గోదావరిలో మరో మృతదేహం లభ్యం... బోటును లాగే ప్రయత్నాల్లో ముంబై బృందం

Godavari boat capsize : పాపికొండల్లోని... కచ్చలూరులో జరిగిన బోటు ప్రమాదంలో... ఇంకా 13 మంది మృతదేహాల ఆచూకీ తెలియాల్సి ఉండగా... నేడు మరో మృతదేహం బయటపడింది.

Krishna Kumar N | news18-telugu
Updated: September 20, 2019, 11:01 AM IST
గోదావరిలో మరో మృతదేహం లభ్యం... బోటును లాగే ప్రయత్నాల్లో ముంబై బృందం
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
రాజమహేంద్రవరం : తూర్పుగోదావరి జిల్లా... దేవీపట్నం మండలం... గోదావరిలో బోటు మునక విషాదంలో మరో మృతదేహం లభ్యమైంది. కచ్చులూరుకు దగ్గర్లోనే ఓ మహిళ మృతదేహం ఒడ్డుకు కొట్టుకొచ్చింది. ఆ మృతదేహాన్ని దేవీపట్నం పోలీస్ స్టేషన్‌కి తరలించారు. ఆమె ఎవరనేది తేలాలంటే DNA పరీక్షలు జరపాలని పోలీసులు చెబుతున్నారు. ఆమెతో కలిపి ఇప్పటి వరకు బయటపడిన మృతుల సంఖ్య 35కి చేరింది. గల్లంతైన వారిలో ఇంకా 12 మంది ఆచూకీ తెలియాల్సి ఉందని ప్రభుత్వం చెబుతోంది. విశాఖకు చెందిన అయిదుగురు... హైదరాబాద్, వరంగల్‌కు చెందిన ముగ్గురు... గోదావరి జిల్లాలకు చెందిన ఇద్దరు... నల్గొండ, నంద్యాల, మంచిర్యాలకు చెందిన ఒక్కొక్కరి ఆచూకీ తెలియాల్సి ఉంది.

నేడు ముంబై ప్లాన్‌తో బోటు వెలికితీత : కచ్చలూరు గోదావరిలో మునిగిన బోటును బయటకు తీయడం సాధ్యం కావట్లేదు. ప్రమాద స్థలంలో నది లోతు, నీటి వేగం, నీటి ప్రవాహం వల్ల బోటును బయటకు ఎలా తియ్యాలో కూడా తెలియట్లేదు. ఇప్పటివరకూ... ప్రయత్నాలన్నీ ఆలోచనలకే పరిమితమయ్యాయి తప్ప... ఎవరూ నదిలో దిగి... బోటును బయటకు తీసేందుకు ప్రయత్నించలేదు. బుధవారం ముంబై, కాకినాడ నుంచీ వచ్చిన నిపుణులు... రెండ్రోజులపాటూ చర్చలు జరిపారు. నదిలోతు, వేగం అన్నీ అంచనా వేసుకున్నారు.

మామూలుగా అయితే... యాంకర్ వేసి... 210 అడుగుల లోతున ఉన్న బోటును పైకి లాగాల్సి ఉంటుంది. కానీ... బావిలో బకెట్ వేసి తీసినంత ఈజీ కాదు. ఎందుకంటే... ఇక్కడ బోటు బురదలోంచీ బయటకు రావడమే కష్టం. వచ్చినా ప్రవాహ వేగానికి అది ముక్కలైపోయే ప్రమాదం ఉంటుంది. లేదంటే... యాంకర్‌ను వదిలించుకొని... ప్రవాహంలో కొట్టుకుపోయే పరిస్థితి ఉంటుంది. ముంబై టీమ్... చెప్పిన ప్లాన్ ప్రకారం... కాకినాడ అధికారులు ముందుకెళ్లే అవకాశాలున్నాయి. ప్రధానంగా యాంకర్‌తోపాటూ... ఇనుప గొలుసులు, ప్రొక్లెయిన్ లాంటివి ఉపయోగించాలనుకుంటున్నారు.

ఈ నెల 15న వశిష్ట పున్నమి రాయల్ అనే బోటు ప్రమాదం జరిగింది. బోటులోని 73 మందిలో... 26 మంది ప్రాణాలతో బయటపడ్డారు. 35 మంది మృతదేహాలు లభించాయి.

First published: September 20, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు