హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

తెలుగు రాష్ట్రాలకు చల్లని కబురు చెప్పిన వాతావరణశాఖ..

తెలుగు రాష్ట్రాలకు చల్లని కబురు చెప్పిన వాతావరణశాఖ..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

దక్షిణ తమిళనాడు, తెలంగాణ మీదుగా ఉపరితల ద్రోణి ఏర్పడిందని... ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు వివరించారు.

కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాలను బెంబేలెత్తిస్తున్న ఎండలు ఎప్పుడు తగ్గుతాయో అని ఎదురుచూస్తున్న ప్రజలకు వాతావరణశాఖ చల్లని కబురు చెప్పింది. నేటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతు తగ్గుముఖం పడతాయని తెలిపింది. దక్షిణ తమిళనాడు, తెలంగాణ మీదుగా ఉపరితల ద్రోణి ఏర్పడిందని... ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు వివరించారు. జూన్ 1న కేరళకు నైరుతి రుతుపవనాలు రానున్నాయని... జూన్ 9 , 10 తేదీల్లో తెలుగు రాష్ట్రాల్లోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.

అదే సమయంలో పశ్చిమ మధ్య అరేబియా సముద్రంలో బలపడిన అల్పపీడానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది మరింత బలపడి రానున్న 24 గంటల్లో వాయుగుండంగా మారనుంది. అలాగే ఆగ్నే య అరేబియా సముద్రాన్ని అనుకుని తూర్పు మధ్య ప్రాంతాల్లో ఈ నెల 31న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. వీటి ప్రభావంతో జూన్‌ 1వ తేదీనే కేరళలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. మొత్తానికి ఈ ఏడాది ఎండల నుంచి తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఉపశమనం లభించనున్నట్టు కనిపిస్తోంది.

First published:

Tags: Andhra Pradesh, Telangana, WEATHER

ఉత్తమ కథలు