గోదావరిలో నిలిచిన బోటు వెలికితీత చర్యలు

మరొవైపు బాధితులు తమవారి జాడకోసం రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రి వద్ద పడిగాపులు పడుతున్నారు.

news18-telugu
Updated: September 21, 2019, 2:46 PM IST
గోదావరిలో నిలిచిన బోటు వెలికితీత చర్యలు
మరొవైపు బాధితులు తమవారి జాడకోసం రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రి వద్ద పడిగాపులు పడుతున్నారు.
news18-telugu
Updated: September 21, 2019, 2:46 PM IST
గోదావరిలో కచ్చులూరు వద్ద ప్రమాదానికి గురైన బోటు వెలికితీత చర్యలు నిలిచిపోయాయి. ముంబాయి బృందం నివేదిక సమర్పించకుండా చర్యలు చేపట్టలేమని కాకినాడకు చెందిన ధర్మాడి సత్యం, ఉత్తరాఖండ్, డెహ్రాడూన్ నిపుణులు తేల్చిచెప్పారు. అయితే అధికారులు.. కచ్చులూరు ప్రాంతంలో మీడియాను అనుమతించడం లేదు. ఆ ప్రాంతం అంత విపరీతమైన దుర్వాసన వస్తుండడంతో ప్రస్తుతం కచ్చులూరులో 144 సెక్షన్ విధించారు.

ఈ ఉదయం కచ్చులూరు వద్ద మహిళ మృతదేహం లభ్యమైంది. ఆ డెడ్‌బాడీ విశాఖకు చెందిన అరుణదిగా గుర్తించారు. ఈ ప్రమాదంలో వారి కుటుంబం అంతా గల్లంతైంది. పిల్లలు ఇంకా దొరకాల్సి ఉంది. మిగతావారి కోసం ఇప్పటివరకూ ముమ్మరంగా గాలించిన బృందాలు ఇవాళ మాత్రం వెనకంజ వేశాయి. మధ్యాహ్నం నుంచి ఘటనా స్థలంలో గాలింపు చర్యలు నిలిపివేశారు.

మరొవైపు బాధితులు తమవారి జాడకోసం రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రి వద్ద పడిగాపులు పడుతున్నారు. రాజమహేంద్రవరం సబ్‌కలెక్టర్‌ను కలిసి తమవారి ఆచూకీ తెలియజేయాలని వేడుకున్నారు. మంత్రి కన్నబాబు రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రి వద్దకు వచ్చి మీడియాతో మాట్లాడారు. ఇప్పటివరకూ 73 మందే అనుకున్నామని... బోటులో ప్రయాణించినవారి సంఖ్య 77 వరకూ ఉన్నట్లు గుర్తించామన్నారు. మరో 16మంది కోసం గాలిస్తున్నామని తెలిపారు..

First published: September 21, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...