బోటు ప్రమాదం : మృతుల కుటుంబాలకు బీమా... డబ్బు ఎలా పొందాలంటే

Boat Capsizes in Godavari : గోదావరిలో పడవ ప్రమాదం జరిగి వారం దాటిపోయింది. ఇంకా 14 మంది ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

Krishna Kumar N | news18-telugu
Updated: September 24, 2019, 5:56 AM IST
బోటు ప్రమాదం : మృతుల కుటుంబాలకు బీమా... డబ్బు ఎలా పొందాలంటే
గోదావరి బోటు ప్రమాద స్థలం వద్ద సహాయకచర్యలు (File)
  • Share this:
Boat Capsizes in Godavari : మాటలకు అందని విషాదం అది. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే గోదారి 37 మందిని మింగేసింది. మరో 14 మంది ఆచూకీ తెలియట్లేదు. వారు బతికే ఉన్నారా, చనిపోయారా అన్న ప్రశ్నకు సమాధానం దొరకట్లేదు. 215 అడుగుల లోతున ఉన్న బోటును (కొంతమంది 315 అడుగుల లోతున ఉందంటున్నారు) పైకి తీసుకొస్తే... అసలు విషయం తెలుస్తుందని కొందరంటున్నారు. కానీ ఆ దిశగా జోరుగా ప్రయత్నాలు సాగట్లేదు. బోటును తియ్యడం దాదాపు అసాధ్యమనే మాటలు అధికారుల వైపు నుంచీ వినిపిస్తున్నాయి. అంత లోతుకు యంత్రాల్ని పంపలేమన్నది వారి వాదన. ఇదివరకు చాలా ప్రమాదాల్లో మునిగిపోయిన బోట్లు ఇప్పటికీ గోదావరి గర్భంలోనే ఉన్నాయి. ఐతే... ఆ 14 మందికీ డెత్ సర్టిఫికెట్లు ఇస్తామని అధికారులు అంటుంటే... వారి బంధువులు మండిపడుతున్నారు. మిస్సింగ్ అయినవారిని చనిపోయారని ఎలా అంటారని ఫైర్ అవుతున్నారు. బోటును పైకి తేకుండా చేసేందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ వారు ఏమైపోయారో తెలియక... వారి ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు, బంధువులు పడుతున్న ఆవేదన, బాధ మాటల్లో చెప్పలేని విధంగా ఉంది. రాజమండ్రి ఆస్పత్రి దగ్గర వారంతా విచారంగా ఎదురుచూస్తున్న పరిస్థితి.

బోటు ప్రమాద వివరాలు :
- బోటులో ప్రయాణించినవారు 77 మంది

- సురక్షితంగా బయటకు వచ్చినవారు 26 మంది
- కనిపించకుండా పోయిన వారు 51 మంది


- ఇప్పటివరకూ లభ్యమైన మృతదేహాలు 37
- 14 మంది కోసం కొనసాగుతున్న గాలింపు.ప్రస్తుతం దేవీపట్నంలో 144 సెక్షన్ అమల్లో ఉంది. గాలింపు చర్యలు పూర్తయ్యేవరకూ ఇది కొనసాగనుంది. బోటు ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా భీమా అందనుందని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నయీమ్ తెలిపారు. ఐతే, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పరిహారంతో దీనికి సంబంధం లేదు. ఇన్సూరెన్స్ మనీ ఇచ్చేందుకు రాజమండ్రిలోని జిల్లా పోలీస్ ఆఫీస్‌లో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు... అక్కడకు వెళ్లి... డెత్ సర్టిఫికెట్ ఇతరత్రా ఆధారాలు సమర్పించి, ఇన్సూరెన్స్ డబ్బు రూ.10 లక్షలు పొందాల్సి ఉంటుంది.

ఇన్సూరెన్స్ సొమ్ముపై మరింత సమాచారం కోసం :
- రజనీకుమార్, సీఐ నంబర్ - 9440796395
- న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధి ప్రకాష్ నంబర్ - 9700001818
- ల్యాండ్ లైన్ నంబర్ - 08854254073
- సమర్పించాల్సిన పత్రాలు - FIR కాపీ, డెత్ సర్టిఫికెట్, పోస్ట్‌మార్టం రిపోర్ట్, బ్యాంక్ అకౌంట్ వివరాలు, వారసుల సర్టిఫికెట్.
First published: September 24, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు