హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

IRCTC Tirupathi Tour: భక్తులకు శుభవార్త... తిరుమలలో శ్రీవారి దర్శనంతో టూర్ ప్యాకేజీ

IRCTC Tirupathi Tour: భక్తులకు శుభవార్త... తిరుమలలో శ్రీవారి దర్శనంతో టూర్ ప్యాకేజీ

IRCTC Tirupathi Tour | ఉదయాన్నే తిరుపతిలో రైలు దిగి మధ్యాహ్నానికి తిరుమలలో శ్రీవారిని దర్శించుకొని సాయంత్రానికి తిరుపతి నుంచి తిరుగుప్రయాణం కావాలనుకుంటున్నారా? మీకోసం ఐఆర్‌సీటీసీ ప్రత్యేక టూర్ ప్యాకేజీ ప్రకటించింది.

  తిరుపతి వెళ్లే శ్రీవారి భక్తులకు శుభవార్త. ఒకరోజు తిరుపతి టూర్ ప్యాకేజీ ఐఆర్‌సీటీసీ ప్రకటించింది. తిరుమల వెళ్లే భక్తులకు శ్రీవారి దర్శనం చేయిస్తుంది ఐఆర్‌సీటీసీ. డివైన్ బాలాజీ దర్శన్ పేరుతో ఈ ప్యాకేజీని అందిస్తోంది. ఇది ఒక రోజు టూర్ ప్యాకేజీ మాత్రమే. ఇందులో వసతి సౌకర్యాలు ఉండవు. ఈ ప్యాకేజీలో తిరుమల, తిరుచానూర్ ఆలయాలు మాత్రమే కవర్ అవుతాయి. ఈ టూర్ ప్యాకేజీ ధర రూ.990 మాత్రమే. ప్యాకేజీలో ఏసీ బస్సులో ప్రయాణం, తిరుమల, తిరుచానూర్ ఆలయాల్లో ప్రత్యేక ప్రవేశ దర్శనం, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి. ఈ ప్యాకేజీ ప్రతీ రోజు అందుబాటులో ఉంటుంది.

  ఇది కేవలం ఒకరోజు టూర్ ప్యాకేజీ మాత్రమే. ఉదయం 8 గంటల్లోపు రైలు ద్వారా తిరుపతి చేరుకునే భక్తులు, ఒకరోజులోనే దర్శనం పూర్తి చేసుకొని తిరిగి వెళ్లాలనుకుంటే వారికి ఈ ప్యాకేజీ ఉపయోగకరంగా ఉంటుంది. భక్తులు తప్పనిసరిగా ఒరిజినల్ ఐడీ కార్డు తీసుకెళ్లాలి. ఐడీ కార్డు లేకపోతే టీటీడీ అధికారులు దర్శనానికి అనుమతించరు.

  IRCTC: స్టాచ్యూ ఆఫ్ యూనిటీకి హైదరాబాద్ నుంచి ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీ

  IRCTC Kerala Tour: వైజాగ్ నుంచి కేరళకు ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీ వివరాలివే

  IRCTC Divine Balaji Darshan: ఐఆర్‌సీటీసీ డివైన్ బాలాజీ దర్శన్ ప్యాకేజీ వివరాలు ఇవే...

  ప్రతీ రోజు ఉదయం 8 గంటలకు తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గర టూర్ మొదలవుతుంది. ఈ ప్యాకేజీ బుక్ చేసుకున్న శ్రీవారి భక్తులను ఉదయం 8 గంటలకు తిరుపతి రైల్వే స్టేషన్‌లో పికప్ చేసుకుంటారు ఐఆర్‌సీటీసీ ప్రతినిధులు. 8.30 గంటలకు తిరుమలకు బయల్దేరతారు. తిరుమల చేరుకున్న తర్వాత ప్రత్యేక ప్రవేశ దర్శనం ద్వారా శ్రీవారిని దర్శించుకోవచ్చు. మధ్యాహ్నం 1 గంటల్లోగా దర్శనం పూర్తవుతుంది. రద్దీని బట్టి ఈ సమయం మారొచ్చు. ఆ తర్వాత భోజనం సొంత ఖర్చులతోనే చేయాలి. తిరుమలలో శ్రీవారి దర్శనం ముగిసిన తర్వాత తిరుచానూర్‌లో పద్మావతి అమ్మవారిని దర్శించుకోవడానికి బయల్దేరతారు. తిరుమలలో ఆలస్యం అయితే భక్తులను తిరుచానూర్‌ తీసుకెళ్లరు. ఒకవేళ తిరుచానూర్ వెళ్తే అక్కడ దర్శనం ముగిసిన తర్వాత తిరుపతి రైల్వే స్టేషన్‌లో భక్తులను డ్రాప్ చేస్తారు. దీంతో టూర్ ముగుస్తుంది.

  First published:

  Tags: Andhra Pradesh, Andhra pradesh news, Andhra updates, AP News, Best tourist places, IRCTC, IRCTC Tourism, Telangana, Telangana News, Telangana updates, Telugu news, Telugu updates, Telugu varthalu, Tirumala, Tirumala news, Tirumala Temple, Tirumala tirupati devasthanam, Tirupati, Tourism

  ఉత్తమ కథలు