ఏపీ టీచర్లకు సర్కార్ గుడ్ న్యూస్ (Good News) చెప్పింది. ఉపాధ్యాయుల (Teachers) విధులకు సంబంధించి సర్కార్ (Government) కీలక సవరణలు (Key Modifications) చేసింది. ఉపాధ్యాయులు చేస్తున్న ఎన్నికల విధులు, జనగణన వంటి విధుల నుంచి టీచర్లను (Teachers) తప్పించింది. దీనితో వారికి ఇక చదువు చెప్పడం ఒకటే పని ఉండనుంది. సర్కార్ (Government) తీసుకున్న ఈ నిర్ణయంతో ఉపాధ్యాయులు (Teachers) పూర్తిగా విద్యార్థుల చదువుపై దృష్టి పెట్టనున్నారు. కాగా కొద్దిరోజుల నుండి విద్యయేతర విధుల నుండి తప్పుంచాలని ఉపాధ్యాయ సంఘాలు (Teacher unions) డిమాండ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో వారికి ఊరట కలిగిస్తూ కేబినేట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక ఈ నిర్ణయానికి సంబంధించి ఫైల్ పై మంత్రులు (Ministers) సంతకాలు చేశారు.
అటెండెన్స్ విషయంలో కీలక మార్పులు..
ఇక హైస్కూల్ విద్యార్థుల అటెండెన్స్ విషయంలో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ( Andhra Pradesh Government) కీలక మార్పులు రానున్నాయి. ఇకమీదట విద్యార్థులకు ఫెషియల్ రికగ్నజెషన్ (Facial Recognysation) ద్వారా హాజరు నమోదు చేయాలని నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ మొదటి వారం నుండి ఈ విధానాన్ని అమలు చేయాలనున్నారు. దీనికి సంబంధించి యాప్ లో విద్యార్థుల వివరాలను నమోదు చేసే ప్రక్రియ జరుగుతుంది. రిజిష్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత అటెండెన్స్ ను ఫెషియల్ (Facial Recognysation) ద్వారా తీసుకోనున్నారు.
ఆ కాలేజీల్లో కూడా..
ఇంజనీరింగ్ (Engineering), ఫార్మసీ (Farmacy), అగ్రికల్చర్ (Agriculture), డిగ్రీ (Degree) కాలేజీల్లో కూడా ఫెషియల్ (Facial Recognysation) విధానాన్ని అమలు చేయనున్నారు. అయితే జియో ట్యాగింగ్ సాంకేతికత ఆధారంగా ఆయా కాలేజీల్లో మాత్రమే ఈ యాప్ పని చేసేలా రూపొందించారు. కేవలం రేండు నిమిషాల్లోనే విద్యార్థులు తమ హాజరును నమోదు చేసుకునేలా ఈ ఫెషియల్ అటెండెన్స్ (Facial Recognysation) ను రూపొందించారు. ఇప్పటికే టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది యొక్క హాజరు నమోదు కూడా ఫిషీయల్ రికగ్నజెషన్ (Facial Recognysation) ద్వారా హాజరు నమోదు చేసుకుంటున్న విషయం తెలిసిందే.
అయితే ఉపాధ్యాయుల (Teachers) ఫిషీయల్ రికగ్నజెషన్ అటెండెన్స్ పై వారు ఆందోళన చెందుతున్నారు. దీనిని టీచర్లు (Teachers) అందరూ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మరి దీనిపై ప్రభుత్వం (Government) స్పందిస్తుందా లేదా అనేది చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.