
Published by:Nagabushan Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.