గోదావరిలో 315 అడుగుల లోతున బోట్... పైకి తేవడం ఎలా?

Godavari Boat Capsize : గోదావరిలో ప్రమాదం జరిగిన రెండ్రోజుల తర్వాత... బోట్ ఎక్కడుందో కనిపెట్టగలిగారు. కానీ దాన్ని బయటకు తేవడం ఎలా అన్నదే కొత్త సమస్యగా మారింది.

Krishna Kumar N | news18-telugu
Updated: September 17, 2019, 7:41 AM IST
గోదావరిలో 315 అడుగుల లోతున బోట్... పైకి తేవడం ఎలా?
వైఎస్ జగన్
  • Share this:
Andhra Pradesh : తూర్పుగోదావరి జిల్లా... కచ్చలూరు దగ్గర గోదావరిలో జరిగిన బోటు ప్రమాదంలో గల్లంతైన వారి కోసం గాలింపు కొనసాగుతోంది. వాళ్లు నీటిలో కొట్టుకుపోయారా లేక బోటులోనే చిక్కుకుపోయారా అన్నది తెలియట్లేదు. కచ్చలూరు ప్రాంతంలో 80 మంది NDRF సభ్యులు, ఒక SDRF బృందం, ఫైర్ సిబ్బంది, గజ ఈతగాళ్లు జోరుగా గాలిస్తున్నారు. రెండు హెలికాప్టర్లను రెస్క్యూ ఆపరేషన్ కోసం వాడుతున్నారు. 73 మందితో బోటు బయలుదేరగా... 27 మంది సురక్షితంగా బయటపడ్డారు. ఇప్పటివరకూ... 8 మృతదేహాల్ని గుర్తించగలిగారు. మిగతా 38 మంది కోసం గాలింపు కొనసాగుతోంది. ధవళేశ్వరం బ్యారేజీ గేట్ల నుంచీ ఓ డెడ్ బాడీ... కిందికి కొట్టుకుపోయినట్లు అధికారులు చెబుతున్నారు. పోలవరం దాటిన తర్వాత గోదావరి రకరకాల పాయలుగా చీలిపోతుంది. నీటిలో కొట్టుకోని పోయి ఉంటే... ఎవరు ఏ పాయవైపు కొట్టుకుపోయారో తెలియని పరిస్థితి. అందువల్ల అన్ని పాయలలోనూ గాలింపు చేయాల్సి ఉంటుంది. అది చాలా కష్టమైన వ్యవహారం.

బోటును తీయడం ఎలా : ప్రమాదంలో మునిగిపోయిన బోటు... ఏకంగా 315 అడుగుల లోతులో ఉన్నట్లు తెలిసింది. బోటును వెతికేందుకు ఉత్తరాఖండ్ నుంచీ సైడ్ స్కాన్ సోనార్‌ను తెచ్చారు. అది బోటును కనిపెట్టింది. నేవీ సిబ్బంది ఆ పరికరంతో గోదావరిలో దిగి... బోటును కనిపెట్టారు. ఇక దాన్ని బయటకు తియ్యడం మిగిలివుంది. అది చాలా కష్టమైన వ్యవహారంగా చెబుతున్నారు. అంతలోతులో ఉండటం వల్ల... బయటకు తీసేలోపు అది ముక్కలైపోయే అవకాశాలు ఉన్నాయంటున్నారు.

మరోవైపు బోట్ యజమానిపై కేసు నమోదైంది. ఇకపై అన్ని బోట్లనూ పరిశీలించాలనీ, నిబంధనలకు అనుకూలంగా లేనివాటి లైసెన్స్ రద్దు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు. ఇందుకు సంబంధించి ఉన్నతాధికారులకు కచ్చితమైన ఆదేశాలు ఇచ్చారు.

రెస్క్యూ ఆపరేషన్, ఇతర వివరాల కోసం ఏపీ ప్రబుత్వం కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసింది.


ఏరియా - కంట్రోల్ రూమ్
కాకినాడ- 18004253077
రాజమహేంద్రవరం 0883 2442344ఎటపాక సబ్ కలెక్టరేట్- 0874 8285279
రంపచోడవరం- 1800 4252 123
అమలాపురం ఆర్డీవో- 0885 6233100
కాకినాడ ఆర్డీవో- 0884 2368100
రంపచోడవరం ఆర్డీవో- 0885 7245166
విశాఖ కలెక్టరేట్- 1800 425 00002
ప.గో. కలెక్టరేట్- 1800 233 1077
మచిలీపట్నం కలెక్టరేట్- 08672 252847
First published: September 17, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>