Agri Gold | అగ్రిగోల్డ్ బాధితులకు ఊరట... జగన్ ప్రభుత్వం గుడ్ న్యూస్..

అగ్రిగోల్డ్‌ బాధితులను ఆదుకునేందుకు రూ.1150 కోట్లు కేటాయించి, రూ.20 వేల లోపు డిపాజిట్‌ చేసిన వారందరికీ చెల్లిస్తామని ఎన్నికల ముందు జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు.

news18-telugu
Updated: October 19, 2019, 3:59 PM IST
Agri Gold | అగ్రిగోల్డ్ బాధితులకు ఊరట... జగన్ ప్రభుత్వం గుడ్ న్యూస్..
ఎన్నికలకు ముందు పాదయాత్రలో జగన్‌కు తమ బాధ తెలుపుతున్న అగ్రిగోల్డ్ బాధితులు
news18-telugu
Updated: October 19, 2019, 3:59 PM IST
అగ్రిగోల్డ్‌ బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం రూ.263.99 కోట్లు విడుదల చేసిందని, సంస్థలో రూ.10 వేల లోపు డిపాజిట్‌ చేసిన దాదాపు 3.70 లక్షల మందికి వెంటనే పైకం చెల్లిస్తారని అగ్రిగోల్డ్‌ బాధితుల బాసట కమిటీ కోఆర్డినేటర్‌ లేళ్ల అప్పిరెడ్డి వెల్లడించారు. డీఎల్‌ఎస్‌ ద్వారా వారి వారి ఖాతాలలో ఆ మొత్తం జమ అవుతుందని ఆయన తెలిపారు. అగ్రిగోల్డ్‌ బాధితులెవ్వరూ అధైర్య పడవద్దని, ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. ఆ దిశలో సీఎం వైయస్‌ జగన్‌ చర్యలు తీసుకుంటున్నారని, త్వరలోనే రూ.20 వేల లోపు డిపాజిట్‌దారులకు కూడా ఆ మొత్తం చెల్లిస్తారని చెప్పారు. అగ్రి గోల్డ్‌ బాధితులను ఆదుకుంటామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన సీఎం జగన్, ఇప్పుడు ఆ మాట నిలబెట్టుకుంటున్నారని, అందుకు ఆయనకు ఎప్పుడూ రుణపడి ఉంటామని లేళ్ల అప్పిరెడ్డి అన్నారు.

అగ్రిగోల్డ్‌ బాధితులను ఆదుకునేందుకు రూ.1150 కోట్లు కేటాయించి, రూ.20 వేల లోపు డిపాజిట్‌ చేసిన వారందరికీ చెల్లిస్తామని ఎన్నికల ముందు జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. అగ్రి గోల్డ్‌ సంస్థలో పెట్టుబడి పెట్టి మోసపోయిన తమను ఆదుకోవాలని నాడు బాధితులు ఎంత మొర పెట్టుకున్నా చంద్రబాబు పట్టించుకోలేదని, ఆ సంస్థ యాజమాన్యంతో కుమ్మక్కై చౌకలో ఆస్తులు కొట్టేయాలని చూశారని లేళ్ల అప్పిరెడ్డి ఆరోపించారు. అగ్రిగోల్డ్‌ సంస్థలో రూ.20 వేల లోపు డిపాజిట్‌ చేసిన వారికి కూడా తప్పనిసరిగా న్యాయం చేస్తారని, వారిని కూడా ప్రభుత్వం ఆదుకుంటుందని లేళ్ల అప్పిరెడ్డి వెల్లడించారు. వారిని కూడా డీఎల్‌ఎస్‌ ద్వారా గుర్తించే విధంగా చర్యలు చేపడుతున్నారని, ఈ విషయాన్ని ప్రభుత్వం కూడా కోర్టుకు నివేదించిందని తెలిపారు.

జగన్ ఫొటోకు జనసేన ఎమ్మెల్యే పాలాభిషేకం



First published: October 19, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...