గోదావరి విషాదం: బోటు యజమాని వెంకటరమణ సహా ముగ్గురు అరెస్ట్

గోదావరి నదిలో 210 అడుగుల లోతులో ఉన్న బోటును తీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు అధికారులు. అంత అడుగున ఉన్న బోటును తీయడం అసాధ్యమనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి.

news18-telugu
Updated: September 20, 2019, 8:19 PM IST
గోదావరి విషాదం:  బోటు యజమాని వెంకటరమణ సహా ముగ్గురు అరెస్ట్
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
గోదావరి బోటు ప్రమాదం కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేశారు. బోటు యజమాని కోడిగుట్ల వెంటకరమణతో పాటు ఎల్లా ప్రభావతి, ఆచ్యుతమణిని మీడియా ముందు ప్రవేశపెట్టారు. బోటు యజమానుల్లో ప్రధానంగా ఏ-1గా ఉన్న కోడిగుడ్ల వెంకటరమణతో పాటు ఏ-2 ప్రభావతి, ఏ-3 అచ్యుతమణిని అరెస్ట్ చేశామని రంపచోడవరం ఎఎస్పీ వకుళ్ జిందాల్ వెల్లడించారు. ఈ ఘటనలో ఇంకా ఎవరికి ప్రమేయం ఉందన్న దానిపై విచారణ చేస్తున్నట్లు తెలిపారు.

ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై మీడియా వివరించారు పోలీసులు. గోదావరి ప్రవాహ ఉధృతిని బోటు డ్రైవర్‌ అంచనా వేయలేకపోయడం, సుడిగుండాలను తప్పించుకొని బోటును ముందుకు తీసుకెళ్లడంలో డ్రైవర్‌కు సరైన అవగాహన లేకపోవడం, అసలు ఆయనకు బోటు నడిపిన అనుభవం లేకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని చెప్పారు. దేవీపట్నం వద్ద బోటును తనిఖీ చేసినప్పుడు పర్యాటకులంతా లైఫ్ జాకెట్లు ధరించారని.. కొద్దిదూరం ముందుకెళ్లాక తీసివేసి ఉండవచ్చని వెల్లడించారు పోలీసులు.

ప్రమాద సమయంలో బోటులో 8 మంది సిబ్బంది సహా మొత్తం 75 మంది ఉన్నారని పోలీసులు చెప్పారు. వీరిలో 26 మంది ప్రాణాలతో బయటపడగా.. 34 మృతదేహాలను బయటకు తీశారు. మరో 15 మంది ఆచూకీ తెలియలేదు. బోటులోనే వారి డెడ్‌బాడీలు చిక్కుకొని ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఇక గోదావరి నదిలో 210 అడుగుల లోతులో ఉన్న బోటును తీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు అధికారులు. అంత అడుగున ఉన్న బోటును తీయడం అసాధ్యమనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి.


First published: September 20, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading