అనకాపల్లి రైల్వేస్టేషన్‌లో యూరోపియన్ స్టైల్ సిస్టం... భలే ఉందిగా...

Indian Railways : దేశంలో రైల్వేస్టేషన్లకు కొరత లేదు. అలాంటిది మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అనకాపల్లి స్టేషన్‌లో ఏం తెచ్చారు. అసలు అది ఏంటిది... తెలుసుకుందాం.

news18-telugu
Updated: January 4, 2020, 10:47 AM IST
అనకాపల్లి రైల్వేస్టేషన్‌లో యూరోపియన్ స్టైల్ సిస్టం... భలే ఉందిగా...
అనకాపల్లి రైల్వేస్టేషన్‌లో యూరోపియన్ స్టైల్ సిస్టం... (credit - twitter - Chandra Prakash)
  • Share this:
Indian Railways : మన దేశం మొదటి నుంచీ యూరోపియన్ స్టైల్స్‌ను, టెక్నాలజీని అమల్లోకి తెచ్చుకుంటోంది. తాజాగా భారతీయ రైల్వేలో యూరోపియన్ స్టైల్ ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ సిస్టం తెస్తున్నారు. ఇప్పటికే దీన్ని దక్షిణ మధ్య రైల్వేలో.. విజయవాడ డివిజన్‌లో భాగమైన అనకాపల్లి స్టేషన్‌లో అమల్లోకి తెచ్చారు. దీని వల్ల ప్రయాణికులకు రైల్వేస్టేషన్‌లో ముఖ్యమైన సమాచారం అత్యంత తేలిగ్గా తెలుసుకునే వీలు కలుగుతుంది. ఇందులో ఎట్ ఏ గ్లాన్స్ డిస్ప్లే బోర్డ్, కోచ్ గైడెన్స్ డిస్ప్లే బోర్డ్ చూడొచ్చు. ఎట్ ఏ గ్లాన్స్ డిస్ప్లే బోర్డ్ అంటే... స్టేషన్‌కి వచ్చే రకరకాల రైళ్ల టైమింగ్స్‌ చూపిస్తుంది. కోచ్ గైడెన్స్ డిస్ప్లే బోర్డ్... ట్రైన్‌కి ఉండే బోగీల (కోచ్‌లు) వివరాలు తెలుసుకోవచ్చు. ఇలాంటి డిస్ప్లే బోర్డులు యూరప్‌లో కనిపిస్తుంటాయి.


అనకాపల్లి రైల్వేస్టేషన్‌కి వచ్చే రైళ్ల వేగం, అవి ఉన్న ప్రదేశం, స్టేషన్‌కి రాగలిగే అంచనా టైమ్ ఇవన్నీ లెక్కలోకి తీసుకొని... ఈ బోర్టులో వివరాలు ఇస్తున్నారు. ఇందుకోసం సెంట్రలైజ్డ్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టం (CRIS) ఉపయోగపడుతోంది. దీన్ని ఉపయోగించి... రైళ్ల వివరాల్ని ఎప్పటికప్పుడు డిస్ప్లే బోర్డులో అప్ డేట్ చేస్తారు. ఈ సిస్టం ద్వారా వచ్చే రెండు గంటల్లో స్టేషన్‌కి ఏయే రైళ్లు వస్తాయో తెలుస్తుంది. ఇందులో సమాచారం తెలుగు, ఇంగ్లీష్, హిందీలో కనిపిస్తుంది.అనకాపల్లిలో స్టేషన్ ఎంట్రన్స్ దగ్గరే ఏర్పాటు చేసిన ఈ సిస్టం ద్వారా... ఏ ట్రైన్ ఎక్కడుందో, వచ్చే రెండు గంటల్లో అది ఏ టైముకి స్టేషన్ చేరుకుంటుందో తెలుస్తుంది. ట్రైన్ నంబర్, నేమ్ కూడా తెలుస్తాయి. ఇంజిన్, జనరల్, స్లీపర్, ఏసీ కోచ్‌ల వివరాలు ముందే తెలుస్తాయి కాబట్టి... ప్రయాణికులు ముందుగానే ఆ కోచ్ ఆగే ప్లాట్‌ఫాంకి వెళ్లేందుకు వీలవుతోంది. ప్రయాణికులకు అందే సేవలు, ట్రైన్‌లో ఉండే ఫెసిలిటీస్ వివరాలు కూడా ఈ బోర్డుల్లో కనిపిస్తాయి.
Published by: Krishna Kumar N
First published: January 4, 2020, 10:47 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading