గోదావరి ప్రమాదం: ప్రాణాలు కాపాడిన కచ్చలూరు హీరోలకు నగదు ప్రోత్సాహకం

ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పర్యాటకుల ప్రాణాలను రక్షించిన కచ్చలూరు గ్రామానికి చెందిన వ్యక్తులకు రూ. 25 వేల నగదు ప్రోత్సాహం అందిస్తామని వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు ప్రకటించారు.

news18-telugu
Updated: September 27, 2019, 10:32 PM IST
గోదావరి ప్రమాదం: ప్రాణాలు కాపాడిన కచ్చలూరు హీరోలకు నగదు ప్రోత్సాహకం
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కచ్చలూరులో గోదావరి బోటు ప్రమాదంలో 26 మంది ప్రాణాలతో బయటపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే కచ్చలూరు గ్రామస్తులు ప్రాణాలకు తెగించి నదిలోకి దూకారు. గోదావరిలో మునిగిపోతున్న వారిని ఒడ్డుకు చేర్చి ప్రాణాలను రక్షించారు. అలా 26 మందిని కాపాడగలిగారు. కచ్చలూరు గ్రామస్తులే లేకుంటే ప్రాణ నష్టం మరింత పెరిగి ఉండేది. టూరిస్టులను కాపాడిన ఆ గ్రామస్తులకు తెలుగు ప్రజల నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. వాళ్లు రియల్ హీరోలు.. సెల్యూల్ అంటూ అందరూ మెచ్చుకున్నారు. ఈ నేపథ్యలో వారి సాహసాన్ని ఏపీ ప్రభుత్వం కూడా గుర్తించింది.

ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పర్యాటకుల ప్రాణాలను రక్షించిన కచ్చలూరు గ్రామానికి చెందిన వ్యక్తులకు రూ. 25 వేల నగదు ప్రోత్సాహం అందిస్తామని వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు ప్రకటించారు. కచ్చలూరు గ్రామస్థులను ఇప్పటికే సీఎం అభినందించారని మంత్రి గుర్తు చేశారు. ప్రయాణీకులను కాపాడిన కచ్చలూరు గ్రామస్థుల వివరాలు అధికారుల వద్ద ఉన్నాయని.. త్వరలోనే వారికి నగదు ప్రోత్సాహం అందించాలని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డికి ఆదేశాలు జారీ చేశామని స్పష్టం చేశారు. ఇక బోటును తీసే సామర్థ్యం ఉందని కొందరు ముందుకు వచ్చినప్పటికీ, వరద ప్రవాహం కొనసాగుతున్నందువల్ల కొత్త సమస్యలు వస్తాయని అవకాశమిచ్చేందుకు ఆలోచిస్తున్నామని మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు.

First published: September 27, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు