హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Gold Smuggling: జాకెట్లలో బంగారం.. సీటు కింద డబ్బుల కట్టలు.. ట్రావెల్స్ బస్సు తనిఖీల్లో పోలీసులకు షాక్

Gold Smuggling: జాకెట్లలో బంగారం.. సీటు కింద డబ్బుల కట్టలు.. ట్రావెల్స్ బస్సు తనిఖీల్లో పోలీసులకు షాక్

ఐదు కోట్ల విలువైన బంగారం స్వాధీనం

ఐదు కోట్ల విలువైన బంగారం స్వాధీనం

Gold Smuggling: స్మగ్లర్ల తెలివి తేటలు పోలీసులకు సవాల్ విసురుతున్నాయి. రోజుకో కొత్త కొత్త ఐడియాలతో స్మగ్లర్లు పోలీసుల కన్ను కప్పే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా పుష్పా సినిమా ఎఫెక్ట్ స్మగ్లర్లపై బాగా పడింది. పోలీసులను తప్పించుకునేందుకు బుర్రకు పదుపు పెడుతూ కొత్త కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు.

ఇంకా చదవండి ...

Gold Smuggling: సాధారణంగా ప్రజలపై సినిమా ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. చాలమంది యవతీ, యువకులు తమ ఫేవరెట్ హీరో హీరోయిన్లను అనుకరించాలని ట్రై చేస్తారు. వారిలా ఉండాలి అని కలలు కంటారు. కొందరైతే సినిమాలో చూపించే మంచి మెసేజ్ ను పక్కన పెట్టేసి.. కేవలం నేరం ఎలా చేయాలి అన్నంత వరకు ప్రేరణగా తీసుకుంటున్నారు. ముఖ్యంగా స్మగ్లింగ్ గ్యాంగ్ లో వారికి పుష్పా సినిమా (Pushpa Movie) చకట్టి వరమైంది. దీంతో కొత్త కొత్త ఐడియాలతో స్మగ్లర్లు దూసుకుపోతున్నారు. తాజాగా కర్నూలు జిల్లా (Kurnool District)లో భారీగా బంగారం, వెండి పట్టుకున్నారు అధికారులు. సాధారణ తనిఖీల్లో భాగంగా బస్సులో సోదాలు చేస్తుండగా అసలు విషయం తెలియడంతో.. పోలీసులు సైతం షాక్ అయ్యారు. ఎందుకంటే అదే బస్సులో ఎవ్వరూ ఊహించని విధంగా సుమారు ఎనిమిదిన్నర కేజీల బంగారం.. తొమ్మిది లక్షల నగదును పోలీసులు గుర్తించారు. పోలీసులు కళ్లు కప్పేందుకు వారు చూపించిన తెలివి చూసి.. పోలీసులు నోరు వెళ్లబెట్టాల్సి వచ్చింది..

సాధారణ తనిఖీల్లో భాగంగా ఓ బస్సులో సోదాలు చేస్తుండగా.. ఐదుగురు ప్రయాణికుల నుంచి భారీగా నగదుతోపాటు బంగారం, వెండి లభ్యమైంది. 28.5 కేజీల వెండి బిస్కెట్లు, 8.250 కేజీల బంగారు బిస్కెట్లు, 90 లక్షల నగదు సీజ్‌ చేశారు. పట్టుబడిన వారంతా తమిళనాడులోని సేలం పట్టణానికి చెందిన దేవరాజు, సెల్వరాజు, కుమార వేలు, మేయలాగ మురుగేశన్, కోయంబత్తూరుకు చెందిన వెంకటేశ్‌గా గుర్తించారు. అయితే వీరంతా వినూత్న రీతిలో వీటిని తరలించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. చొక్కాలో, జిప్‌ జేబులో దాచి పెట్టారు. అయితే ఇవి ఎవరికి చెందినవనే వివరాలు తెలుసుకునే పనిలో ఉన్నారు అధికారులు. ఇంత భారీ మొత్తంలో ఎక్కడికి తరలిస్తున్నారని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి : కలవరు అనుకున్న వైసీపీ-టీడీపీ నేతలను కలుపుతున్న కొత్త జిల్లాలు.. పార్టీ మారాలని ఆయన ఫిక్స్ అయ్యారా..? 

అక్రమంగా రవాణా చేస్తున్న కోట్ల విలువైన బంగారం.. నగదును చూసి కర్నూలు జిల్లా స్పెషల్ బ్రాంచ్ పోలీసులు (SEB) పోలీసులు షాకయ్యారు. మొత్తం బంగారం, వెండి కలిపి సుమార ఐదు కోట్లపైనే దీని లెక్కల ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ ఘటన జిల్లాలోని (kurnool district) పంచలింగాల చెక్ పోస్ట్ దగ్గర జరిగింది. హైదరాబాద్ నుంచి కొయంబత్తూర్ వెళ్తున్న NL01 B 1149 నెంబరు గల స్వామి అయ్యప్ప ప్రైవేటు ట్రావెల్ బస్సును పంచాలింగాల అంతరాష్ట్ర సరిహద్దు వద్ద పోలీసులు తనిఖీ చేశారు. ప్రయాణికులను చెక్ చేస్తుండంగా ఐదుగురు అనుమానాస్పదంగా కనిపించారు. దీంతో అనుమానం వచ్చి తనిఖీలు చేస్తుంటే అంతా షాక్ అయ్యారు..


ఇదీ చదవండి : టీడీపీలో ఫ్యామిలీ ప్యాక్.. ఆ కుటుంబాలకు టికెట్లు ఫిక్స్ చేసిన చంద్రబాబు.. ఎవరు ఎక్కడ నుంచి అంటే?

హైదరాబాద్‌లోని వివిధ బంగారపు షాపుల్లో ముడి బంగారం, వెండిని సేకరించి.. తమిళనాడులో ఆభరణాలుగా తయారుచేసి.. తిరిగి హైదరాబాద్ లోని జ్యువెలరీ షాపుల్లో ఆప్పగిస్తామన్నారు. అయితే పట్టుబడ్డ బంగారం, నగదుకు సంబంధించిన డాక్యుమెంట్స్ లేకపోవడంతో వాటిని స్వాధీనం చేసుకొని ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

First published:

Tags: Andhra Pradesh, AP News, Crime news, Kurnool

ఉత్తమ కథలు