బోటు ప్రమాదంతో గోదావరి మైలు పడిందా? నీళ్లుముట్టని ఆ గ్రామాలు

ఇదిలా ఉంటే మరోవైపు గోదావరి పరివాహక ప్రాంతాల గ్రామాల ప్రజలు ఈ బోటు ప్రమాదంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గోదారవరి నది గోదారమ్మగా కొలిచే ఆయా గ్రామాలు... నదీమతల్లి మైలు పడిందని చెబుతున్నారు.

news18-telugu
Updated: September 22, 2019, 11:48 AM IST
బోటు ప్రమాదంతో గోదావరి మైలు పడిందా? నీళ్లుముట్టని ఆ గ్రామాలు
దేవీపట్నంలో పడవ బోల్తా...
  • Share this:
గత ఆదివారం పాపికొండలు గోదావరి నదిలో జరిగిన బోటు ప్రమాదంతో అనేక ఆందోళనలు నెలకొన్నాయి. ప్రమాదం జరిగి వారం రోజులు గడుస్తున్నా ఇంకా కొంతమంది ఆచూకీ ఇప్పటికీ దొరకలేదు. ఇంకా 14మంది ఆచూకీ దొరకలేదని అధికారులు చెబుతున్నారు. దీంతో వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇదిలా ఉంటే మరోవైపు గోదావరి పరివాహక ప్రాంతాల గ్రామాల ప్రజలు ఈ బోటు ప్రమాదంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గోదారవరి నది గోదారమ్మగా కొలిచే ఆయా గ్రామాలు... నదీమతల్లి మైలు పడిందని చెబుతున్నారు.

చివరి మృతదేహాన్ని వెలికితీసే వరకూ గోదావరి నీటిని వాడేది లేదని కచ్చులూరతో పాటు ఆ దిగువ ప్రాంతాల ప్రజలు తేల్చి చెబుతున్నారు. ఉభయ గోదావరి జిల్లాలకు జీవనదిగా ఉన్న గోదావరిని, ఈ ప్రాంత ప్రజలు నిత్యమూ తల్లిగా, దేవతగా పూజిస్తారు. వరదలు వచ్చిన వర్షాలు వచ్చి నదీమతల్లికి పూజలు చేస్తుంటారు. జూన్ తొలివారంలో కాలువలకు నీటిని విడుదల చేసే వేళ, కొబ్బరికాయలు కొట్టి, ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

తాజాగా పాపికొండలు విహారాయాత్రలో భాగంగా దేవీపట్నం కచ్చులూరు వద్ద గోదావరి నదిలో లాంచీ బోల్తా పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో చాలామంది చనిపోగా.. ఇంకా కొన్ని మృతదేహాలు నదిలోనే ఉన్నాయి. దీంతో ఆ నీటిని వాడేందుకు కచ్చులూరుతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అయిష్టత చూపుతున్నారు. మృతదేహాలన్నీ బయటకు వచ్చాక, నదీమతల్లిని శుద్ధి చేసిన తరువాతనే నీటిని వాడుకుంటామని తెగేసి చెబుతున్నారు. గత సంవత్సరం మే 15న మంటూరు వద్ద ప్రమాదం జరిగిన సమయంలో కూడా ఆయాగ్రామల ప్రజలు గోదావరి నీటిని దూరం పెట్టారు. మొత్తం 10 నుంచి 12 గ్రామాల్లో ఇదే పరిస్థితి నెలకొని ఉంది. కాస్త కష్టమైనా... దూరమైనా, బోర్లు, కొండలపై నుంచి వచ్చే జల కాలువల వద్దకు వెళ్లి నీటిని తెచ్చుకుంటున్నారు.కానీ గోదారి నీటి మాత్రం ముట్టడం లేదు.
First published: September 22, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading