P Anand Mohan, Visakhapatnam, News18. Huge Marriage in Andhra Pradesh: మాఘమాసం (Maghamasam) మంచి ముహూర్తాలను తీసుకొచ్చేసింది. ఈ మాసాన్ని పెళ్లి ముహూర్తాల మాసం అని అంటారు. పెళ్లి కోసం జంటలు వేచి చూసేది ఈ ముహూర్తాల కోసమే. కార్తీక, పుష్య మాసాల తర్వాత ఇప్పుడే పెళ్లి ముహూర్తాలు ఉన్నాయి. గత రెండేళ్లుగా కరోనా (Corona) కరాణంగా పెళ్లిళ్లు (Marriages), ఫంక్షన్లు చాలా వరకు వాయిదా పడుతూ వచ్చాయి. అందుకే ఈ మాఘమాసంలో ఉన్నవి తక్కువ ముహూర్తాలే అయినా.. వాటి కోసం పెళ్లి ఈడుకొచ్చిన పిల్లలు ఉన్న తల్లిదండ్రులు తొందరపడుతున్నారు. ఇప్పటికే విశాఖ (Viskha)తో పాటు ఇతర జిల్లాలలో పెళ్లిమండపాల నుంచీ పూలు పళ్లు వరకూ అన్ని మార్కెట్లు బిజీ అయిపోయాయి. అమావాస్య దాటి ఇలా మాఘంలోకి అడుపెట్టిన నాటి నుంచీ అనేక ముహూర్తాలు సిద్ధంగా ఉన్నాయి. దీంతో పెళ్లిళ్లతో ముడిపడిన అన్ని వర్తక వ్యాపారాలు రెడీ అయ్యాయి.
సాధారణంగా మాఘ మాసం ఎప్పుడు వస్తుందా.. మంచి ముహూర్తం ఎప్పుడు కుదురుతుందా అని నవ వధూవరులు ప్రతీ ఏటా ఎదురు చూస్తుంటారు. ముఖ్యంగా గత రెండేళ్లూ.. కరోనాతో పెళ్లిళ్లు వాయిదా పడుతూ వచ్చాయి. దీంతో మంచి ముహూర్తాలు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తన్నవారి ఎదురుచూపులు ఫలించాయి.. అయితే మాఘ, పాల్గుణ మాసాల్లో నెల రోజులపాటు గురుమౌడ్యమి రావడంతో ఈసారి ముహూర్తాలు తక్కు వగా ఉన్నాయి. ఉన్న ముహూర్తాల్లోనే వివాహాది శుభకార్యాలకు సిద్ధపడు తున్నారు.
ఇదీ చదవండి: ఈ చేప మహా డేంజర్.. మనుషులనూ వేటాడేస్తుంది.. ప్రత్యేకత ఏంటంటే?
ఈనెల 19 నుంచి మార్చి 20వ తేదీ వరకు నెల రోజులపాటు గురుమౌడ్యమి ఉంది. దీంతో ఆ సమయంలో శుభ ముహూర్తాలు తగ్గిపోయాయని సిద్ధాంతులు చెబుతున్నారు. ఓవైపు కొవిడ్ నిబంధనలు కూడా ఉండడంతో కొందరైతే ఈ శుభ ముహూర్తాలకే మమ అనిపించేయడం బెటర్ అని సిద్ధపడుతుంటే.. మరికొందరు భారీగా వేడుకలు నిర్వహించడానికి రెడీ అయ్యారు. ఇప్పటికే ప్రముఖ నగరాల్లో కల్యాణ మండపాలను చాలామంది బుక్ చేసుకున్టునారు. మంచి కళ్యాణ మండపాలకు ఫుల్ డిమాండ్ ఉంటోంది.
ఇదీ చదవండి: ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధమైన బాలయ్య.. రేపు హిందూపురంలో మౌనదీక్ష
మాఘమాసం తో పాటు ఇప్పటికే ముహూర్తాలు ప్రారంభమయ్యాయి. ఈనెల 4, 5, 10, 11, 16 తేదీలతో పాటు మార్చి 24, 26, 27 తేదీల్లో ముహూర్తాలు ఉన్నాయి. ఈ తేదీల్లోనే వివాహాలు జరగనున్నాయి. దీనికితోడు గత రెండేళ్లుగా వివాహాలపై కరోనా ఎఫెక్ట్ పడింది. సాదాసీదాగానే వివాహాలు జరిగాయి. దీంతోపాటు ఇప్పటివరకు వివాహాలకు 200 మందికి అనుమతి ఉంది. ప్రస్తుతం కేసుల సంఖ్య పెరుగుతుండడంతో ఇప్పుడున్న నిబంధనలు సవరించి తీవ్రం చేసే అవకాశం ఉంది.
ఇదీ చదవండి: ఛలో విజయవాడపై సీఎం జగన్ సీరియస్.. నిఘా వైఫల్యాంపై ఆరా..
ప్రతి ఒక్కరూ కోవిడ్ ప్రోటోకాల్ ను పాటించాలనేది అధికారుల నుంచీ సూచన. జనవరిలో 31 రోజుల్లో దాదాపు 29 వేల కేసులు నమోదయ్యాయి. ఫిబ్రవరి ఒకటి నాటికి ఇవి ముప్పై దాటినా.. కేసులు తగ్గుముఖం పట్టాయి. కరోనా తీవ్రత, కేసులు తక్కువ ఉన్న నేపథ్యంలో ఆందోళన తక్కువగా ఉన్నా.. జాగ్రత్తలు, అప్రమత్తతా అవసరమని అంటున్నారు వైద్యఆరోగ్య శాఖ అధికారులు. ప్రతీ ఒక్కరూ ప్రభుత్వ ఆదేశాలను, కొవిడ్ నిబంధనలను పాటించాలని కోరుతుననారు. ఇక అన్ని వివాహాలకు అనుమతి తప్పనిసరి అంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Arrange marriage, Corona marriages, Marriages