Good News: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government) విద్యా రంగంపై అత్యధికంగా ఫోకస్ చేస్తోంది.. ఉన్నత చదువు చదివేవారికి పీజు రియింబర్స్ మెంట్ తో పాటు.. పలు పథకాలు అందిస్తోంది.. దీంతో రోజు రోజుకు ఏపీలో ఉన్నత విద్యా వంతుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. తాజాగా ఏపీలో ఉన్నత విద్యపై 2022లో ఆల్-ఇండియా సర్వే ఆన్ హయ్యర్ ఎడ్యుకేషన్ (AISHE) నిర్వహించిన సర్వే లో ఆసక్తికరమైన గణంకాలు వెలుగులోకి వచ్చారు. 2014-15లో 17,67,086 గాను, 2020-21లో 19,87,618కి చేరుకుంది.. ఇప్పుడు అది 12.5% పెరిగింది. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నత విద్యలో మహిళల 2014-15లో 7,73,650 నుండి 2020-21లో 9,31,553కి పెరిగింది, ఇప్పుడు అది 20.4% పెరిగింది. ఇవాళ రాజ్యసభలో విద్యాశాఖ సహాయ మంత్రి డాక్టర్ సుభాస్ సర్కార్ పార్లమెంటు సభ్యుడు శ్రీ పరిమల్ నత్వానీ (Parimal Nathwani) అడిగినా ప్రశ్నకు సమాధానమిస్తూ ఈ సమాచారాన్ని అందించారు. తాజాగా మంత్రి ఇచ్చిన సమాధానం ఇదే..
ఆల్-ఇండియా సర్వే ఆన్ హయ్యర్ ఎడ్యుకేషన్(AISHE) అనేది ఉన్నత విద్యా గణాంకాల సమగ్ర మూలం, ఇందులో దేశంలోని ఉన్నత విద్యా సంస్థల నుండి వివిధ అంశాలపై విలువైన సమాచారం సేకరించబడుతుందన్నారు. 11వ రౌండ్ సర్వే (AISHE 2020-21) 2022లోచేసిన సర్వే ఫలితాల ప్రకారం, 2020-21లో దేశంలో ఉన్నత విద్యసంఖ్యదాదాపు 4.14 కోట్లకు పెరిగింది, (మొదటిసారి 4 కోట్ల మార్కును దాటింది.) దేశంలో మహిళల సంఖ్య2014-15లో 3.42 కోట్ల నుండి. 2014-15లో 1.57 కోట్లు ఉండగా, 2020-21లో 2.01 కోట్లకు పెరిగింది.
ఇక జాతీయ స్థాయిలో షెడ్యూల్డ్ కులాల విద్యార్థుల సంఖ్య 2014-15లో 46.06 లక్షల నుండి 2020-21లో 58.94 లక్షలకు పెరిగి, ఇది 28% వృద్ధిగానమోదయింది అన్నారు. దేశంలో షెడ్యూల్డ్ తెగల విద్యార్థులు 2014-15లో 16.40 లక్షల నుండి 24.12 లక్షలకు పెరిగి 47% వృద్ధి నమోదయిందన్నారు. దేశంలో ఇతర వెనుకబడిన కులాల (OBC) సంఖ్య 2014-15లో 1.13 కోట్ల నుండి 1.48 కోట్లకు పెరిగింది, ఇది 32% వృద్ధినీ సూచిస్తుంది. సర్వే ఫలితాల ప్రకారం, 2014-15, 2020-21 మధ్య దేశంలో 353 విశ్వవిద్యాలయాలు 5298 కళాశాలలు కొత్తగా ప్రారంభించినట్టు ఆ లెక్కలు చెబుతున్నాయి.
ఇదీ చదవండి : తిరుచానూరులో గోవిందరాజు స్వామికి ఆలయం ఎందుకు లేదు? అసలు మిస్టరీ తెలిస్తే షాక్
వివిధ రాష్ట్రాల్లో ఉన్నత విద్యకు సంబంధించి ప్రభుత్వం ఏదేనా సర్వే నిర్వహించిందా, నిర్వహిస్తే దాని ఫలితాలు మరింత అవసరమయ్యే విధంగా ప్రత్యేక పద్ధతులను గుర్తించిందా లేదా అని శ్రీ నత్వానీ తెలుసుకోవాలన్నారు. రాష్ట్రీయ ఉచ్ఛతర్ శిక్షా అభియాన్ (RUSA) పథకం కింద, 130 మోడల్ డిగ్రీ కళాశాల (MDC) స్థాపనకు కేంద్ర మద్దతు ఆమోదంతో పాటుగా ఈబీడీలు, ఆకాంక్షాత్మక జిల్లాలు మొదలైన వాటిలో 130 మోడల్ డిగ్రీ కళాశాలల (MDC) ఏర్పాటుకు ఆమోదం లభించిందన్నారు. RUSAలోని అనేక ఇతర వీభాగాల ద్వారా MDCల ఏర్పాటుతో పాటు, కళాశాలలకు మౌలిక సదుపాయాల గ్రాంట్లు, ఎంపిక చేసిన స్వయంప్రతిపత్త కళాశాలల్లో నాణ్యత, శ్రేష్ఠతను పెంపొందించడం, ప్రస్తుతం ఉన్న డిగ్రీ కళాశాలను మోడల్ డిగ్రీ కళాశాలగా అప్‌గ్రేడ్ చేయడం మొదలైన అనేక ఇతర సేవలతో పాటుగా వెనుకబడిన ప్రాంతాలలో ఉన్నత విద్యను మెరుగుపరచడానికి కూడా కేంద్ర ప్రభుత్వం తన మద్దతును అందిస్తుంది అనీ మంత్రి సమాచారం ఇచ్చారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Parimal Nathwani