కచ్చలూరుకు డీప్ వాటర్ డ్రైవర్లు.... నేడు బోటు బయటకు తీసే అవకాశం

ప్రస్తుతం ఒడ్డుకు 190 అడుగులు దూరం, గోదావరిలో 38 అడుగుల లోతులో బోట్ ఉన్నట్లు నిర్ధారించారు. డీప్ వాటర్ డ్రైవర్ల రాకతో నేడు ఆపరేషన్ వేగవంతమై బోట్ బయటకు వచ్చే అవకాశలు కనిపిస్తున్నాయి.

news18-telugu
Updated: October 20, 2019, 11:15 AM IST
కచ్చలూరుకు డీప్ వాటర్ డ్రైవర్లు.... నేడు బోటు బయటకు తీసే అవకాశం
గోదావరి బోటు ప్రమాద స్థలం వద్ద సహాయకచర్యలు (File)
  • Share this:
కచ్చలూరు వద్ద మునిగిన రాయల్ వశిష్ట బోటు వెలికితీత ఆపరేషన్ ఆరవరోజు కొనసాగుతోది. వెలికితీత చర్యల్లో పాల్గొనేందుకు కచ్చులూరు వద్దకు ఎనిమిది అండర్ వాటర్ డ్రైవర్లు చేరుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నంకు విశాఖ నుంచి స్కూబా డైవర్లు చేరుకున్నారు.కచ్చులూరు వద్ద గోదావరి నదిలో మునిగిపోయిన ‘రాయల్‌ వశిష్ట’ బోటు ఎక్కడ ఉన్నది స్పష్టంగా తెలియడంతో స్కూబా డైవర్ల అవసరం ఉందని రెస్క్యూటీం నాయకుడు ధర్మాడి సత్యం అధికారులకు తెలియజేసిన విషయం తెలిసిందే.దీంతో నీటిలోకి వెళ్లి బోటుకు కొక్కేలు వేయనున్నారు డీప్ వాటర్ డ్రైవర్లు . ప్రస్తుతం ఒడ్డుకు 190 అడుగులు దూరం, గోదావరిలో 38 అడుగుల లోతులో బోట్ ఉన్నట్లు నిర్ధారించారు. డీప్ వాటర్ డ్రైవర్ల రాకతో నేడు ఆపరేషన్ వేగవంతమై బోట్ బయటకు వచ్చే అవకాశలు కనిపిస్తున్నాయి.

తూర్పుగోదావరి జిల్లా సత్యం సూచన మేరకు అధికారులు విశాఖలోని డైవర్లతో మాట్లాడారు. వారు ఈరోజు దేవీపట్నం చేరుకున్నారు. అయితే డైవర్లను కచ్చులూరు పంపే విషయంలో ధర్మాడి సత్యం, పోలీసుల మధ్య వివాదం నెలకొంది. ఉన్నతాధికారుల అనుమతి లేదంటూ పోలీసులు డైవర్లను ఘటనా స్థలి అయిన కచ్చులూరుకు పంపేందుకు నిరాకరించారు. కాకినాడ పోర్టు అధికారి ఆదినారాయణ జోక్యం చేసుకుని డైవర్లను ఘటనా స్థలికి పంపించేందుకు అనుమతించి, బోటు ఏర్పాటు చేయడంతో సమస్య పరిష్కారం అయింది.

First published: October 20, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు