బోటు ప్రమాదం జరిగిన ఆరోజు అసలు ఏం జరిగింది?

సెప్టెంబర్ 15వ తేదీ. తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం నుంచి పాపికొండలు విహారయాత్రకు లాంచీలు బయల్దేరాయి. అందరితో పాటు రాయల్ వశిష్ట అనే బోటులో కూడా 77 మంది ప్రయాణికులు విహారయాత్రను ప్రారంభించారు.

news18-telugu
Updated: October 22, 2019, 4:17 PM IST
బోటు ప్రమాదం జరిగిన ఆరోజు అసలు ఏం జరిగింది?
గోదావరిలో మునిగిన వశిష్ట బోటు
  • Share this:
తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం సమీపంలోని కచ్చలూరు వద్ద బోటు ప్రమాద ఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర విషాదం నింపింది. ఈ దుర్ఘటనలో ఏపీతో పాటు.. తెలంగాణకు చెందిన వారు కూడా మృతిచెందారు. ఈ ప్రమాదం గురించి చాలా సందేహాలు ఉన్నాయి.అసలు ప్రమాదం ఎలా జరిగింది? వర్షాలు పడుతున్న సమయం. గోదావరిలో వరద ఉధృతి కూడా ఎక్కువగా ఉంది. మరి అలాంటి సమయంలో పాపికొండలు విహార యాత్రకు ఎలా అనుమితి ఇచ్చారు. ఇలా అనేక ప్రశ్నలు ప్రమాదం జరిగిన సమయంలో తలెత్తాయి. ప్రమాదానికి గురైన బోటులో బోటులో ఎంతమంది ఉన్నారు? ఎంతమందిని రక్షించారు, ఎంతమంది గల్లంతయ్యారు?, అనే అంశాలపై పర్యాటకుల బంధువులతోపాటు ప్రజల్లో కూడా గందరగోళం ఏర్పడింది.

సెప్టెంబర్ 15వ తేదీ. తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం నుంచి పాపికొండలు విహారయాత్రకు లాంచీలు బయల్దేరాయి. అందరితో పాటు రాయల్ వశిష్ట అనే బోటులో కూడా 77 మంది ప్రయాణికులు విహారయాత్రను ప్రారంభించారు. కొందరు కుటుంబసభ్యులతో, మరికొందరు స్నేహితులతో పాపికొండల అందాలు చూసేందుకు బయల్దేరారు.పాటలు, డాన్సులతో సందడి చేశారు. కానీ ఆ ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. వారిలో చాలామంది ఒడ్డుకు చేరలేదు. మధ్యాహ్నం సుమారు 1.45 గంటల సమయంలో కచ్చులూరు వద్దకు రాగానే ప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా వారు ప్రయాణిస్తున్న బోటు బోల్తా పడింది. ఏం జరిగింది అర్థం అయ్యేలోపే అనేకమంది జలసమాధి అయ్యారు. అ సమయంలో కేవలం 26మంది మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు.మిగిలినవారంతా మరణించారు. అందులో ఇప్పటివరకు 39మంది మృతదేహాలు బయటకు తీశారు. మరో 12మంది ఆచూకీ మాత్రం ఈరోజువరకు దొరకలేదు.

ఈ ఘటనపై వశిష్ట బోటు యజమాని కోడిగుడ్ల వెంకటరమణ కూడా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బోటు ప్రమాదానికి గురైన ప్రదేశంలో పెద్ద సుడిగుండం ఉంటుందని.. ఆ కారణంగానే డ్రైవర్లు బోటును అదుపు చేయలేకపోయారని అన్నారు.బోటు కెపాసిటీ 90 మంది ప్రయాణికులు అని.. బోటులో 150 వరకు లైఫ్ జాకెట్స్ ఉన్నాయని చెప్పారు.నిజానికి వరద ప్రవాహం ఎక్కువగా ఉండటంతో పాపికొండలు టూర్‌కి దేవీపట్నం పోలీసులు వారించారని చెప్పారు. అయితే బోటు డ్రైవర్లు మాత్రం వారి మాట వినకుండా బయలుదేరారని అన్నారు. నదిలో వరద ఉధృతి, బోటుప్రమాదం జరిగిన ప్రాంతంలో సుడిగుండాలు కారణాలు ఏవైనా సరే... మొత్తంమీద అన్ని కలిసి 51మంది ప్రాణాలు బలితీశాయన్నది మాత్రం వాస్తవం. తెలుగు రాష్ట్రాల చరిత్రలోనే ఆరోజు ఓ చీకటి దినం.
Published by: Sulthana Begum Shaik
First published: October 22, 2019, 4:17 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading