అందుకే బోటు ప్రమాదం... కచ్చులూరులో మూఢనమ్మకాలు

శివుడికి ఇష్టమైన రోజు సోమవారం.... అది ఈరోజే కాబట్టి ఇవాళ తప్పకుండా బోటు బయటకు వచ్చేస్తుందని చెబుతున్నారు.

news18-telugu
Updated: October 21, 2019, 4:25 PM IST
అందుకే బోటు ప్రమాదం... కచ్చులూరులో మూఢనమ్మకాలు
అందుకే బోటు ప్రమాదం... కచ్చులూరులో మూఢనమ్మకాలు
  • Share this:
పాపికొండలు విహారయాత్రకు వెళ్తున్న లాంచీ .... తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద మునిగిని విషయం తెలిసిందే. ఈ ప్రమాదం జరిగి దాదాపుగా 36 రోజులు కావస్తున్న ఇప్పటివరకు బోటును మాత్రం బయటకు తీయలేదు. ఇంకా కొన్ని మృతదేహాల ఆచూకీ కూడా లభ్యం కాలేదు. దీంతో బోటులోనే ఆ మృతదేహాలు చిక్కుకొని ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే.. కొన్ని రోజులుగా బోటు వెలికితీత పనుల్ని కాకినాడకు చెందిన ధర్మాడి సత్యం టీం చేపట్టింది. నిన్నట్నుంచి విశాఖ నుంచి సీ డ్రైవర్స్‌ను తీసుకొచ్చి బోటును బయటకు తీసేందుకు చర్యలు వేగవంతం చేస్తున్నారు.

శివుడి ఆగ్రహంతోనే బోటు ప్రమాదం ?

ఈ నేపథ్యంలో కచ్చలూరులో కొన్ని వాదనలు వినిపిస్తున్నాయి. బోటులో మద్యాన్ని తీసుకొచ్చినందుకే బోటు మునిగిందని కొందరు చెబుతన్నారు. ఇంకొందరు శివుడి ఆగ్రహంతోనే ఈ ప్రమాదం జరిగిందని నమ్ముతున్నారు.  కచ్చులూరు మందం వద్ద గోదావరిలో జరిగిన బోటు ప్రమాదానికి మహాశివుడి ఆగ్రహమే కారణమనే సందేహం శివభక్తుల్లో వ్యక్తమవుతోంది. ఈ విషయంపై సమీప గ్రామాల్లో వారు పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. గోదావరిలో జరిగే ప్రమాదాలు ఎప్పుడూ 15నే జరుగుతాయని, అది కూడా అమావాస్య, పౌర్ణమి దినాల్లో జరుగుతాయని చెబుతున్నారు. అందుకు కొన్ని చారిత్రాత్మకమైన ఆధారాలు ఉన్నాయంటున్నారు. ప్రమాదం జరిగిన ప్రదేశానికి సమీపంలోని కొండల్లో శివాలయం ఉంది. పాపికొండల పర్యాటకానికి వెళ్లే పర్యాటకుల బోట్లు, లాంచీల రాకపోకల్లో అక్కడి శివుడిని దర్శించుకుంటారు.

గతంలో జరిగిన ప్రమాదాలకు కూడా శివభక్తులు చెబుతున్న వాటికి సారూప్యత కనిపించడం విశేషం. 2018, మే 15న అదే గోదావరి నదిలో మంటూరు-వాడపల్లి సమీపంలో లాంచీ మునిగిపోయింది. 19మంది మృత్యువాత పడ్డారు. అంతకుముందు కొండమొదలు సమీపంలోనే మే 15న లాయర్ల బృందంతో వెళ్తున్న బోటు ప్రమాదానికి గురై ఆరుగురు మృత్యువాత పడ్డారు. 1956, 1971లో జరిగిన ప్రమాదాలు కూడా 15వతేదీనే జరిగాయని చెప్తున్నారు. గత నెల 15న బోటు ప్రమాద ఘటన జరిగిన ప్రదేశం ఒడ్డున శివభక్తులు శివలింగాన్ని ప్రతిష్టించి పూజలు చేస్తున్నారు. భవిష్యత్‌లో ఎలాంటి ప్రమాదం జరగకూడదని వారు కోరుకుంటున్నారు

కచ్చలూరులో కొందరు మాత్రం బోటు తొందరగా బయటకు రావాలంటూ పూజలు చేస్తున్నారు. శివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు కాబట్టి సోమవారం రోజు ప్రత్యేకంగా స్వామివారిని పూజిస్తున్నారు. బోటు ప్రమాదం జరిగిన సమయంలో రెండుగంటల్లో బోటును బయటకు తీస్తానని సవాల్ విసిరిన శివయ్య అనే వ్యక్తి ఈ ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నాడు. ఇవాళ ఎట్టి పరిస్థితుల్లోనూ బోటు బయటకు వస్తుందంటున్నాడు. దేవుడి అనుగ్రహంతోనే బోటు బయటకు రావాలన్నాడు. బోటులో కొందరు వ్యభిచారలు నిర్వహిస్తున్నారు. మనుషులు ఎన్ని తప్పులు చేసినా.. దేవుడు మాత్రం మనుషుల్ని కాపాడటానికే చూస్తానన్నాడు. కానీ మృత్యువే మనుషుల్ని ముంచెత్తుతోందన్నాడు శివయ్య. ఇది బోటు డ్రైవర్ నిర్లక్ష్యమే కానీ.. దేవుడి విధించిన శిక్ష కాదన్నాడు శివయ్య. శివుడికి ఇష్టమైన రోజు సోమవారం.... అది ఈరోజే కాబట్టి ఇవాళ తప్పకుండా బోటు బయటకు వచ్చేస్తుందని శివయ్య చెబుతున్నాడు. మరి శివయ్య నమ్మకం ఎంతవరకు నిజం అవుతుందో చూడాలంటే ఇంకాస్త సమయం వేచి ఉండాల్సిందే.
Published by: Sulthana Begum Shaik
First published: October 21, 2019, 4:05 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading