Home /News /andhra-pradesh /

GOLDEN CHANCE TO YOUTH TRIBAL LEADERS CM JAGAN MOHAN REDDY IS THERE CHANCE TO NEW LEADERS NGS VSP

AP New District: కొత్త జిల్లాలతో గిరిజన యువకులకు అందలం.. కొత్త నేతలు పుట్టుకొస్తారా..?

AP New Districts: ఆంధ్రప్రదేశ్ కొత్త జిల్లాలపై వివాదం ఎలా ఉన్నా..? గిరిజన నేతలకు గోల్డెన్ ఛాన్స్ అంటున్నారు రాజకీయ నిపుణఉలు.. కొత్త జిల్లాల ఏర్పాటుతో ఇక మెయిన్ ఫ్రేమ్ లోకి గిరిజన నేతలు వచ్చే అవకాశం ఉంది.. జగన్ ఫార్ములాతో కొత్త నాయకులు పుట్టుకొస్తారా..?

AP New Districts: ఆంధ్రప్రదేశ్ కొత్త జిల్లాలపై వివాదం ఎలా ఉన్నా..? గిరిజన నేతలకు గోల్డెన్ ఛాన్స్ అంటున్నారు రాజకీయ నిపుణఉలు.. కొత్త జిల్లాల ఏర్పాటుతో ఇక మెయిన్ ఫ్రేమ్ లోకి గిరిజన నేతలు వచ్చే అవకాశం ఉంది.. జగన్ ఫార్ములాతో కొత్త నాయకులు పుట్టుకొస్తారా..?

AP New Districts: ఆంధ్రప్రదేశ్ కొత్త జిల్లాలపై వివాదం ఎలా ఉన్నా..? గిరిజన నేతలకు గోల్డెన్ ఛాన్స్ అంటున్నారు రాజకీయ నిపుణఉలు.. కొత్త జిల్లాల ఏర్పాటుతో ఇక మెయిన్ ఫ్రేమ్ లోకి గిరిజన నేతలు వచ్చే అవకాశం ఉంది.. జగన్ ఫార్ములాతో కొత్త నాయకులు పుట్టుకొస్తారా..?

ఇంకా చదవండి ...
    P Anand Mohan, Visakhapatnam, News18.                          AP New Districts:  ఆంధ్రప్రదేశ్  (Andhra pradesh) రాజకీయ ముఖ చిత్రం మారనుందా..  కొత్త జిల్లాల  (New Districts)ఏర్పాటుపై ఎన్నో భిన్నాభిప్రాయాలు వివాదాలు ఉన్నా.. కొంతమంది నేేతలకు ఇది గోల్డెన్ ఛాన్సే అని చెప్పాలా..? ముఖ్యంగా గిరిజన ప్రాంతాల నేతలకు ప్రభుత్వ  ఫార్ములా అందలం ఎక్కలే చేస్తుందా...? సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) గిరిజన నేతలకు  రాజకీయ భవిష్యత్తును ఇచ్చినట్టే చూడాలా..?  ఇప్పటికే మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లా పేరిట పార్వతీపురం, పాడేరును జిల్లాలుగా ప్రతిపాదించారు.  ఈ నిర్ణయంతో  గిరిజన ప్రాంత నేతలందరికీ రాజకీయ భవితవ్యం ఉంటుందనడంలో సందేహం లేదు. ముఖ్యంగా పాడేరు (Paderu), అరకు (Araku) , పార్వతీపురం (Parvathipuram), కురుపాం (Kurapam) వంటి ప్రాంతాల్లో నేతలు మెయిన్ ఫ్రేమ్ లో ఉంటారు. వారిని జనం మరిచిపోయే పరిస్థితి కూడా ఇక పై ఉండబోదంటారు రాజకీయ విశ్లేషకులు.

    భౌగోళికంగా ఏజెన్సీ ప్రాంతం ఎక్కువగా ఉన్నప్పటికీ రాజకీయంగా ఇప్పటివరకూ మైదాన, నగర ప్రాంత నాయకులే కీలకంగా వ్యవహరిస్తూ వస్తున్నారు. అయితే పాడేరు కేంద్రంగా అల్లూరి సీతారామరాజు జిల్లా ఏర్పాటు కానుండడంతో నిర్ణయాలు ఇకపై గిరిజన నాయకులే తీసుకునేందుకు అవకాశం దక్కుతుంది. ఏజెన్సీలో వైసీపీకి అరకులోయ ఎంపీ జి.మాధవి, పాడేరు, అరకులోయ ఎమ్మెల్యేలు భాగ్యలక్ష్మి, చెట్టి ఫాల్గుణుడు, జడ్పీ చైర్‌పర్సన్‌ సుభద్ర, తెలుగుదేశం పార్టీకి మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, మాజీ మంత్రి కిడారి శ్రావణ్‌కుమార్‌, దొన్నుదొర, ఎంవీవీ ప్రసాద్‌, సివేరి అబ్రహం వంటి వారు కీలకం కానున్నారు.

    గతంలో పరిస్థితి చూస్తే.. ఎంపీ కిషోర్ చంద్రదేవ్, మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు వంటి నేతలు రాజకీయంగా తెరమరుగు అయినట్టే అనిపిస్తుంది. కానీ.. ఈ జిల్లాల ఏర్పాటుతో వారికి మంచి ప్రాధాన్యం ఉండబోతోంది. వీరితో మరికొందరు నాయకులు తయారయ్యే అవకాశం ఉంది.

    ఇక మైదాన ప్రాంతంగా చెప్పే.. అనకాపల్లి జిల్లాలో అధికార పార్టీలో ఎంపీ సత్యవతి, ప్రభుత్వ విప్‌, మాడుగుల ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు, ఎలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబురాజు, చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, సీనియర్‌ నేత దాడి వీరభద్రరావు కీలకంగా మారనున్నారు. ఇక తెలుగుదేశం పార్టీలో మాజీ మంత్రులు చింతకాయల అయ్యన్నపాత్రుడు, బండారు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలు (నర్సీపట్నం, పెందుర్తి) రెండూ అనకాపల్లి జిల్లాలో విలీనం కానున్నాయి. వీరిద్దరితోపాటు తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత, సీనియర్‌ నేతలు పప్పల చలపతిరావు, కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు, పీలా గోవింద, బుద్ద నాగజగదీశ్వరరావు నిర్ణయాత్మక పాత్ర పోషించనున్నారు. అనకాపల్లి జిల్లాలో కాపులు, వెలమలు, గవరలు ప్రధాన సామాజిక వర్గాలుగా ఉన్నాయి. ఈ మూడు సామాజిక వర్గాల్లో బలమైన, చొరవ కలిగిన నేతలకు అవకాశాలు దక్కనున్నాయి.

    (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, Ap cm jagan, AP new districts, AP News

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు