Home /News /andhra-pradesh /

GOOD NEWS TO ANDHRA PRADESH WOMEN CABINET APROOV EBC NESTHAM THESE IT THE QUALIFICATIONS NGS

Good News: మహిళలకు గుడ్ న్యూస్.. ఒక్కొక్కరి ఖాతాలో రూ 15 వేలు.. అర్హతలు ఇవే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Good News: ఆర్థికంగా ఎన్ని కష్టాలు ఉన్నా.. సంక్షేమ బాటలోనే నడుస్తున్నారు సీఎం జగన్.. మహిళలకు మరో లబ్ధి చేకూర్చేందుకు సిద్ధమయ్యారు. వారి ఖాతాల్లో 15 వేల రూపాయలు వేసేందుకు ఏపీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

    Good News to Women:  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) సీఎం జగన్ మోహన్ రెడ్డి  (CM Jagan Mohan Reddy) సంక్షేమానికే పెద్ద పీట వేస్తున్నారు. ఓ వైపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బాగులేవు.. స్వయంగా ప్రభుత్వమే ఆ విషయం చెబుతోంది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని సీఎం జగన్, ఇతర మంత్రులు చెబుతూ వస్తున్నారు. ఆర్థిక పరిస్థితి బాగులేకే తక్కువ ఫిట్ మెంట్ ఇస్తున్నాం సర్దుకోండి అంటూ ఉద్యోగ సంఘాల (Employees Union)ను స్వయంగా సీఎం కోరారు.. ఇలాంటి పరిస్థితుల్లో సంక్షేమ పథకాలు (Welfare Schems) అమలు చేయడం చాలా కష్టమైన పనే.. కేంద్రం నుంచి కూడా నిధుల విషయంలో సహకారం లభించడం లేదని రాష్ట్ర ప్రభుత్వం పదే పదే చెబుతోంది. ఇలాంటటి సమయంలోనూ జగన్ మోహన్ రెడ్డి సంక్షేమాన్ని వీడడం లేదు.. చెప్పిన ప్రకారం ఏదో ఒక రూపంలో అందరికీ నగదు అందించే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ఈబీసీ నేస్తం (EBC Nestham) పథకం ద్వారా లబ్ధిదారులకు ఏడాదికి 15 వేల రూపాయల చొప్పున మూడేళ్లలో 45 వేల రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందించనుంది. ఈ పథకం కింద ఇప్పటి వరకు అర్హులు కాని.. అగ్రవర్ణ కులాలకు చెందిన మహిళలకు లబ్ధి చేకూర్చనున్నారు.. దీనికి సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీ (AP Cabinet Meeting)లో ఆమోదం లభించింది...

    అర్హులు ఎవరంటే..?
    అగ్రవర్ణాలకు చెందిన పేద మహిళలు ఈ పథకానికి అర్హులు.. అయితే వారి వయస్సు 45 ఏళ్ల నుంచి 60 సంవత్సరాల మధ్య ఉంటేనే మహిళలు ఈ పథకానికి అర్హులు అవుతారు. దీనికి తోడు వారంతా వైయస్సార్ చేయూత, కాపు నేస్తంలో ఉన్న లబ్ధిదారులతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ మహిళలు అర్హులు ఎవరూ ఈ పథకానికి అర్హుల కారు. కేవలం ఈబీసీ మహిళలు మాత్రమే లబ్ధి పొందగలరు. అయితే ఈ లబ్ధి దారులకు తప్పకుండా.. తమ పేరుతో ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ బుక్ ఉండాలి. లేదంటే అర్హులుగా పరిగణించరు..

    ఇదీ చదవండి : వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్నీ సీట్లు వస్తాయంటే..? జాతీయ సర్వేలో సంచలన విషయాలు

    ఆదాయం ఎంత ఉండాలి అంటే..?
    ఈబీసీ లబ్ధి పొందాలి అనుకునే వారి వార్షిక కుటుంబ ఆదాయం గ్రామాల్లో అయితే నెలకు 10 వేలు, పట్టణాల్లో నెలకు 12 వేలు పరిమితిని మించకూడదు. ఈ పథకంలో లబ్ధిదారులకు మాగాణి భూమి 3 ఎకరాల కన్నా తక్కువగా ఉండాలి లేదా మెట్ట భూమి 10 ఎకరాల కన్నా తక్కువగా ఉండాలి లేదా మాగాణి, మెట్ట భూమి రెండు కలిపి 10 ఎకరాల కన్నా తక్కువగా ఉండాలి. కుటుంబంలో ఎవరూ ప్రభుత్వ ఉద్యోగి గాని, పెన్షనర్ గాని ఉండకూడదు. అలాగే ఈ నిబంధనలో పారిశుద్ధ్య కార్మికులకు మినహాయింపు ఇచ్చారు.

    ఇదీ చదవండి :: ఉద్యోగుల‌ను బుజ్జ‌గించేందుకు ప్రత్యేక కమిటీ.. తగ్గదే లే అంటున్న ఉద్యోగ సంఘాలు

    ఇవి ఉంటే అర్హులు కారు..
    ఈబీసీ నేస్తం లబ్ధి పొందాలి అనుకునే మహిళల కుటుంబంలో ఎవరి పేరు మీద కూడా ఫోర్ వీలర్ ఉండకూడదు. కుటుంబంలో ఎవరూ ఇన్‌కమ్ టాక్స్ కడుతున్న వారు ఉండకూడదు. 2021 సెప్టెంబర్ 29వ తేదీ నాటికి 45 సంవత్సరాలు పైబడ్డ.. 60 సంవత్సరాల్లోపు ఉన్న అగ్రకుల మహిళలు ఉండాలి. జనవరి 7 వ తేదీతోనే దీనికి అప్లై చేసుకునే గడువు ముగిసింది. అయితే ఇంకా అర్హత ఉండి.. అప్లే చేసుకోకపోతే.. దగ్గరలో ఉన్న గ్రామ వార్డు, సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. దీంతో అర్హులైన ఈబీసీ మహిళా లబ్ధిదారులకు 15 వేల రూపాయలు అందుతాయి.

    (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
    Published by:Nagabushan Paina
    First published:

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు