GODAWARI DELTA POLLUTED DUE TO AQUA WASTAGE IN ELURU PRN
Mystery Disease: ఇంకా వీడని మిస్టరీ... ఏలూరులో వింత వ్యాధికి అదే కారణమా..?
ఏలూరు వింత వ్యాధి బాధితులు (ఫైల్ ఫోటో)
గోదావరి డెల్టా కలుషితం కావడానికి ఆక్వాతో పాటు వ్యవసాయ వ్యర్థాలు కారణని నిపుణలు భావిస్తున్నారు. ముఖ్యంగా ఆక్వా సాగు నుంచి విడుదలయ్యే రసాయనాలు, పురుగుల మందుల అవశేషాలతో కాలువలు విషపూరితంగా మారుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు మిస్టరీ వ్యాధిపై పలు కారణాలు ప్రచారంలో ఉన్నాయి. విజయవాడ నుంచి ఢిల్లీ వరకు వివిధ సంస్థలకు చెందిన స్పెషల్ టీమ్స్ ఏలూరులోని త్రాగునీరు, పాలు, ఆహారం, కూరగాయలు వంటివాటి నుంచి శాంపిల్స్ తీసుకొని పరీక్షలు జరుపుతున్నారు. అయినా ఇంతవరకు వింత వ్యాధికి కారణమేంటనేదానిపై క్లారిటీ రాలేదు. పూర్తి స్పష్టత వస్తే తప్ప నివారణ చర్యలు చేట్టడం ప్రభుత్వానికి సాధ్యంకాదు. నీటి రసాయనాల మోతాదు ఎక్కువగా ఉండటంతో ఈ సమస్య తలెత్తినట్లు ప్రాథమికంగా నిర్ధారణ అయింది. నీరు ఈస్థాయిలో కలుషితం కావడానికి కారణం ఆక్వాసాగు అనే వాదన కూడా వినిపిస్తుంది. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా దీనిపైనే చర్చ జరుగుతోంది. ఆదాయమిస్తున్న ఆక్వా సాగు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
అక్వా వ్యర్థాలే కారణమా..?
ఉభయ గోదావరి జిల్లాల్లో ఆక్వా సాగు బాగా విస్తరించింది. గోదావరి డెల్టాలో వేలాది ఎకరాల్లో పంటలసాగు కాలువల ద్వారానే సాగుతోంది. డెల్టా ప్రధాన కాలువల చెంతనే ఆక్వా చెరువులు పట్టుకు వచ్చాయి. రెండు జిల్లాల్లో తూర్పు, పశ్చిమ డెల్టాలు, వాటి బ్రాంచ్ కాలువలు, పంటకాలువలన్నీ కలిపి 3వేల కిలోమీటర్ల మేర ఉన్నాయి. చేపలు,రొయ్యల పపెంపకంలో వాడే ఎరువులు, ఇతర మందుల అవశేషాలు, సాధారణ పంటల సాగులో వాడే రసాయనాలన్నీ నేరుగా పంటకాలువల్లో కలిసిపోతున్నాయి. అదే నీటిని శుద్ధి చేసి గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లోని ప్రజలకు తాగునీరుగా సరఫరా చేస్తున్నారు. కావున ఏలూరులో పరీక్షించిన తాగునీటి నమూనాల్లో పరుగు మందుల అవశేషాలున్నట్లు నిపుణులు చెప్తున్నారు.
కాలువలన్నీ కలుషితం
పశ్శిమ డెల్టాలో దాదాపు అన్ని కాలువలు కలుషితమయ్యాయి. కాకరపర్రు కెనాల్, నర్సాపురం కెనాల్, అత్తిలి కాలువ, ఏలూరు కాలువ, వయ్యేరు కాలువ ఇలా అన్ని కాలువల్లోనూ రసాయనాలు కలుస్తున్నాయి. కేవలం కాలువలే కాదు కొన్ని ప్రాంతాల్లోని భూగర్భ జలాలు కూడా కలుషితమైనట్లు నిపుణులు చెప్తున్నారు. జిల్లాలో పలుచోట్ల భూగర్భ జలాలను పరీక్షించగా వాటిలో సీసం, నికెల్ వంటి భారలోహాలతో పాటు ఈ-కోలి వంటి బ్యాక్టీరియా కూడా ఉన్నట్లు వెల్లడైంది. నీటిలోని బ్యాక్టీరియాను నిర్మూలించేందుకు పరిమితికి మించి క్లోరిన్ వినియోగించడం వల్ల ప్రజారోగ్యం దెబ్బతింటోంది. సాధారణంగా తాగునీటిలో రెసిడ్యుయల్ క్లోరిన్ కేవలం 0.2పీపీఎం మాత్రమే ఉండాలి కానీ చాలా చోట్ల ఇది అంతకంటే ఎక్కువగానే ఉంటోంది.
తాగునీటిలో రసాయనాల శాతం అధికంగా ఉంటే ప్రాణాంతక వ్యాధులు బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని డాక్టర్లు చెబుతున్నారు. ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని కాపాడితేనే ఆరోగ్యం బావుంటుందని సలహా ఇస్తున్నారు.
Published by:Purna Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.