గోదావరిలో లంగరుకు తగిలిన బోటు... నేడు బయటకు వచ్చే అవకాశం

Godavari Boat Capsize : గోదావరిలో బోటు వెలికితీత ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. ఇవాళ బోటును బయటకు తీసే ఛాన్స్ ఉందని ధర్మాడి సత్యం బృందం తెలిపింది.

news18-telugu
Updated: October 18, 2019, 6:26 AM IST
గోదావరిలో లంగరుకు తగిలిన బోటు... నేడు బయటకు వచ్చే అవకాశం
గోదావరిలో లంగరుకు తగిలిన బోటు... నేడు బయటకు వచ్చే అవకాశం (File)
news18-telugu
Updated: October 18, 2019, 6:26 AM IST
Godavari Boat Capsize : ఉద్ధృతంగా ప్రవహించే గోదావరిలో మునిగిపోయిన ఓ భారీ బోటును బయటకు తీయడం అంత తేలికైన పని కాదు. కానీ... ఆ కష్టమైన ఆపరేషన్‌ను ఎట్టి పరిస్థితుల్లో విజయవంతంగా పూర్తి చెయ్యాలని కాకినాడకు చెందిన ధర్మాడి సత్యం బృందం ప్రయత్నిస్తోంది. లక్కీగా ఈ ప్రయత్నాలు మంచి ఫలితాల్ని ఇస్తున్నాయి. పడవకు సంబంధించి లంగర్ వెయ్యగా... దానికి బోటు పైన ఉండే ఇనుప రెయిలింగ్‌ తగిలింది. దాంతో బోటును పైకి లాగేందుకు ప్రయత్నించారు. ఆరు మీటర్లు బోటు కదిలింది. అంతలో రెయిలింగ్ ఊడిపోయింది. లంగర్ నుంచీ మళ్లీ బోటు జారిపోయింది. రెయిలింగ్ ఒక్కటే పైకి వచ్చింది. మొత్తంగా బోటు అక్కడే ఉందని అర్థమైంది. ఆల్రెడీ నిన్న గట్టిగా ప్రయత్నించడంతో... బోటును లంగర్‌కి ఎలా సెట్ చెయ్యాలో తెలిసిందని ధర్మాడి సత్యం బృందం చెబుతోంది. అందువల్ల ఇవాళ లంగర్‌ను సెట్ చేసి... బోటును మెల్లగా పైకి తెస్తామని సత్యం బృందం తెలిపింది. అందువల్ల ఇవాళ మధ్యాహ్నానికి బోటు బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

boat capsizes,boat,boat capsize,capsized boat,capsize,boat capsized in godavari,boat capsizes in godavari,boat capsized in godavari river,boat capsizes in godavari river,mp boat capsize,andhra boat capsize,tourist boat,boat capsizes in ap,boat accident,boat sinks,andhra boat capsizes,boat capsized in river,boat tragedy,east godavari boat capsize,andhra pradesh boat capsize,పాపికొండలు,బోటు,మునక,బోటు బోల్తా,ప్రమాదం,ముఖ్యమంత్రి వైఎస్ జగన్,తూర్పు గోదావరి, గోదావరి ప్రవాహం,మృతుల సంఖ్య,
గోదావరిలో బోట్లు (File)


ప్రస్తుతం బోటు నదిలో 150 మీటర్ల లోతులో ఇసుక, బురదలో కూరుకుపోయిందని అంచనా. ఇప్పుడు దానికి లంగర్‌ను తగిలించాల్సి ఉంటుంది. ఇందుకోసం గజ ఈతగాళ్లను పంపుతారని తెలిసింది. ఇందుకోసం... 3000 అడుగుల ఇనుప తాడును, వెయ్యి మీటర్ల నైలాన్ తాడును వాడుతున్నారు. ప్రస్తుతం అక్కడి వాతావరణం పూర్తి అనుకూలంగా ఉంది. అందువల్ల గజ ఈతగాళ్లు లోపలికి వెళ్లి... లంగర్‌ను బోటుకు తగిలించాలి. బోటుకు ఉండే ఇనుప రాడ్డులకు దాన్ని తగిలించే అవకాశాలున్నాయి.

ఇది గనక సక్సెస్ అయితే... బోటును లాగేయడమే మిగిలిన టార్గెట్ అవుతుంది. ఐతే... ఇలా బోటును లాగేటప్పుడు అది ముక్కలైపోకుండా జాగ్రత్తగా, నెమ్మదిగా లాగాల్సి ఉంటుంది. అందువల్ల ఈ ప్రక్రియ కాస్త నెమ్మదిగా సాగే అవకాశాలున్నాయి. అయినప్పటికీ దీన్ని సక్సెస్ చేస్తామని ధర్మాడి సత్యం బృందం చెబుతోంది.బోటు ప్రమాద వివరాలు :
- ప్రమాదం జరిగిన రోజు సెప్టెంబర్ 15
- బోటులో ప్రయాణించినవారు 77 మంది
Loading...
- సురక్షితంగా బయటకు వచ్చినవారు 26 మంది
- కనిపించకుండా పోయిన వారు 51 మంది
- ఇప్పటివరకూ లభ్యమైన మృతదేహాలు 40
- 11 మంది బోటులో ఉన్నట్లు అనుమానాలు

 

Pics : హాట్ పోజులతో హీట్ పెంచుతున్న అంకితా దవే


ఇవి కూడా చదవండి :


ఆర్టీసీ సమ్మెపై నేడు హైకోర్టులో విచారణ... ఏం జరుగుతుంది?

Health Tips : పట్టులాంటి జుట్టు కావాలా... ఉల్లిపాయలతో ఇలా చెయ్యండి

Health Tips : ఎంతకీ చుండ్రు తగ్గట్లేదా? ఇలా చెయ్యండి చాలు


Health Tips : చక్కటి ఆరోగ్యానికి 5 సూత్రాలు... పాటిస్తే ఎంతో మేలు


Health Tips : టమాటాలతో 10 అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు...

First published: October 18, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...