Good News: ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి (Andhra Pradesh CM Jagan Mohan Reddy) సంక్షేమంపై ప్రత్యేకంగా ఫోకస్ చేస్తున్నారు. ముఖ్యంగా విద్యా, వైద్య రంగాల్లో సమూల మార్పులు తీసుకొస్తున్నారు. ఇప్పటికే నాడు నేడు పేరుతో పాఠశాల రూపు రేఖలు మార్చేశారు. అలాగే అమ్మఒడి (Ammavodi), విద్యా దేవెన (Vidya Deevena), వసతి దీవెన (Vasati Deevena) లాంటి పథకాలు అములు చేస్తూనే ఉన్నారు. తాజా జగనన్న గోరుముద్ద (Jagananna Gorumudda) ద్వారా బడి పిల్లలకు అందించే ఆహారంలో ఫౌష్టికాహారాన్ని అదనంగా కలిపారు. వారానికి మూడు రోజులు ఉదయం పూట రాగి జావ అందించే కార్యక్రమాన్ని సీఎం జగన్ ఇవాళ ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా 44,392 ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో చదువుతున్న 37,63,698 మంది విద్యార్ధులకు దీని ద్వారా ప్రయోజనం చేకూరనుంది.
ఏటా రూ.86 కోట్ల అదనపు వ్యయంతో రాగి జావ అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే మధ్యాహ్న భోజన పథకానికి గత సర్కారు సగటున 450 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేయగా ఇప్పుడు జగనన్న గోరుముద్ద ద్వారా దాదాపు నాలుగు రెట్లు అధికంగా.. ప్రతి ఏటా 1,824 కోట్లు వ్యయం చేస్తున్నారు. తాజాగా రాగి జావ కోసం ఏటా మరో 86 కోట్లు కలిపి మొత్తం 1,910 కోట్లు వెచ్చిస్తూ పిల్లలకు పౌష్టికాహారాన్ని ప్రభుత్వం సరఫరా చేస్తోంది.
బడి పిల్లలకు వారానికి మూడు రోజులు ఉదయం పూట రాగి జావ అందించే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం తన క్యాంపు కార్యాలయం నుంచి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన దేవుడి దయతో ఈరోజు మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. మన ప్రభుత్వం రాకముందు పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఒక సారి తేడాను గమనించండి. మొత్తం సంవత్సం అంతా కలిపినా కూడా గతంలో ఏడాదికి కేవలం 450 కోట్లు కూడా ఖర్చు చేయలేని పరిస్థితి. ఆయాలకు 8-10 నెలలు బకాయిలు పెట్టే పరిస్థితి. సరుకులు కూడా 6-8 నెలలుగా బకాయిలు పెట్టే పరిస్థితి. ఇలా బకాయిల పెడితే.. క్వాలిటీ అనేది ఉండదన్నారు.
ఇదీ చదవండి : నారా దేవాన్ష్ బర్త్ డే.. టీటీడీకి ఎంత విరాళం ఇచ్చారంటే..?
రాష్ట్రంలో బడిమానేసే పిల్లల సంఖ్యను తగ్గించడం ఎలా..? స్కూళ్లలో సదుపాయాలను కల్పించడం ఎలా..? మేథోవికాసాన్ని పెంచడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలని అలోచించి అనేక చర్యలు చేపట్టామంటున్నారు. గర్భవతులైన మహిళల దగ్గరనుంచి చిన్నారుల వరకూ వచ్చే వరకూ సంపూర్ణ పోషణద్వారా పౌష్టికాహారాన్ని అందిస్తున్నామన్నారు. తరువాత ఇంగ్లిషు మీడియం, సీబీఎస్‌ఈ సిలబస్, బైలింగువల్ టెక్ట్స్‌బుక్స్, ఐఎఫ్‌ఎపీ ప్యానెల్స్ ఆరోతరగతినుంచి ఏర్పాటు, 8వ తరగతి పిల్లలకు ట్యాబులు ఇవ్వడం… ఇలాంటివి చాలా పథకాలు విద్యార్థులకు అందిస్తున్నామన్నారు సీఎం జగన్ .
ఇదీ చదవండి : మహిళా ఉద్యోగులకు సీఎం జగన్ శుభవార్త.. ఆ లీవులు ఎప్పుడైనా వాడుకొనే అవకాశం
అమ్మ ఒడి, విద్యాకానుక అమలు చేస్తున్నాం. పై చదువుల్లో కూడా అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నారు. విద్యాదీవెన, వసతి దీవెన కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నారు. మన పిల్లలు అందర్నీకూడా భావి ప్రపంచంతో పోటీపడేలా.. వారు నెగ్గేలా ఈ కార్యక్రమాలు చేపట్టామన్నారు. గోరుముద్ద కార్యక్రమాన్ని మరింతగా పటిష్టంగా అమలు చేసేలా అడుగులు వేశాం అన్నారు. నేటి నుంచి రాగిజావ కూడా పిల్లలకు అందిస్తామన్నారు. గోరుముద్దను మరింత మెరుగ్గా చేయడానికే ఈ ప్రయ్నతాలు. పిల్లలకు ఐరన్ కాని, కాల్షియం కాని పెరగడానికి ఈ ఆహారం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, Ap welfare schemes