Agrigold: అగ్రిగోల్డ్ బాధితులకు శుభవార్త.. ఆస్తుల వేలానికి హై కోర్టు గ్రీన్ సిగ్నల్

Agri Gold: అగ్రిగోల్డ్ లోగో

ఎన్నో ఎళ్ల నుంచి ఎదురు చూస్తున్న అగ్రి గోల్డ్ బాధితులకు భారీగా ఊరట లభించింది. అగ్రిగోల్డ్ సంస్థల ఆస్తుల వేలానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో త్వరలోనే బాధితులకు పరిహారం అందే అవకాశం కనిపిస్తోంది.

  • Share this:
    ఏపీ వ్యాప్తంగా ఉన్న అగ్రిగోల్డ్ బాధితులకు శుభ వార్త.. అగ్రిగోల్డ్ ఆస్తుల వేలానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది హైకోర్టు.. హైకోర్టులో అగ్రిగోల్డ్ కేసు విచారణ జరగగా.. విజయవాడ లబ్బీపేటలోని అగ్రిగోల్డ్ ఆస్తుల వేలానికి ఆమోదం తెలిపింది.. అయితే గతంలోని ఎస్బీఐ వేలంలో 1401 చదరపు గజాల భూమిని 22.45 కోట్ల రూపాయలకు విజన్ ఎస్టేట్స్ దక్కించుకుంది. అది కూడా ఆ సంస్థ బినామీదే అని.. ఆ ఆస్తులు కూడా బాధితులకు పంపిణీ చేయాలని కోర్టును ఆశ్రయించారు. అయితే అగ్రిగోల్డ్ కు విజన్ ఎస్టేట్స్ బినామీ కాదని ఏపీ సీఐడీ హైకోర్టుకు తెలిపింది. అలాగే వాస్తవ మార్కెట్ ధరకన్నా విజన్ ఎస్టేట్ తక్కువకు కోట్ చేసిందని సీఐడీ తరుపు న్యాయవాదులు కోర్టుకి వివరించారు. ఏపీ ప్రభుత్వం, అగ్రి గోల్డ్ బాధితుల సంఘం కూడా అదే విషయాన్ని కోర్టు కు చెప్పాయి. దీనిపై ఎసీబీఐ తరుపు న్యాయవాదులు స్పందిస్తూ ఇప్పటికి 3 సార్లు వేలం వేసినా.. విజన్ ఎస్టేట్ మాత్రమే పాల్గొన్నట్టు వివరణ ఇచ్చారు. దీంతో మూడుసార్లు వేలం నిర్వహించినందున.. ఇంకా వేచి చూడాల్సిన అవసరం లేదని హైకోర్టు అభిప్రాయపడింది. అగ్రిగోల్డ్ బాధితుల సంఘం ఎక్కువ ధరకు కొనేవారిని తీసుకురాలేక పోయిందని వ్యాఖ్యానించింది.. విజన్ ఎస్టేట్స్ కు భూమిని రిజిస్ట్రేషన్ చేయాలని హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆ సంస్థకు భారీ ఊరట లభించింది.

    కోర్టు తీర్పు ఎలా ఉన్నా ఏపీ ప్రభుత్వం మాత్రం అగ్రి గోల్డ్ బాధితులకు న్యాయం చేసి తీరుతామంటోంది. గతంలో పాదయాత్ర సందర్భంగా అగ్రిగోల్డ్‌ బాధితులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకునేలా ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో వారి కోసం రూ.200 కోట్లు కేటాయించింది. తాము అధికారంలోకి వస్తే అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తామని ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. డిపాజిట్ దారులకు డబ్బు చెల్లించాలని హైకోర్టు నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే డబ్బులు చెల్లిస్తారని ఈ కేసును విచారించిన సీఐడీ ప్రకటించింది. అగ్రి గోల్డ్‌లో రూ. 10వేలు డిపాజిట్ చేసిన వారు సుమారు 3,59,655 మంది ఉంటారని సీఐడీ నివేదికలో ఉంది. అగ్రిగోల్డ్‌పై ఏపీ హైకోర్టు ఆదేశాల మేరకు ఇప్పటికే కొంత మంది డిపాజిట్ దారులకు డిపాజిట్లను చెల్లించారు.

    ఇదీ చదవండి: ఆనందయ్యకు సెల్యూట్.. ఆయుర్వేద మందులను ప్రోత్సహించాలన్న మద్రాస్ హైకోర్ట్

    ప్రస్తుతం రెండో విడతలో ఇతర డిపాజిట్ దారులకు డబ్బులు తిరిగి చెల్లించాల్సి ఉంది. మొత్తం రూ. 1150 కోట్లు అగ్రిగోల్డ్ బాధితులకు చెల్లించడం కోసం ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ప్రభుత్వం ఇప్పటికే రూ.10వేలు అంతకంటే తక్కువ డిపాజిట్‌దారులకు డబ్బు చెల్లించింది. తాజా కోర్టు తీర్పుతో 20 వేలు పైబడిన వారికి కూడా బకాయిలు చెల్లించే అవకాశం ఉంటుందని అగ్రి గోల్డ్ బాధితుల సంఘం ఆనందం వ్యక్తం చేస్తుంది. ఆస్తుల వేలం తరువాత ఎవరికి ఎంత మొత్తంలో చెల్లిస్తారన్నదానిపై పూర్తిగా క్లారిటీ వస్తుంది.
    Published by:Nagesh Paina
    First published: