హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Good News: ఏపీ ప్రజలకు సీఎం జగన్ గుడ్ న్యూస్ చెప్పారు.. ఆరోగ్య శ్రీ పరిధిలోకి విష జ్వరాలు

Good News: ఏపీ ప్రజలకు సీఎం జగన్ గుడ్ న్యూస్ చెప్పారు.. ఆరోగ్య శ్రీ పరిధిలోకి విష జ్వరాలు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Arogyasri: ఏపీని విష జ్వరాలు వెంటాడుతున్నాయి. రోజు రోజుగా డెంగ్యూ, చికున్ గున్యా లాంటి కేసులు పెరుగుతున్నాయి. దీంతో అప్రమత్తమైన సీఎం జగన్.. విష జ్వరాలను కూడా ఆరోగ్య శ్రీ పరిధిలోకి తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నారు.

  Viral fevers: విద్యా వైద్య రంగాలపై సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy)  ప్రత్యేక ఫోకస్ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు పేదలకు ఉపయోగపడేలా ఆయా రంగాల్లో పథకాలను పెంచుతూ వస్తున్నారు. తాజాగా వైద్యానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభత్వం (Andhra Pradesh Government) మరో కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా పేద ప్రజలకు ఉపశమనం కలిగించే వార్త చెప్పింది. విష జ్వరాలను ఆరోగ్యశ్రీ (Viral fevers in Arogyasri) పరిధిలోకి చేర్చింది. ఈ విషయాన్ని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని (Minster Alla Nani) స్పష్టం చేశారు. ఈ మేరకు సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో నమోదవుతున్న డెంగ్యు, చికున్ గున్యా, మలేరియా కేసులు పెరగకుండా చర్యలు చేపట్టినట్లు మంత్రి వెల్లండించారు. అందులో భాగంగానే ప్రజలు చికిత్స పరంగా ఇబ్బంది పడకుండా వాటిని ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చినట్లు చెప్పారు. ప్రస్తుతం విశాఖ జిల్లాలో 462 డెంగ్యూ, 31 చికెన్ గున్యా, 708 మలేరియా కేసులు నమోదయ్యాయని మంత్రి తెలిపారు. ఈ సంఖ్య ఇంకా పెరగకుండా, ప్రజలు చికిత్స పరంగా ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశించారని మంత్రి నాని అన్నారు. ఇప్పటికే జిల్లాలో విషజ్వరాలు (Viral fevers) ఎక్కువగా నమోదవుతున్నందున దగ్గర అధికార యంత్రాంగం పూర్తిగా అప్రమత్తం అయిందన్నారు. ఎక్కువ కేసులు ఉన్నచోట స్పెషల్ శానిటేషన్ డ్రైవ్, మెడికల్ క్యాంపులు నిర్వహించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. విష జ్వరాలను గుర్తించడానికి రెగ్యులర్‌గా సర్వే జరుగుతుందన్నారు. టెస్ట్స్ ఎక్విప్ మెంట్, మందులు సిద్దంగా ఉంచాలని అధికారులకు చెప్పామన్నారు. మిగతా జిల్లాల కంటే విశాఖపట్నం జిల్లా (Visakhapatnam District)లో విషజ్వరాలు కాస్త ఎక్కువగా ఉన్నాయని మంత్రి ఆళ్ల నాని చెప్పారు.

  సీజనల్ వ్యాధులపై ఇటీవలే మంత్రి ఆళ్ల నాని అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రోజు రోజుకూ పెరుగుతున్నసీజనల్ వ్యాధుల పట్ల ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది అన్నారు. ఎక్కడైతే డెంగ్యూ, మలేరియా వ్యాధులు ఎక్కువ వస్తున్నాయో.. అక్కడ ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. ప్రత్యేకంగా శానిటేషన్ డ్రైవ్ నిర్వహించాలని.. ఏ మాత్రం నిర్లక్ష్యం వహించవద్దని స్పష్టం చేశారు.

  ఇదీ చదవండి: వెదురు కంజి టేస్టు చూస్తే అసలు వదలరు.. బరువు తగ్గించే ఔషధం.. నులి పురుగులకు చెక్

  జ్వరాలకు సంబంధించిన అన్ని సర్వేలు చేయాలి అన్నారు. ఏ ప్రాంతంలో అయితే ఎక్కువగా వ్యాధులు నమోదవుతున్నాయో ఆ ప్రాంతంలో జ్వరాలకు సంబంధించిన నిర్ధారణ పరీక్షల శిబిరాలను ఏర్పాటు చేయాలన్నారు. ఆ ప్రాంతంలోనే ప్రత్యేకంగా జ్వరాల ట్రీట్మెంట్‌కి సంబంధించిన స్పెషల్ క్యాంపులు ఏర్పాటు చేసి వైద్యం అందించాలన్నారు.

  ఇదీ చదవండి: ఏపీ ఎంసెట్ ఫలితాలు విడుదల.. సులువుగా ఇలా చెక్ చేసుకోండి.. పరీక్ష రాయని వారికి మరో ఛాన్స్

  మురికివాడలు, ఏజెన్సీ ప్రాంతాల్లో అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎప్పటికప్పుడు నీరు నిల్వ ఉండకుండా మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలి. సీజనల్ వ్యాధులను మానిటరింగ్ చేయడానికి జిల్లాకు ఒక ప్రత్యేక అధికారి నియమించాం. ఆరోగ్యశాఖ మున్సిపల్ పంచాయితీ శాఖలకు సంబంధించిన అధికారులు సమన్వయంతో పనిచేయాలి. మందులు అందుబాటులో ఉంచాలి. ఎక్కడైనా ప్రైవేట్ హాస్పిటల్స్‌లో అధిక ఫీజులు వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని అన్నారు.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Aarogyasri, Andhra Pradesh, Ap cm jagan, Ap government, AP News, Viral dialogues

  ఉత్తమ కథలు