అగ్రిగోల్డ్ బాధితులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. రూ.10,000 లోపు డిపాజిట్లు ఉన్న వారికి ప్రభుత్వమే పరిహారం ఇవ్వాలని నిర్ణయించింది. ఆయా డిపాజిటర్లకు చెల్లించేందుకు ప్రభుత్వం రూ.250 కోట్లను కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అగ్రిగోల్డ్‌లో రూ.10,000 లేదా అంతకంటే తక్కువ మొత్తంలో డిపాజిట్లు చేసిన వారి సంఖ్య 3.5లక్షల మంది ఉంటారని అంచనా. హైకోర్టు పర్యవేక్షణలో జిల్లా స్థాయి కమిటీల ద్వారా చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
అగ్రిగోల్డ్ బాధితుల ఆందోళన (File)
పేద, మధ్యతరగతి ప్రజల నుంచి పెద్ద ఎత్తున డిపాజిట్లు సేకరించిన అగ్రిగోల్డ్ సంస్థ బోర్డు తిప్పేయడంతో సుమారు 20లక్షల మంది నష్టపోయారు. ఆంధ్రప్రదేశ్,తెలంగాణ రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక కేరళలో కూడా బాధితులు ఉన్నారు. అగ్రిగోల్డ్ ఆస్తులను విక్రయించి బాధితులకు పరిహారం ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. ప్రస్తుతం హైకోర్టు పర్యవేక్షణలో కేసు విచారణ కొనసాగుతోంది.
చంద్రబాబు నాయుడు(File)
తమ డిపాజిట్లు రావేమోనన్న భయంతో ఇప్పటికే కొందరు అగ్రిగోల్డ్ బాధితులు ఆత్మహత్యలు చేసుకున్నారు. వారికి భరోసా కల్పించేందుకు ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది. మరోవైపు ఎన్నికల వేళ కూడా కావడంతో ప్రభుత్వం ముందడుగు వేసింది. అగ్రిగోల్డ్ బాధితుల్లో 3.5లక్షల మందికి లబ్ధి చేకూరే నిర్ణయం తీసుకుంది.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.