Home /News /andhra-pradesh /

GOOD NEW TO GOVERNMENT EMPLOYEES PRC REPORTE COMPLETED CM JAGAN WILL ANNOUNCE TO DAY NGS

Good News: ఏపీ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. కొలిక్కొచ్చిన పీఆర్సీ.. సీఎం ప్రకటన కోసం వెయిటింగ్

వైఎస్ జగన్

వైఎస్ జగన్

Good News: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల (AP Government Employees) వేతన సవరణకు సంబంధించి కసరత్తు పూర్తైంది. దీనిపై సీఎం జగన్ మరికొన్ని గంటల్లో ప్రకటన చేసే అవకాశం ఉంది. దీంతో సీఎం ప్రకటనలో ఏఏ అంశాలు ఉంటాయో అని ఉద్యోగులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇంకా చదవండి ...
    AP CM Jagan on PRC:  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల (AP Government Employees) వేతన సవరణ  ప్రభుత్వం  కొలిక్కి తెచ్చింది.  ఉద్యోగులు కోరుతున్న విధంగా పీఆర్సీతో పాటు ఇతర డిమాండ్లపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (AP CM YS Jagan) ఆర్ధిక శాఖ అధికారులతో చర్చించడంతో.. కసరత్తు పూర్తైంది. తాజాగా  శుభవార్త చెప్పేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government) సిద్ధమైంది.. ఇవాళ సాయంత్రం లేదా రేపు ఉదయం పీఆర్సీ పై సీఎం జగన్ మోహన్ రెడ్డి నేరుగా ప్రకటన చేసే అవకాశం ఉంది. దీనికి సంబంధించి దాదాపుగా పీఆర్సీ క‌సరత్తు పూర్తైంది. పీఆర్సీ నివేదిక, ఉద్యోగ సంఘాల డిమాండ్లు, రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై సీఎస్ సమీర్ శర్మ (CS Sameer Sarma) నేతృత్వంలోని హైలెవల్ కమిటీ నోట్ రెడీ చేసింది. ఆ రిపోర్ట్ ను కాసేపట్లో నేరుగా సీఎం జగన్‌కు అందచేయ నున్నారు. తరువాత ఉద్యోగ సంఘాలకూ అదే రిపోర్ట్ ను సీఎస్ అందిస్తారు. అనంతరం పీఆర్సీపై ఉద్యోగ సంఘాలతో సీఎం జగన్ సమావేశం అయ్యే అవకాశం అవకాశం ఉంది. ఈ సమావేశం తారువత జగన్ పీఆర్సీని ప్రకటించే అవకాశం ఉంది.

    పీఆర్సీ విషయంలో ఏదో ఒకటి తేల్చాలని చెబుతున్నా.. ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉండడం వల్లే తాము ఆందోళన కార్యక్రమాలకు సిద్ధమవుతున్నట్లు వెల్లడించాయి ఉద్యోగసంఘాలు. ఈ క్రమంలో..ఏపీలో సృష్టించిన వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటించారు. చిత్తూరు జిల్లాకు వచ్చిన సీఎం జగన్ ను ఉద్యోగ సంఘాలు కలిశాయి. పీఆర్సీ విషయాన్ని ప్రస్తావించాయి. దీంతో పది రోజుల్లో పీఆర్సీపై ప్రకటన చేయడం జరుగుతుందనే విషయాన్ని ఆయన వారికి చెప్పారు. ఈ నేపథ్యంలోనే పీఆర్సీ ఎంత ప్రకటిస్తారనే ఉత్కంఠ ఉద్యోగుల్లో నెలకొంది. సీఎం నిర్ణయం తీసుకున్న అనంతరం ఉద్యోగ సంఘాలకు అధికారలు సమాచారం ఇవ్వనున్నారు. సాయంత్రం పీఆర్సీపై అధికారికంగా ప్రకటన చేయనున్నారు సీఎం జగన్.

    ఇదీ చదవండి : బొప్పాయి పండులో ఆకట్టుకుంటున్న బుల్లి గణపతి.. మండపం పెట్టి పూజిస్తున్న భక్తులు

    తాజాగా పీఆర్సీ విషయంలో ఉద్యోగ సంఘాల మధ్య ఆసక్తికరమైన చర్చ కొనసాగుతోంది. 2018 జులై 01వ తేదీ నుంచి పీఆర్సీ సిఫార్సులను అమలు చేయాలని, 55 పర్సంటేజీ ఫిట్ ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. మరి సీఎం జగన్ ఎలాంటి ప్రకటన చేస్తారనే ఉత్కంఠ నెలకొంది. అయితే ఉద్యోగులు ఆశిస్తున్నట్టు కాకుండా.. 30 శాతం కూడా దాటలేదని అనధికారికంగా చర్చ జరుగుతోంది. ఏదీ ఏమైనా ఉద్యోగ సంఘాల అనుమానాలకు ఇవాళ సాయత్రం లేదా రేపు ఉదయం తెరపడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

    ఇదీ చదవండి : ఇకపై తల్లుల అకౌంట్ లో ఆ నగదు పడదు.. సర్కార్ కు మరో ఎదురుదెబ్బ

    రాష్టంలో ఇప్పటికే ఐదు డీఏలు పెండింగులో ఉన్నాయి. జనవరి వస్తే దీనికి మరో డీఏ యాడ్ కానుంది. ఈ డీఏలను వెంటనే ప్రకటించాలని సైతం ఉద్యోగ సంఘాలు ఆందోళన నిర్వహిస్తున్నాయి. పీఆర్సీ తరువాత డీఏలను పరిష్కరిస్తారన్నారు. మొత్తానికి దీనిపై మరికొన్ని గంటల్లోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

    (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News

    తదుపరి వార్తలు