‘అమరావతి’పై మరో మెలిక పెట్టిన రాజధాని కమిటీ

ప్రస్తుతం రాజధాని కోసం నిర్మాణలు జరుపుతున్న ప్రాంతాల్లో కాకుండా... మంగళగిరి ప్రాంతాల్లో శాశ్వతమైన భవనాలు నిర్మించుకోవాలని జీఎన్ రావు కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో తెలిపింది.

news18-telugu
Updated: December 20, 2019, 6:16 PM IST
‘అమరావతి’పై మరో మెలిక పెట్టిన రాజధాని కమిటీ
ఏపీలో మూడు రాజధానుల అంశంపై టీడీపీ రాజకీయ పోరాటం సాగిస్తున్న సంగతి తెలిసిందే. మూడు రాజధానులు వద్దు... అమరావతి మాత్రమే రాజధానిగా కొనసాగాలంటూ ఆ పార్టీ గట్టిగా వాదిస్తోంది. ఈ అంశంపైనే ప్రస్తుతం ఏపీలో రాజకీయాలు నడుస్తున్నాయి.
  • Share this:
అంతా అనుకున్నట్టుగానే, సీఎం జగన్ అసెంబ్లీలో చెప్పిన విధంగానే ఏపీకి మూడు రాజధానులు ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందని జీఎన్ రావు కమిటీ తమ సిఫార్సుల్లో పేర్కొంది. ఇదే విషయాన్ని కమిటీ చైర్మన్ జీఎన్ రావు వివరించారు. అమరావతిలో హైకోర్టు బెంచ్, సచివాలయం, రాజ్ భవన్ ఏర్పాటు చేసుకోవాలని... ఆ రకంగా అమరావతి లెజిస్లేటివ్ క్యాపిటల్’గా కొనసాగుతుందని ఆయన తెలిపారు. అయితే ఇక్కడే ఆయన మరో కీలకమైన అంశాన్ని సూచించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రస్తుతం రాజధాని కోసం నిర్మాణలు జరుపుతున్న ప్రాంతాల్లో కాకుండా... మంగళగిరి ప్రాంతాల్లో శాశ్వతమైన భవనాలు నిర్మించుకోవాలని జీఎన్ రావు కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో తెలిపింది.

వరదల కారణంగా ఇబ్బందులు రాకుండా ఉండటంతో పాటు కొత్తగా భూసేకరణ చేయకుండా ఉండాలంటే మంగళగిరి ప్రాంతాల్లో ఈ భవనాల నిర్మాణ చేపడితే బాగుంటుందని కమిటీ సూచించింది. దీంతో అమరావతిలోనూ కొత్తగా నిర్మించబోయే భవనాలు... మంగళగిరి ప్రాంతంలో వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా ఇదే రకమైన సూచనలు చేయడంతో... కమిటీ కూడా ఇదే రకమైన సూచనలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

మరోవైపు ఇటీవల మంగళగిరిని మంగళగిరి మున్సిపాలిటీ పరిధి పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సెకండ్ గ్రేడ్ మున్సిపాలిటీగా ఉన్న మంగళగిరి పరిధి ఫస్ట్ గ్రేడ్ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఇకపై అమరావతిలో చేపట్టబోయే నిర్మాణాలను మంగళగిరి ప్రాంతంలో చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
Published by: Kishore Akkaladevi
First published: December 20, 2019, 6:16 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading