హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Good News: విశాఖ ప్రజలకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి మరో కొత్త రైలు.. దాని ప్రత్యేకత ఏంటో తెలుసా?

Good News: విశాఖ ప్రజలకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి మరో కొత్త రైలు.. దాని ప్రత్యేకత ఏంటో తెలుసా?

విశాఖవాసులకు శుభవార్త

విశాఖవాసులకు శుభవార్త

Good News: విశాఖ ప్రజలకు కేంద్ర గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలో మరో కొత్త రైలు అందుబాటులోకి తెచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అది కూడా భారత ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో ఒకటి విశాఖకు వచ్చే ఛాన్స్ ఉంది. దీనికి ప్రత్యేకత ఏంటంటే..?

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Visakhapatnam, India

  Anand Mohan Pudipeddi, Visakhapatnam, News18.

  Good News: కొత్త రైళ్ల విజయం ఎప్పుడు విశాఖ (Visakha) కు అన్యాయమే జరుగుతోంది అన్ని.. ఉత్తరాంధ్ర ప్రజల (Uttarandhra People) అభిప్రాయం. అయితే ఈ సారి కేంద్రం మాత్రం.. విశాఖ ప్రజలకు గుడ్ న్యూస్ చెబుతోంది. మరో కొత్త రైలు అందుబాటులోకి తేవాలని నిర్ణయించినట్టు సమాచారం. భారత ప్రభుత్వం (Indian Government) ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతున్న ‘వందేభారత్‌’ ఎక్స్‌ప్రెస్‌ (Vande Bhart Express) రైళ్లలో ఒకటి విశాఖ నుంచి లేదా విశాఖ మీదుగా నడపనున్నట్టు తెలిసింది. ఈ ట్రైన్ కు ఎంతో ప్రత్యేకత ఉంది. సుమారు గంటకు 130 కిలోమీటర్ల వేగంతో ఇది ప్రయాణిస్తుంది. ఈ రైలు ర్యాక్‌ తయారీకి 100 కోట్ల రూపాయల వ్యయం అవుతుంది. అలాగే ఇందులో సౌకర్యాలు కూడా అధునూతనంగా ఉంటాయి.

  ప్రత్యేకించి విమానం తరహాలో చైర్‌ సీటింగ్‌ ఉంటుంది. పూర్తిగా ఏసీ కోచ్‌. ఎకానమీ, ప్రీమియం అని రెండు రకాల క్లాసులు మాత్రమే ఉంటాయి. స్లీపర్‌ కోచ్‌లు ఏమీ ఉండవు. సీట్లు ఎటు కావాలంటే అటు తిరుగుతాయి. కిటికీలు కూడా పెద్దవిగా ఉంటాయి. ఆటోమేటిక్‌ డోర్స్‌, స్మోక్‌ అలారం, సీసీ టీవీ కెమెరాలు, సెన్సర్‌తో పనిచేసే వాటర్‌ ట్యాప్‌లు, బయో వ్యాక్యూమ్‌ టాయ్‌లెట్లు వీటి ప్రత్యేకత.

  త్వరలోనే ప్రారంభమం కానున్న ఈ రైలు విశాఖ నుంచి ఎక్కడకు నడపాలనేది ఇంకా నిర్ణయించలేదని సమాచారం. అటు భువనేశ్వర్‌ వైపా? ఇటు సికింద్రాబాద్‌ వైపా? అనేది తేలలేదు. ఈ రైలు నడపడానికి, అందులో పనిచేయడానికి సిబ్బందికి ప్రత్యేక శిక్షణ అవసరం. ప్రస్తుతం విశాఖ సిబ్బందికి చెన్నై, ఢిల్లీల్లో ఎలక్ట్రికల్‌, మెకానికల్‌ వంటి అంశాలపై శిక్షణ ఇస్తున్నట్టు విశాఖ డీఆర్‌ఎం అనూప్‌కుమార్‌ శెత్పథి తెలిపారు.

  ఇదీ చదవండి : ఫ్లూటు బాబు ముందు ఊదు.. జగన్ ముందు కాదు.. అక్కడ ఉన్నది జ"గన్".. రోజా సంచలన వ్యాఖ్యలు

  చెన్నైలోని ఇంటిగ్రల్‌ కోచ్‌ ఫ్యాక్టరీలో ఇప్పటికే కొన్ని బ్యాచ్‌లకు శిక్షణ పూర్తయిందని వివరించారు. దశల వారీగా ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు విశాఖ నుంచి నడిచే అన్ని రైళ్లకు దశల వారీగా అధునాతన సౌకర్యాలతో కూడిన ఎల్‌హెచ్‌బీ కోచ్‌లను అమర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇప్పటికే 40 శాతం పూర్తి చేశామని డీఆర్‌ఎం తెలిపారు. కొత్తగా మరో రెండు ఎల్‌హెచ్‌బీ ర్యాక్‌లు వచ్చాయని, వాటిని విశాఖ నుంచి ఎల్‌టీటీకి, డిఘా రైళ్లకు జత చేస్తున్నామని వివరించారు. వచ్చే నెల నుంచి వారణాశికి రైలు నడపనున్నట్టు ఆయన చెప్పారు.

  ఇదీ చదవండి : పేదలు, సామాన్యులకు బిగ్ షాక్.. ఇక అన్నం గురించి మరిచిపోవాల్సిందేనా..?

  విశాఖపట్నం రైల్వేస్టేషన్‌ రీడెవలప్‌మెంట్‌ పనులు కూడా త్వరలోనే ప్రారంభమవుతాయని, టెండర్లు ఖరారైపోయాయని స్పష్టంచేశారు. ఇందులో భాగంగా జ్ఞానాపురం వైపు ఎనిమిదో నంబరు ప్లాట్‌ఫారం తరువాత మరో రెండు రెడు ప్లాట్‌ఫారాలు నిర్మించాలని ప్రతిపాదించామని చెప్పారు. రైల్వేస్టేషన్‌లో ప్రయాణికులకు అన్నిరకాల సౌకర్యాలు కల్పించాలని యత్నిస్తున్నామన్నారు. ‘విశాఖ ఎక్స్‌ప్రెస్‌’లో ప్రయాణికులకు ఇచ్చే దుప్పట్లు బాగా లేవని ఇటీవల ఫిర్యాదులు వచ్చాయని, దాంతో వాటిని పరిశీలించామన్నారు. విశాఖ నుంచి నడిచే అన్ని రైళ్లలో ఇకపై కొత్త దుప్పట్లు ఇచ్చేలా చర్యలు తీసుకున్నామన్నారు.

  ఇదీ చదవండి : తిరుపతిలో భారీ అగ్నిప్రమాదం.. డాక్టర్ సజీవదహనం.. ఇద్దరు పిల్లలు మృతి.. కారణం ఏంటంటే?

  రైల్వే మంత్రిత్వ శాఖ ఇటీవల అన్ని రైళ్లలో ఏసీ కోచ్‌ల సంఖ్య పెంచాలని నిర్ణయించిందని డీఆర్‌ఎం వివరించారు. వాటిని అదనంగా కాకుండా, స్లీపర్‌ కోచ్‌ల సంఖ్య తగ్గించి ఏసీ కోచ్‌లను పెడుతున్నట్టు చెప్పారు. అందులో భాగంగానే ఇటీవల కొన్ని రైళ్లలో స్లీపర్‌ కోచ్‌ల సంఖ్య తగ్గిందన్నారు. ఎక్కువ మంది ఏసీ ప్రయాణానికి ప్రాధాన్యం ఇస్తున్నారని అందుకే ఉన్నతాధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Indian Railways, Vizag

  ఉత్తమ కథలు