Breakin News: ఆంధ్రప్రదేశ్ (Andhra Praesh) లో పెన్షన్ దారులకు సీఎం జగన్ మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) శుభవార్త చెప్పారు. తాను గతంలో ఇచ్చిన హామీ మేరకు పెన్షన్‌ను పెంచుతున్నట్లు ప్రకటించారు. ఈ పెరిగిన పెన్షన్ వచ్చే జనవరి నుంచి లబ్ధిదారులకు అందిస్తామని వెల్లడించారు. తాజాగా పెరిగిన దానితో కలిపి మొత్తం వచ్చే జనవరి నుంచి 2,750 రూపాయలు కానుంది. దీంతో పాటు రాబోయే రోజుల్లో 3 వేల వరకూ పింఛన్ పెంచుతామని.. తాను గతంలో ఇచ్చిన హామీని నెరవేరుస్తానని ప్రకటించారు. అయితే ఈ శుభవార్తను కుప్పం (Kuppam) వేదిక నుంచే జగన్ ప్రకటించడం విశేషం.. ప్రస్తుతం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) సొంత నియోజకవర్గం కుప్పంపై జగన్ ప్రత్యేక ఫోకస్ చేశారు. ఇందులో భాగంగా ఇప్పటికే నియోజకవర్గానికి పలు హామీలు ఇచ్చారు. అయితే సీఎం అయిన తరువాత తొలిసారి కుప్పం పర్యటనకు వచ్చిన ఆయన. మరోసారి ఇక్కడి ప్రజలపై వరాల జల్లు కురిపించారు.
ఇంకా ఆయన ఏమన్నారంటే..? కుప్పం అంటే ఇవాళ చంద్రబాబు పాలన కాదని.. తమ పాలనలో అభివృద్దిని పరుగులు పెట్టిస్తున్నామన్నారు. తాజాగా కుప్పం నుంచే మరో మంచి వైఎస్ఆర్ చేయూత కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామన్నారు. పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేద అక్కచెల్లెమ్మల కోసం తీసుకొచ్చిన పథకం ఇది అన్నారు. కుటుంబాన్ని బాధ్యతతో మోస్తున్నవాళ్లకు అండగా ఉండేందుకు అమలు చేస్తున్న కార్యక్రమని సీఎం జగన్ గుర్తు చేశారు.
చేయూతతో వాళ్ల జీవితాల్లో వచ్చిన మార్పు అందరికీ స్ఫూర్తిదాయకమని సీఎం జగన్ పేర్కొన్నారు. అలాగే వారం రోజుల పాటు చేయూత ఉత్సవాలు కుప్పం నుంచి ప్రారంభం అవుతాయని ఆనందం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడుకు సొంత మామపై ఎలాంటి ప్రేమ ఉందని జగన్ ఆరోపించారు. మాకు వెన్నుపోటు పొడిచినట్టే.. కుప్పానికి కూడా వెన్ను పొటు పొడిచారని ఆరోపించారు.
ఇదీ చదవండి : సీఎం జగన్ సంచలన నిర్ణయం.. శాశ్వత అధ్యక్ష పదవిపై సజ్జల క్లారిటీ
ఇన్నేళ్ల నుంచి కుప్పం ఎమ్మెల్యేగా చేసిన చంద్రబాబు నియోజకవర్గానికి ఏం చేశారని ప్రశ్నించారు. కనీసం ఇక్కడి ప్రజలకు నీళ్లు కూడా ఇప్పించలేకపోయారని ఆరోపించారు. చంద్రబాబు ఇప్పుడు కుప్పానికి నాన్ లోకల్.. హైదరాబాద్ కు నాన్ లోకల్ అన్నారు. ఆయనకు ఇక్కడ ఇళ్లు లేదు.. ఓటు లేదని ఆరోపించారు.
ఇదీ చదవండి : చంద్రబాబు నాయుడుకు లైన్ క్లియర్ చేసిన జూనియర్ ఎన్టీఆర్ .. రివర్స్ గేమ్ మొదలెడతరా..?
కుప్పం తన సొంత నియోజవకర్గం అని చంద్రబాబు నాయుడు ఎప్పుడూ భావించలేదు. ఆయనకు హైదరాబాదే ముద్దు అన్నారు. కుప్పంలో అత్యధికంగా ఉన్నది బీసీలే అన్నారు. బీసీల సీటును లాక్కున్న వ్యక్తి చంద్రబాబు అని ఆరోపించారు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో 33 ఏళ్లు కుప్పం ఎమ్మెల్యేగా ఉన్న చంద్రబాబు.. ఇక్కడ నుంచి తనకు కావాల్సినవి మాత్రం తీసుకున్నారు.. పిండుకున్నారు అని విమర్శించారు. ఎప్పుడూ ప్రజలకు ఏం కావాలో ఆలోచించలేదన్నారు. భరత్ ఎమ్మెల్సీగా ఉంటూనే నాతో ఇన్ని మంచి పనులు చేయించారు.. అందుకే భరత్‌ను గెలిపిస్తే మంత్రిగా చేస్తాను అన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, Kuppam