బయటపడ్డ బోటు పైకప్పు... రాయల్ వశిష్ట బోర్డు

ఈ ప్రమాదం జరిగి దాదాపుగా 36 రోజులు కావస్తున్న ఇప్పటివరకు బోటును మాత్రం బయటకు తీయలేదు. కాసేపటి క్రితమే బోటు పైకప్పును బయటకు తీశారు. దీంతో పాటు రాయల్ వశిష్ట బోర్డు కూడా బయటపడింది

news18-telugu
Updated: October 21, 2019, 4:23 PM IST
బయటపడ్డ బోటు పైకప్పు... రాయల్ వశిష్ట బోర్డు
బయటపడ్డ బోటు పైకప్పు... రాయల్ వశిష్ట బోర్డు
news18-telugu
Updated: October 21, 2019, 4:23 PM IST
గతనెల 15న పాపికొండలు విహారయాత్ర విషాదయాత్రగా మారింది.  దేవీపట్నం మీదుగా దాదాపు 60మందితో వెళ్తున్న లాంచీ .... తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద మునిగిని విషయం తెలిసిందే. ఈ ప్రమాదం జరిగి దాదాపుగా 36 రోజులు కావస్తున్న ఇప్పటివరకు బోటును మాత్రం బయటకు తీయలేదు. ఇంకా కొన్ని మృతదేహాల ఆచూకీ కూడా లభ్యం కాలేదు. దీంతో బోటులోనే ఆ మృతదేహాలు చిక్కుకొని ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే.. కొన్ని రోజులుగా బోటు వెలికితీత పనుల్ని కాకినాడకు చెందిన ధర్మాడి సత్యం టీం చేపట్టింది. నిన్నట్నుంచి విశాఖ నుంచి సీ డ్రైవర్స్‌ను తీసుకొచ్చి బోటును బయటకు తీసేందుకు చర్యలు వేగవంతం చేస్తున్నారు.

అయితే ఈ నేపథ్యంలో నదిలోకి వెళ్లి ... మునిగిన బోటును గుర్తించిన సీ డ్రైవర్స్ బోటుకు కొక్కాలు అమర్చారు. కాసేపటి క్రితమే బోటు పైకప్పును బయటకు తీశారు. దీంతో పాటు రాయల్ వశిష్ట బోర్డు కూడా బయటపడింది. బోటుకు సంబంధించి బయటపడుతున్న శిథిలాల్ని ఒక్క దగ్గర పేర్చుతున్నారు. ఇవాళ సాయంత్రానికల్లా బోటు బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు ఇప్పటివరకు ఆచూకి దొరకని మృతదేహాల కుటుంబసభ్యులు తమ వారి కోసం ఎదురుచూస్తున్నారు. చివరి చూపు అయిన దక్కుతుందా లేదోనని పడిగాపులు కాస్తున్నారు.

First published: October 21, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...