Home /News /andhra-pradesh /

GOOD NEWS TO ANDHRA PRADESH GOVERNMENT EMPLOYEES NEW GO ISSUE ON DA EFFECTED FROME NEXT MOTH JANUARY NGS BK

Good News: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం జగన్ పుట్టిన రోజు కానుక.. డీఏ విడుదల

AP Cm Jagan Photo : Twitter

AP Cm Jagan Photo : Twitter

Good News: ప్రభుత్వం తీరుపై ఇంతకాలం గుర్రుగా ఉన్న ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం జగన్ శుభవార్త చెప్పారు. ఆయన పుట్టిన రోజుకు ఒక రోజు ముందే ఈ గుడ్ న్యూస్ చెప్పారు. దీంతో ఆయన పుట్టిన రోజు కానుక అని ఉద్యోగ సంఘాలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇతర డిమాండ్ల విషయంలోనూ సానుకూలంగా ఉంటారని ఆశిస్తున్నారు.

ఇంకా చదవండి ...
    Good News: మంగళవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పుట్టిన రోజు (Andhra Pradesh CM Jagan Mohan Reddy Birth day).. దీంతో వైసీపీ శ్రేణులు, ఆయన అభిమానులు అంతా సెలబ్రేషన్స్ కు  సిద్ధమయ్యారు. మరోవైపు సీఎం సైతం తన పుట్టిన రోజు సందర్భంగా కీలక నిర్ణయాలకు వరుస గ్రీన్  సిగ్నల్స్ ఇస్తున్నారు.  మంగళవారం పశ్చిమ గోదావరి జిల్లా (West Godavari District)లో శాశ్వత గృహహక్కు కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. ఇదే సమయంలో గత కొన్ని రోజులుగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన ప్రభుత్వ  ఉద్యోగలకు (Government Employees) శుభవార్త చెప్పారు. ఇప్పటికీ పీఆర్సీ (PRC) పై పూర్తిగా పీటముడి వీడలేదు.. ఫిట్ మెంట్ విషయంలో ప్రభుత్వం ఒక లెక్క చెబితే.. ఉద్యోగ సంఘాలు మరో లెక్క చెబుతున్నాయి. అయితే కేవలం పీఆర్సీ మాత్రమే కాదని.. మరో 50కు పైగా డిమాండ్లు నెరవేర్చాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ సమయంలో సీఎం జగన్ ఉద్యోగ సంఘాలకు ఓ తీపి కబురు అందించారు. డీఏ విడుదల చేస్తూ ఉత్తర్వుల జారీ చేయించారు.

    గతంలో ప్రకటించిన షెడ్యూల్‌ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. తాజా నిర్ణయంతో 2019, జూలై 1 నుంచి డీఏ వర్తించనుంది. ఫలితంగా ఉద్యోగులు వచ్చే ఏడాది జనవరి నుంచి జీతంతో డీఏ అందుకోనున్నారు. ఈ డీఏ బకాయిలను 2022 జనవరి నుంచి మూడు విడతలుగా చెల్లిస్తారు.  DA FINAL (1)

    డీఏ ఉత్తర్వులు ఇచ్చినందుకు గాను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌  కు కృతజ్ఞతలు తెలియజేశాయి  ఉద్యోగ సంఘాలు. ఈ విషయంలో సానుకూలంగా స్పందించిన సీఎం జగన్.. ఇతర డిమాండ్ల విషయంలోనూ సానుకూలంగా ఉంటారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగుల కష్ట నష్టాలు తెలిసిన వ్యక్తిగా.. పాద యాత్రలో ఇచ్చిన హామీల ప్రకారం.. కచ్చితంగా తమ న్యాయ పరమైన డిమాండ్లు జగన్ నెరవేరుస్తారని ఉద్యోగులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ కు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అన్నారు చైర్మన్‌ కే వెంకట రామిరెడ్డి.

    ఇదీ చదవండి : సీఎం పుట్టిన రోజు కానుక.. రేపు గృహహక్కు కార్యక్రమానికి శ్రీకారం.. ప్రజలకు మరో శుభవార్త చెప్పిన జగన్

    తాజా ప్రభుత్వ నిర్ణయంతో 2019 జూలై నుంచి చెల్లించాల్సిన 5.24 శాతం కరవు భత్యాన్ని విడుదల కానుంది. పెరిగిన కరువు భత్యాన్ని 2022 జనవరి నెల జీతంతో కలిపి విడుదల చేసేందుకు గానూ ప్రభుత్వం ఆమోదం తెలియచేసింది. జనవరి జీతంతో కలిపి మూడు విడతలుగా పెరిగిన కరవు భత్యం చెల్లించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. డీఏలో 10 శాతాన్ని ప్రాన్ ఖాతాలకు మిగతా 90 శాతం మొత్తాన్ని నేరుగా ఉద్యోగుల జీతాల ఖాతాలకు చెల్లించనున్నారు. జడ్పీ, మండల పరిషత్​లు, గ్రామపంచాయితీలు, ఎయిడెడ్ సంస్థలు, వర్సిటీ సిబ్బందికీ డీఏ వర్తిస్తుందని ఆర్ధికశాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది.

    (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
    Published by:Nagabushan Paina
    First published:

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు