బోటు ప్రమాదాల నివారణకు కమిటీ.. రిపీట్ కావొద్దని అధికారులకు జగన్ వార్నింగ్

గోదావరిలో ప్రభుత్వ లాంచీలు నడవనప్పుడు.. ప్రైవేట్ లాంచీలు ఎందుకు నడుస్తున్నాయని అధికారులను నిలదీశారు. ఈ ఘటనలో ప్రభుత్వ యంత్రాంగం తప్పు ఉందని.. ఇకపై బాధ్యతగా వ్యవహరించాలని స్పష్టంచేశారు.

news18-telugu
Updated: September 16, 2019, 10:01 PM IST
బోటు ప్రమాదాల నివారణకు కమిటీ.. రిపీట్ కావొద్దని అధికారులకు జగన్ వార్నింగ్
సీఎం వైఎస్ జగన్
  • Share this:
నదుల్లో బోటు ప్రమాదాల నివారణ కోసం కమిటీని నియమించారు ఏపీ సీఎం వైఎస్ జగన్. బోటు ప్రయాణాలకు సంబంధించి కంట్రోల్ రూమ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. గోదావరిలో ప్రభుత్వ లాంచీలు నడవనప్పుడు.. ప్రైవేట్ లాంచీలు ఎందుకు నడుస్తున్నాయని అధికారులను నిలదీశారు. ఈ ఘటనలో ప్రభుత్వ యంత్రాంగం తప్పు ఉందని.. ఇకపై బాధ్యతగా వ్యవహరించాలని స్పష్టంచేశారు. దేవీపట్నం సమీపంలో బోటు ప్రమాద ఘటనపై సబ్‌కలెక్టర్‌ కార్యాలయంలో మంత్రులు, అధికారులతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఘటన జరిగిన తీరును, సహాయకార్యక్రమాలను శాఖల వారీగా అడిగి తెలుసుకున్నారు.

ఆస్పత్రిలో వారిని చూసినప్పుడు నాకు చాలా బాధ వేసింది. మనం అంతా ఏం చేస్తున్నామనిపిస్తోంది. మన అలసత్వం కారణంగానే ఇది జరిగింది కాదా? బోటును ఆపగలిగే అవకాశం ఉన్నా..అలసత్వం, నిర్లక్ష్యం కారణంగానే ఆపలేకపోయాం. ప్రతి ఒక్కరూ దీనికి బాధ్యత వహించాలి. చనిపోయినవారి కుటుంబాలకు రూ.10లక్షల చొప్పున ఆర్థిక సహాయం ప్రకటించాం. గాయపడ్డవారికి రూ.3 లక్షలు, ఘటననుంచి బయటపడ్డ వారికి రూ.1 లక్ష చొప్పున పరిహారాన్నిఅందజేస్తాం. జరిగిన తప్పుకు బాధ్యత వహించి ఆయా కుటుంబాలకు మంచిచేయాలని అందరికీ పరిహారాన్ని ప్రకటిస్తున్నాం.
వైఎస్ జగన్


బోటు ప్రమాదాల నివారణ కోసం వేసిన కమిటీకి ఇరిగేషన్‌ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ ఛైర్మన్‌గా ఉంటారు. స్పెషల్‌చీఫ్‌ సెక్రటరీ రెవిన్యూ, టూరిజం ప్రిన్సిపల్‌ సెక్రటరీ, అడిషన్‌ డీజీ లా అండ్‌ ఆర్డర్, పోర్టు డైరెక్టర్‌ సభ్యులుగా ఉంటారని జగన్ తెలిపారు. కేవలం జీవోలు ఇచ్చి ఊరుకోవడంకాదన్న సీఎం.. వాటిని అమలు జరిగేలా చూసే బాధ్యత కమిటీదేనని స్పష్టంచేశారు. మూడు వారాల్లోగా నివేదిక సమర్పించాలని.. నాలుగోవారానికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించి అమలు చేయాలని ఆదేశించారు సీఎం.

ఎవరు ఏంచేస్తున్నారన్నదానిపై ఎవ్వరికీ పట్టింపులేదని అధికారులకు క్లాస్ తీసుకున్నారు జగన్. ప్రమాదానికి అసలు కారణం ఇక్కడే ఉందని.. మొత్తం వ్యవస్థను మార్చాలని స్పష్టంచేశారు. పోలీసులు, ఇరిగేషన్, టూరిజం, పోర్టు విభాగాలు సమన్వయంతో కంట్రోల్‌ రూం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కంట్రోల్‌ రూం లేకుండా బోట్లు తిరిగే పరిస్థితి ఉండకూడదని... క్రమం తప్పకుండా బోట్లను తనిఖీలు చేయాలని స్పష్టంచేశారు. ప్రతిబోటులో జీపీఎస్, వైర్‌లెస్‌ సెట్లు కచ్చితంగా ఉండాలన్నారు సీఎం జగన్. మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని అధికారులను హెచ్చరించారు.
First published: September 16, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు